NTA| జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 2024 క్యాలెండర్ ప్రకటించిన ఎన్టీఏ
National Testing Agency | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో యూజీ ఇంజినీరింగ్ (JEE), మెడిసిన్ (NEET) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలతోపాటు యూజీసీ- నెట్ (UGC-NET) పరీక్షల క్యాలెండర్‌ను ఎన్టీఏ విడుదల చేసింది ఆ వివరాలు సంక్షిప్తంగా నమస్తే తెలంగాణ పాఠకుల కోసం…
జేఈఈ (మెయిన్) 2024 సెషన్-1
- దేశంలో ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ఐఐటీలో ప్రవేశానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత కోసం దీన్ని నిర్వహిస్తారు.
- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా యూజీ ఇంజినీరింగ్ ప్రవేశాలను కల్పిస్తారు.
- జేఈఈ మెయిన్‌లో టాప్-20 పర్సంటైల్‌లో వున్నవారు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు
- ఏటా ఈ పరీక్షను రెండుస్లారు నిర్వహిస్తారు
జేఈఈ మెయిన్ సెషన్-1 - ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీన్ని 2024, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు
జేఈఈ మెయిన్ సెషన్-2 - ఈ పరీక్షను 2024, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహిస్తారు
నీట్-2024
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- యూజీ పరీక్షను ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు
- ఇది పెన్, పేపర్/ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తారు.
- ఈ పరీక్షను 2024, మే 5న నిర్వహిస్తారు
సీయూఈటీ-యూజీ 2024
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ)-2024
- దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు పలు ఇతర యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు
- ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
- దీన్ని 2024, మే 15 నుంచి మే 31 మధ్యలో నిర్వహించనున్నారు
సీయూఈటీ – పీజీ 2024
- పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష ఇది.
- ఇది సీబీటీ విధానంలో నిర్వహిస్తారు
- 2024, మార్చి 11 నుంచి 28 మధ్య నిర్వహిస్తారు
యూజీసీ-నెట్ (సెషన్ -1)
- లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు అర్హతతోపాటు జేఆర్ఎఫ్ కోసం నిర్వహించే పరీక్ష ఇది.
- ఏటా దీన్ని రెండుసార్లు నిర్వహిస్తారు.
- దీన్ని సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తారు
- నెట్ సెషన్-1ను పరీక్షను 2024, జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య నిర్వహిస్తారు
నోట్: పరీక్షల దరఖాస్తు, ఇన్ఫర్మేషన్ బులిటిన్‌ను ఎన్టీఏ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది - సీబీటీ పరీక్షల ఫలితాలను పరీక్ష నిర్వహించిన మూడువారాల్లో ఎన్టీఏ ప్రకటిస్తుంది
- నీట్ యూజీ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ 2024 జూన్‌లో వెల్లడిస్తుంది.
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: https://www.nta.ac.in
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
Previous article
Geography- Groups Special | ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ నీళ్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?