ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
5. సముద్ర అగాధాలు, కందకాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి.
1. మేరియానా ట్రెంచ్- పసిఫిక్ మహాసముద్రం
2. ప్యూర్టోరికో ట్రెంచ్-
అట్లాంటిక్ మహాసముద్రం
3. జావా ట్రెంచ్- హిందూ మహాసముద్రం
4. కురిల్-కామ్చట్కా ట్రెంచ్- ఆర్కిటిక్ మహాసముద్రం పై జతల్లో ఎన్ని సరిగ్గా సరిపోలాయి?
A) ఒకటి మాత్రమే B) రెండు మాత్రమే
C) కేవలం మూడు D) మొత్తం నాలుగు
సమాధానం: B
వివరణ: మేరియానా ట్రెంచ్ అనేది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో, మేరియానా దీవులకు తూర్పున 200 కి.మీ. (124 మైళ్లు) దూరంలో ఉన్న ఒక సముద్ర అగాధం. ఇది భూమిపై లోతైన సముద్రపు ట్రెంచ్. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని పొడవు 2,550 కి.మీ. (1,580 మైళ్లు), వెడల్పు 69 కి.మీ. (43 మైళ్లు) ఉంటుంది. చాలెంజర్ డీప్ అనేది ఇందులో లోతైన ప్రదేశం. అందువల్ల, మొదటి జత సరిగ్గా సరిపోలింది.
గమనిక: ప్రపంచంలో పొడవైన ట్రెంచ్ పెరూ-చిలీ ట్రెంచ్. ఇది దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంట దాదాపు 5900 కి.మీ. (సుమారు 3,700 మైళ్లు) విస్తరించి ఉంది.
- అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద సముద్రం. ప్యూర్టోరికో ట్రెంచ్ కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య సరిహద్దులో ఉంది. ప్యూర్టోరికో ట్రెంచ్ 1,090 మైళ్లు (1,750 కి.మీ.) పొడవు, 60 మైళ్లు (100 కి.మీ.) వెడల్పుతో ఉంది. అందువల్ల రెండో జత సరిగ్గా సరిపోలింది.
- జావా ట్రెంచ్ అనేది హిందూ మహాసముద్రంలోనే కాదు అసలు ఉనికిలోనే లేదు. అందువల్ల మూడో జత సరిగ్గా సరిపోలలేదు.
- కురిల్-కామ్చట్కా ట్రెంచ్ అనేది ఆర్కిటిక్ మహాసముద్రంలో కాకుండా వాయవ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది కురిల్ దీవుల నుంచి కామ్చట్కా ద్వీపకల్పం వరకు విస్తరించి ఉంది. అందువల్ల నాలుగో జత సరిగ్గా సరిపోలలేదు. అందువల్ల ఎంపిక (B) సరైన సమాధానం.
ప్రపంచంలోని ముఖ్యమైన ట్రెంచ్‌లు, అవి ఉన్న ప్రాంతాలు
- అలూటియన్ ట్రెంచ్- అలూటియన్ దీవులకు దక్షిణాన, అలాస్కాకు పశ్చిమాన
- బౌగైన్విల్లే ట్రెంచ్- న్యుగినియాకు దక్షిణంగా
- కేమాన్ ట్రెంచ్- పశ్చిమ కరేబియన్ ప్రాంతం
- హికురంగి ట్రెంచ్- న్యూజిలాండ్ తూర్పు భాగం
- కెర్మాడెక్ ట్రెంచ్- న్యూజిలాండ్ ఈశాన్య భాగం
- మనీలా ట్రెంచ్- ఫిలిప్పీన్స్
- మధ్య అమెరికా ట్రెంచ్- తూర్పు పసిఫిక్ మహాసముద్రం, మెక్సికో తీరం, గ్వాటెమాల, ఎల్ సాల్వెడార్, నికరాగ్వా, కోస్టారికా
- పెరూ-చిలీ ట్రెంచ్- తూర్పు పసిఫిక్ మహాసముద్రం, పెరూ & చిలీ తీరంలో
- ప్యూర్టోరికో ట్రెంచ్- కరేబియన్, అట్లాంటిక్ మహాసముద్రాల సరిహద్దు
- పుయిసెగూర్ ట్రెంచ్- న్యూజిలాండ్ నైరుతి భాగం
- సుందా ట్రెంచ్- జావాకు దక్షిణం నుంచి సుమత్రా, అండమాన్, నికోబార్ దీవులకు పశ్చిమాన
6. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఉండేవారు?
1. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2. నామినేటెడ్ పార్లమెంటు సభ్యులు
3. రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
A) 1, 2 B) 1 C) 2, 3 D) 1, 2, 3
సమాధానం: A
వివరణ: ఉపరాష్ట్రపతిని పరోక్ష ఎన్నికల పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికవుతాడు.
ఈ ఎలక్టోరల్ కాలేజీ కింది రెండు అంశాల్లో రాష్ట్రపతి ఎన్నిక కోసం గల ఎలక్టోరల్ కాలేజీకి భిన్నంగా ఉంటుంది.
1) ఇందులో పార్లమెంటులో ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు ఉంటారు (రాష్ట్రపతి విషయంలో కేవలం ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారు).
2) ఇందులో వివిధ రాష్ర్టాల శాసన సభల సభ్యులు ఉండరు (రాష్ట్రపతి విషయంలో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు).
7. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC) ముఖ్యమైన లక్ష్యాలు ఏవి?
1. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రతల స్థిరీకరణ
2. ప్రపంచ వ్యాప్తంగా ఆహార
భద్రతకు భరోసా
3. ఓజోన్ పొర క్షీణించకుండా
జాగ్రత్తలు తీసుకోవడం
4. వాతావరణ మార్పులను తగ్గించడానికి పద్ధతులను అమలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడం
5. పారిశ్రామిక ప్రక్రియల్లో శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
A) 1, 2, 4 B) 2, 4, 5
C) 1, 4 D) 1, 4, 5
సమాధానం: C
వివరణ: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC) ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, దాని ఫలితంగా వచ్చే వాతావరణ మార్పులను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది.
దీని ముఖ్య లక్ష్యాలు
- వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు సాంద్రతలను ఒక స్థాయిలో స్థిరీకరించడం వల్ల వాతావరణ వ్యవస్థలో ప్రమాదకరమైన మానవజన్య జోక్యాన్ని నిరోధించవచ్చు.
- వాతావరణ మార్పులను తగ్గించడానికి, దాని ప్రతికూల ప్రభావాలకు అనుగుణంగా విధానాలను అమలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడం. అందువల్ల సరైన సమాధానం C.
8. కింది వాటిలో నీటిలో నివసించే ఏ జీవికి మొప్పలు ఉండవు?
A) ఆక్టోపస్ B) సిక్వ్డ
C) క్లౌన్ ఫిష్ D) తిమింగలం
సమాధానం: D
వివరణ: నీటిలో నివసించే చాలా జీవుల్లో కనిపించే శ్వాస అవయవాలు మొప్పలు. మొప్పలు నీటి నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను వదులుతాయి. ఆక్టోపస్, సిక్వ్డ, క్లౌన్ చేపలు, కప్ప డింభకం, రొయ్యలు మొదలైనవాటిలో మొప్పలు కనిపిస్తాయి. తిమింగలాల్లో ఊపిరితిత్తులు శ్వాసక్రియ అవయవాలుగా ఉంటాయి.
వివిధ జంతువుల శ్వాసక్రియ అవయవాలు
- వానపాము- చర్మం
- తిమింగలం- ఊపిరితిత్తులు
- సాలీడు, తేలు- బుక్ లంగ్స్
- బొద్దింక- శ్వాసనాళాలు (ట్రాకియా)
- డింభకం, చేప, రొయ్య- మొప్పలు
- కప్ప- చర్మం, ఊపిరితిత్తులు, నోటి కుహరం
- ఉభయచరాలు, క్షీరదాలు, పక్షులు- ఊపిరితిత్తులు
9. ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది?
A) 2.8% B) 3.9%
C) 4.2% D) 2.4%
సమాధానం: D
వివరణ: ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారతదేశం 2.4% వాటా కలిగి ఉంది. భారతదేశం 32,87,263 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందింది. రాణ్ ఆఫ్ కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు (తూర్పు-పడమర) 2,933 కి.మీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు (ఉత్తరం-దక్షిణం) 3,214 కి.మీ.భారతదేశం కంటే పెద్ద దేశాలు: రష్యా, చైనా, కెనడా, USA, బ్రెజిల్, ఆస్ట్రేలియా.
10. బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీలో కింది దేన్నిఉపయోగిస్తారు?
A) సోడియం క్లోరైడ్
B) కాల్షియం హైడ్రాక్సైడ్
C) కాల్షియం నైట్రేట్
D) సిల్వర్ బ్రోమైడ్ సమాధానం: D
వివరణ: సిల్వర్ బ్రోమైడ్ (AgBr): బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు.
సోడియం క్లోరైడ్: ఇది సాధారణ ఉప్పు. దీన్ని ఆహార పదార్థాల్లో రుచి కోసం ఉపయోగించటంతో పాటు ఆహార పదార్థాలను సంరక్షించడానికి/ నిల్వ చేయటానికీ ఉపయోగిస్తారు.
కాల్షియం హైడ్రాక్సైడ్: మురుగునీటి శుద్ధి, కాగితాల ఉత్పత్తి, ఆహార పదార్థాల ప్రాసెసింగ్ వంటి పారిశ్రామిక అవసరాలకు దీన్ని ఉపయోగిస్తారు. వైద్య రంగంలో దంతాల కోసం రూట్ కెనాల్ ఫిల్లింగ్స్‌లో తరచుగా కాల్షియం హైడ్రాక్సైడ్‌ను వినియోగిస్తారు.
కాల్షియం నైట్రేట్: ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో నత్రజని ఎరువుగా ఉపయోగిస్తారు.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు