TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్‌లో ప్రవేశాలు
TMREIS Adissions | ఉచిత విద్య, ఇంగ్లిష్ మీడియంలో చక్కటి బోధన, పక్కా బిల్డింగ్స్, ల్యాబ్స్‌తో సహా సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్రూమ్స్తోపాటు కంప్యూటర్ ల్యాబ్స్‌తో ప్రామాణిక విద్యను అందించే విద్యాసంస్థలే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా….
మైనారిటీ గురుకులాల్లో..
- రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 5,6,7,8 తరగతులు, ఇంటర్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి.
- ఈ పాఠశాలల్లో ప్రామాణిక విద్యా బోధనతోపాటు ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, స్పోర్ట్స్ డ్రెస్, కాస్మోటిక్స్ కిట్స్, హెల్త్‌కేర్, ఉచిత వసతి, భోజన తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది
- మొత్తం 204 టీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లో బాలురకు 107, బాలికలకు 97 పాఠశాలలు ఉన్నాయి. వీటిని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
- వీటితోపాటు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద పది తెలంగాణ మైనారిటీ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ కోర్సులను అందిస్తున్నాయి.
- మొత్తం 204 విద్యాసంస్థల్లో 12 టీఎంఆర్ జూనియర్ కాలేజీల్లో వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఈటీ, సీఎస్, సీటీ, టీ అండ్ హెచ్ఎం, ఎల్ఎం అండ్ డీటీ, ఏసీపీ, ఏ అండ్ టీ, సీజీటీ కోర్సులను
అందిస్తున్నారు.
స్కూల్స్ ప్రత్యేకతలు
- బాల, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు
- ప్రతి రోజు పౌష్టికాహారాన్ని అందిస్తారు
- డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ మల్టీమీడియా ఫెసిలిటీ
- చక్కటి సైన్స్ ల్యాబొరేటరీలు
- కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ
- ఆర్ఓ ప్లాంట్, వేడి నీటి సౌకర్యం
- 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో పాఠశాలల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు
- ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నారు
- ప్రతి పాఠశాలలో 640 మంది విద్యార్థులు ఉంటారు
- ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన, స్టేట్ సిలబస్
అర్హతలు
- 5వ తరగతిలో ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో నాలుగో తరగతి చదువుతున్న వారు అర్హులు. 2012, సెప్టెంబర్ 1 నుంచి 2015, ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలు అయితే 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు మించరాదు
నోట్: మిగిలిన తరగతులకు కూడా సంబంధిత తరగతికి ముందు తరగతి ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుతున్నవారు అర్హులు
ప్రవేశాలు
- ఐదో తరగతిలో మైనారిటీ విద్యార్థులకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ప్రకారం సీట్లను కేటాయిస్తారు. నాన్ మైనారిటీ విద్యార్థులకు లక్కీ డీప్ ద్వారా సీట్లను కేటాయిస్తారు
- 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలను మొదట వచ్చిన వారికి మొదట చొప్పున కేటాయిస్తారు
- ఇంటర్లో విద్యార్థులకు ఎస్ఎస్సీలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు
- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 6
వెబ్సైట్:www.tmreistelangana.cgg.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు