‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
51. కింది వాటిలో ఏది సరైనది?
నిశ్చితం (ఎ) – ప్రభుత్వం 1984లో
జయభారత్ రెడ్డి అధ్యక్షతన 1975
ఆఫీసర్స్ కమిటీని నియమించారు
కారణం (ఆర్) – 1975, అక్టోబర్ 18న
వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘనకు
గురయ్యాయని తెలంగాణ నాన్ గెజిటెడ్
ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు స్వామినాథన్
ఫిర్యాదుల వల్ల
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) (ఎ), (ఆర్) రెండూ సత్యం
(ఎ) కి (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సత్యం, కానీ
(ఎ) కి (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సత్యం, కానీ (ఆర్) అసత్యం
డి) (ఎ) అసత్యం, కానీ (ఆర్) సత్యం
జవాబు – ఎ
వివరణ – 1984లో జయభారత్‌రెడ్డి అధ్యక్షతన 1975లో ప్రభుత్వం కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌ని నియమించింది.
1975 అక్టోబర్ 18న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వును ఉల్లంఘించారని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు స్వామినాథన్ ఫిర్యాదు కారణం
52. జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పు – ముఖ్యాంశాల గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
1. భారత రాజ్యాంగంలోని అధికరణ 15 (3)లో పొందుపరిచిన అంశాలను అనుసరించి పార్లమెంట్ ఒక రాష్ట్రంలో గానీ, ఒక రాష్ట్రంలోని ప్రాంతంలో గానీ లేదా ఒక జిల్లాలో గానీ, లేదా తాలుకాలో లేదా ఒక గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నివాస అర్హతను నిర్దేశిస్తూ చట్టాన్ని రూపొందించడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం లేదు అని తీర్పులో వెల్లడించారు.
2. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ – 1957లోని 3వ సెక్షన్, దీనికి అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 నియమావళి చెల్లనేరవని, వీటిని అమలు చేయరాదని తీర్పులో వెల్లడించారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – ఎ
వివరణ – 1969 ఫిబ్రవరి 3న రిట్ పిటిషన్ (writ pettion no.2235/68, 3907/68, 3962/68)లలో తెలంగాణ ముల్కీ నిబంధనలు చెల్లవని జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పునిచ్చారు. జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పు ముఖ్యాంశాలు – 1969 ఫిబ్రవరి 3న హైకోర్టు న్యాయమూర్తి చిన్నపరెడ్డి తెలంగాణ ప్రాంతంలోని కొన్నిరకాల ఉద్యోగాల్లో స్థానికులను మాత్రమే చేర్చుకోవాలనే ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1957లోని 3వ సెక్షన్, దీనికి అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ నియమావళి చెల్లదని, వీటిని అమలు జరపరాదని తీర్పులో వెల్లడించారు. అంతేగాక 1968 ఏప్రిల్ 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా అమలు జరుపరాదని ప్రభుత్వాన్ని ఆదేశించాడు. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం 1957లోని 3వ సెక్షన్ 1964లో సవరణకు గురయిందని ముల్కీల అమలు గడువు 5 సం.లు పెంచుతూ చేసిన సవరణ ఆ సవరణ కూడా చెల్లదని తీర్పులో ప్రకటించాడు. భారత రాజ్యాంగంలోని 16(3) అధికరణ రాష్ట్రీయ సంకుచిత భావాలను ప్రేరేపించడానికి ఉద్దేశించబడలేదని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సూత్రాన్ని త్యాగం చేయకుండా పనిలో సమర్థతను పెంపొందించడానికి మాత్రమే అది ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 16(3)లో పొందుపరిచిన అంశాలను బట్టి పార్లమెంట్ ఒక రాష్ట్రంలోగాని, ఒక రాష్ట్రంలోని ప్రాంతంలో గానీ లేదా ఒక జిల్లాలో గానీ లేదా తాలుకాలో గానీ ఒక గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నివాస అర్హతను నిర్దేశిస్తూ ఒక చట్టాన్ని రూపొందించడానికి అవకాశం ఉన్నదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం లేదు అని తీర్పులో వెల్లడించారు.
53. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గం గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
1. మహమూద్ అలీ- ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, సహాయం పునరావాసం, యుఎల్ సీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు
2. నాయిని నరసింహారెడ్డి – హోం మంత్రి, జైళ్లు, అగ్నిమాపక శాఖ, కార్మిక ఉపాధి కల్పన
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – సి
వివరణ – తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గం
1. కల్వకుంట్ల చంద్రశేఖరరావు – ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, విద్యుత్, బొగ్గు, మున్సిపల్, పరిపాలన, పట్టణాభివృద్ధి, మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు
2. మహమూద్ అలీ – ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, సహాయం పునరావాసం, యు.ఎల్.సి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు
3. తాటికొండ రాజయ్య – ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ
4. నాయిని నరసింహారెడ్డి – హోం మంత్రి, జైళ్లు, అగ్ని మాపక శాఖ, కార్మిక ఉపాధి కల్పన
5. ఈటల రాజేందర్ – ఆర్థిక, ప్రణాళిక, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, చిన్న మొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, వినియోగదారుల వ్యవహారం
54. రాష్ట్రపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉల్లంఘన గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
1. జిల్లా స్థాయి కేడర్లను మార్చరు
2. నాన్ గెజిటెడ్ కేడర్లను జోనల్ స్థాయి గెజిటెడ్ కేడర్లుగా మార్చారు
3. నియామకాలు జరిగినప్పుడు ముందుగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా నింపిన కోటాకు బదులు రిజర్వ్ నింపుతారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1, 2 సరైనది బి) 2, 3 సరైనది
సి) 1, 3 సరైనవి డి) పైవన్నీ
జవాబు – డి
వివరణ – జిల్లా స్థాయి క్యాడర్‌ను మార్చారు. నాన్ గెజిటెడ్ క్యాడర్‌ను జోనల్ స్టాయి గెజిటెడ్ క్యాడర్లుగా మార్చారు. రిక్రూట్మెంట్లో బహిరంగ పోటీ ద్వారా గతంలో పూరించిన కోటాలకు బదులుగా రిజర్వ్‌లు భర్తీ చేయబడతాయి
55. కింది వాక్యాలను పరిశీలించండి.
1. 2013 జూలై 11న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
2. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2013 జూలై 30న ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – సి
వివరణ – 2013 జూలై 11న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2013 జూలై 30న ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం 2013 ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో ప్రకటించారు. మరుసటిరోజు అంటే 2013 ఆగస్టు 6న ఆంటోని కమిటీని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2013 అక్టోబర్ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
2013 అక్టోబర్ 8న రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటయింది.
2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజు
56. రాష్ట్రపది ఉత్తర్వులు కింది పోస్టులకు వర్తించవు. కింది వాక్యాలను పరిశీలించండి.
1. రాష్ట్ర సచివాలయంలోని ఏదైనా పోస్టు
2. విభాగాధిపతి కార్యాలయాల్లో ఏదైనా పోస్టు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – సి
వివరణ – రాష్ట్రపతి ఉత్తర్వులు కింది పోస్టులకు
వర్తించవు
ఎ. రాష్ట్ర సచివాలయంలోని ఏదైనా పోస్టు
బి. విభాగాధిపతి కార్యాలయాల్లో ఏదైనా పోస్టు (రాష్ట్రంలో వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను 51గా గుర్తించారు)
సి. రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యాలయాల్లో (27 రకాల స్పెషల్ ఆఫీసులను ప్రకటించింది.)
డి. రాష్ట్రస్థాయి కార్యాలయం లేదా రాష్ట్ర స్థాయి సంస్థల్లో ఏదైనా పోస్టుకు
ఇ. భారీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన నాన్ గెజిటెడ్ పోస్టులు తప్పించి మిగిలిన అన్ని పోస్టులకు
ఎఫ్. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టంలోని సెక్షన్ (3) క్లాజ్ (బి) కింద పేర్కొన్న ఏ పోలీసు ఆఫీసర్ పోస్టుకూ రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు (ఫ్రీజోన్ అని అర్థం)
57. కింది వాక్యాలను పరిశీలించండి.
1. 1972 నవంబర్ 21న పార్లమెంట్లో ఇంద్రజిత్ గుప్తా, పి.వెంకట సుబ్బయ్య, ఎస్.బి. గిరి తమ ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను వివరించారు.
2. 1972 డిసెంబర్ 24న పంచసూత్ర పథకాన్ని పార్లమెంట్ ఆమోదించింది.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – ఎ
వివరణ – 1972 అక్టోబర్ 24న ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు అధికార పర్యటనపై ఏలూరు సందర్శించగా అక్కడి విద్యార్థులు పీవీ నరసింహారావును రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. 1972 నవంబర్ 21న పార్లమెంట్లో ఇంద్రజిత్ గుప్తా, పీ వెంకట సుబ్బయ్య, ఎస్బీ గిరి తమ ఆంధ్ర ప్రాంత మనో భావాలను వివరించారు. 1972 నవంబర్ 27న పార్లమెంట్లో ఆంధ్ర ఉద్యమం గురించి జరిగిన చర్చను విన్న ఇందిరాగాంధీ తన సీనియర్ మంత్రులతో చర్చించిన తర్వాత పరిష్కార మార్గంగా పంచసూత్రాల పథకం గురించి పార్లమెంట్లో ప్రకటించారు. 1972 డిసెంబర్ 23న పంచసూత్ర పథకాన్ని పార్లమెంట్ ఆమోదించింది.
58. కింది వాక్యాలను పరిశీలించండి.
1. రాంజీ గోండుతో సహా 1000 మందిని బ్రిటిష్ వారు పట్టుకొని 1860 ఏప్రిల్ 9న నిర్మల్ జిల్లాలోని ఖజానా చెరువు గట్టున ఉన్న ఊడలమర్రి చెట్టుకు ఉరి తీశారు
2. ఆనాటి నుంచి ఈ మర్రిచెట్టు 1000 ఉరిల మర్రిగా ప్రసిద్ధి చెందింది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు – సి
వివరణ – 1857-60 మధ్య ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తదితర ప్రాంతాల్లో గోండులు అనే గిరిజనులు, రొహిల్లాలు అనే ముస్లింలు రాంజీగోండు, హాజీ రొహిల్లాల నాయకత్వంలో తిరుగుబాటును ప్రారంభించారు. రాంజీ గోండు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరాఠా, తెలుగు, రొహిల్లా, గోండు సైన్యాలను తయారుచేసి, వారికి సాయుధ శిక్షణ ఇచ్చి నిర్మల్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను విముక్తి చేసి స్వయంపాలన చేపట్టారు. గిరిజనుల తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ వారు కల్నల్ రాబర్ట్ అనే సైనికాధికారి నాయకత్వంలో పెద్దసంఖ్యలో సైన్యాన్ని నిర్మల్ ప్రాంతానికి పంపించారు. బ్రిటిష్, నిజాం సైన్యం గోండులు, రొహిల్లాలపై దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. గెరిల్లా యుద్ధనైపుణ్యం గల రాంజీ గోండు సైన్యాలు మొదట కొంతమంది ఇంగ్లిష్ సైన్యాలను ఓడించారు. కానీ, బ్రిటిష్, నిజాం సైన్యాల సంఖ్య, ఆయుధసంపత్తి ఎక్కువకావడంతో గోండుల సైన్యం వీరోచితంగా పోరాడి ఓడిపోయారు. చివరిదాకా పోరాడిన రాంజీగోండుతో సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ ఖజానా చెరువుగట్టున ఉన్న ఊడలమర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. నాటి నుంచి ‘వెయ్యి ఉరిల మర్రి’ గా ప్రసిద్ధి చెందింది.
దొమ్మటి తిరుపతి
ఫ్యాకల్టీ, ఎస్ జే ట్యుటోరియల్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు