క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
1. రంగులు కలిగి ఉండే పువ్వులు?
1) పగలు వికసించేవి
2) రాత్రి వికసించేవి
3) మధ్యాహ్నం వికసించేవి
4) ఏదీకాదు
2. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు?
1) మల్లెపువ్వు 2) రఫ్లీషియా
3) కలువపువ్వు 4) తామర పువ్వు
3. ప్రపంచంలో ఎన్ని రకాల పూలు పూస్తున్నాయి?
1) 1.5 లక్షలు 2) 2.5 లక్షలు
3) 3.5 లక్షలు 4) 4.5 లక్షలు
4. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం?
1) సుజకీబానా 2) ఇకేబానా
3) హోండాబానా 4) ఇచానా
5. రఫ్లీషియా పువ్వు బరువు?
1) 2 కేజీలు 2) 3 కేజీలు
3) 5 కేజీలు 4) 4 కేజీలు
6. ఏ పువ్వుతో సుగంధ ద్రవ్యాలు తయారుచేస్తారు?
1) మల్లె 2) గులాబీ
3) మొగలి 4) రఫ్లీషియా
7. తెల్లగా ఉండి సువాసనొచ్చే పూలు ఏ వేళలో వికసిస్తాయి?
1) ఉదయం 2) రాత్రి
3) మధ్యాహ్నం 4) సాయంత్రం
8. మొక్కల్లోని ఇతర భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడటాన్ని ఏమంటారు?
1) బీజవ్యాప్తి 2) శాఖీయ వ్యాప్తి
3) శాఖీయోత్పత్తి 4) కాండవ్యాప్తి
9. ఆహార పదార్థాలను నిల్వచేసే వేర్లు ఉన్న మొక్క?
1) టమాట 2) బంగాళదుంప
3) వేప 4) బీట్రూట్
10. రాబందులు అంతరించిపోవడానికి కారణమైన రసాయన పదార్థం?
1) సోడియం సిట్రేట్
2) డైక్లోఫినాక్
3) ఎండోసల్ఫాన్ 4) పైరిథ్రిన్
11. వేరు వెంట్రుకలు నేలలోని దేన్ని పీల్చి వేర్లకందిస్తాయి?
1) లవణాలు 2) నత్రజని
3) నీరు 4) పొటాషియం
12. కాండం నుంచి నిలువుగా నేలలోకి పోయే వేరు?
1) పిల్లవేరు 2) తల్లివేరు
3) గుబురు వేరు 4) కాండం
13. పరపరాగ సంపర్కానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ. ఏకలింగ పుష్పాల్లో మాత్రమే జరుగుతుంది
బి. పుష్పంలోని పరాగరేణువులు, అదే పుష్పంలోని అండాలను చేరగలవు
సి. పరాగ సంపర్కం జరిగే వాహకాలు సహాయ పడతాయి
డి. ఈ విధానంలో ఏర్పడిన విత్తనాలు, స్వపరాగ సంపర్కం వల్ల తయారైన విత్తనాల కంటే ఆరోగ్యంగా ఉంటాయి
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి 4) సి, డి
14. కప్ప జీవితంలో, రూప విక్రయ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్?
1) ఎడ్రినలిన్ 2) ఆల్డోస్టిరోన్
3) కార్టిసాల్ 4) థైరాక్సిన్
15. నీరు, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఉదాహరణలు వరుసగా?
1) హైడ్రిల్లా, మొక్కజొన్న
2) గోధుమ, వాలిస్‌నేరియా
3) డ్రాసిరా, వరి
4) ఐకార్నియా, పిస్టియా
16. ఒక రైతు పొలంలో ఒక పంట పెంచడానికి పిలకలను సేకరించాడు, అతను వేసే పంట?
1) బంగాళదుంప 2) పసుపు
3) అరటి 4) చిలగడదుంప
17. కీటకాల కాళ్ల సంఖ్య?
1) 4 2) 5 3) 6 4) 7
18. కింది వాటిలో రెక్కలు లేని కీటకం?
1) ఈగ 2) బొద్దింక
3) నల్లి 4) సీతాకోకచిలుక
19. కింది వాటిలో ఎగిరే పురుగు?
1) గొల్లభామ 2) మిడుత/మిడత
3) రెండూ 4) పైవేవీకావు
20. కప్ప నీటిలో ఈదడానికి కారణం?
1) కప్పకి కాలివేళ్ల మధ్య చర్మపుపొర ఉంటుంది
2) కప్పకి సహజంగా ఈత రావడం
3) కప్ప ఉభయచరజీవి 4) ఏదీకాదు
21. ఎగిరే పక్షుల్లో పెద్దది?
1) గద్ద 2) రాబందు
3) నెమలి 4) పాలపిట్ట
22. కింది వాటిలో ఇసుకలో పెరిగే మొక్క?
1) కలబంద 2) బ్రహ్మజెముడు
3) నాగజెముడు 4) పైవన్నీ
23. మొక్కలు ఆకురాల్చే కాలం?
1) చలికాలం 2) వేసవికాలం
3) వర్షాకాలం 4) అన్నికాలాలు
24. మొక్కలు చిగురించే కాలం?
1) చలికాలం 2) వేసవికాలం
3) వర్షాకాలం 4) ఏదీకాదు
25. గుల్మాలు అంటే?
1) సన్నని కాండంతో ఉండే చిన్న మొక్కలు
2) గుబురుగా పెరిగే మొక్కలు
3) పెద్ద కాండం గల చెట్లు
4) పైవన్నీ
26. గులాబీ ఏ వర్గీకరణకు చెందింది?
1) గుల్మాలు 2) పొదలు
3) వృక్షాలు 4) పైవన్నీ
27. మొక్కల పెరుగుదలకు నీరు ఎందుకు అవసరం?
1) మొక్కలు నీరు లేకపోతే ఎదగవు
2) నీరు లేకపోతే ఆకులు రాలిపోతాయి
3) మొక్కలకి కావాల్సిన సహజ పోషకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్ కోసం
4) మొక్కలకి కావలసిన కార్బన్ కోసం
28. ఔషధ మొక్క కానిది?
1) తులసి 2) వేప
3) నీలగిరి 4) తోటకూర
29. మొక్కలు CO2ను ఎందుకు పీల్చుకుంటాయి?
1) అది మొక్కల సహజ లక్షణం
2) మొక్కల సహజ పోషకం ఆక్సిజన్
3) మొక్కల సహజ పోషకమైన కార్బన్, ఆక్సిజన్ కోసం
4) ఏదీకాదు
30. నీలగిరి మొక్కలకు మరో పేరు?
1) కాప్సికం 2) సొలానం
3) యూకలిప్టస్ 4) అజాడిరిక్తా
31. తేనె పట్టులో ఒక్కో గది ఏ ఆకారంలో ఉంటుంది?
1) పంచభుజి 2) షడ్భుజి
3) సప్తభుజి 4) అష్టభుజి
32. చాలా ఎత్తులో ఎగిరే గద్ద ఆహారాన్ని ఎలా గుర్తిస్తుంది?
1) గద్దకి కంటి చూపు చాలా స్పష్టం
2) గద్దకి అది సహజ లక్షణం
3) గద్ద వాసన ద్వారా
ఆహారాన్ని గుర్తిస్తుంది 4) పైవన్నీ
33. జంతువులకు, మనకి పోలిక దేనిలో ఉంటుంది?
1) తినడం 2) నిద్రపోవడం
3) రెండింటిలోనూ 4) పైవేవీ కాదు
34. మానవ అస్థిపంజరం – ఎముకలు = ఆకు అస్థి పంజరము – ?
1) పత్రహరితం 2) ఈనెలు
3) దారుకణజాలం 4) పత్రరంధ్రాలు
35. ‘ఇకేబానా’ అంటే?
1) ఆకులతో అలంకరణ
2) ఫలాలు, విత్తనాలతో అలంకరణ
3) ఫలాల అమరిక
4) పుష్పాల అమరిక
36. ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు?
1) చిరుత పులి 2) కృష్ణజింక
3) కుందేలు 4) ఖడ్గ మృగం
37. సముద్ర తీర ప్రాంత రైతులను వేటిని పెంచమని చెప్తారు?
1) జీడిమామిడి, చెరకు, కొబ్బరి
2) అరటి, ఆర్డినెన్స్, తాటి చెట్లు
3) సరుగుడు, జీడిమామిడి, ఆర్కిడ్స్
4) సరుగుడు, పసుపు, చెరకు
38. కింది వాటిలో బిడియ జంతువు?
1) కుక్క 2) పిల్లి
3) ఉడుత 4) మేక
39. కింది వాటిలో ఒంటరిగా తిరిగే జంతువు?
1) మగ ఏనుగు 2) గొర్రెలు
3) సింహాలు 4) జీబ్రాలు
40. తేనెటీగలు ఎన్ని రకాలు?
1) 1 2) 2 3) 3 4) 4
41. తేనెటీగలు నుంచి ఏమి నేర్చుకోవచ్చు?
1) క్రమశిక్షణ 2) పనుల విభజన
3) సంఘజీవనం 4) పైవన్నీ
42. ఒక కిలో తేనె తయారుకావడానికి ఎన్ని పూల మకరందం కావాలి? (మిలియన్లలో)
1) 1 2) 2 3) 3 4) 4
43. కింది వాటిలో ఔషధ మొక్కలు?
1) తులసి 2) వేప
3) యూకలిప్టస్ 4) పైవన్నీ
44. చర్మ వ్యాధులు, పండ్లకి ఉపయోగించే మొక్క?
1) వెల్లుల్లి 2) పుదీనా
3) నీలగిరి (యూకలిప్టస్) 4) వేప
45. ఏ మొక్క ఆకులు కూరగా ఉపయోగించరు?
1) తోటకూర 2) వేప
3) పాలకూర 4) చింత
46. కింది వాటిలో సర్వభక్షకులు?
1) కాకి 2) ఏనుగు
3) నెమలి 4) పులి
47. పక్షుల ఎముకలు కింది వాటిలో దేన్ని కలిగి ఉంటాయి?
1) నీరు 2) మాంసం
3) ఎముక మజ్జ 4) గాలి
48. నెహ్రూ జూలాజికల్ పార్కు ఉన్న నగరం?
1) వరంగల్ 2) కాకినాడ
3) హైదరాబాద్ 4) విశాఖపట్నం
49. కింది వాటిలో అంతరించిపోతున్న జంతువులు?
1) ఆవు, బర్రె 2) నెమలి, బట్టమేక
3) గొర్రె, మేక 4) పులి, ఆవు
50. మొక్కల్లో వేర్లు ఏ భాగంలో ఉంటాయి?
1) కాండం కింద 2) కాండం పైన
3) కొమ్మపైన 4) ఆకులకు
51. కింది మొక్కల్లో గుబురు వేర్లు?
1) చిక్కుడు 2) మిరప
3) వేరు 4) జొన్న
52. మొక్కల్లో ప్రధాన వేరు వ్యవస్థ ఉంటుంది?
1) మిరప 2) వరి
3) జొన్న 4) గడ్డి
53. క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
1) 3 2) 2 3) 4 4) 1
54. దుంపలను ఏ విధంగా ఆహారంగా తీసుకోవచ్చు?
1) పచ్చిగా 2) ఉడికించి
3) జ్యూస్‌గా 4) పైవన్నీ
55. అడవి మొక్కలు?
1) తుమ్మ, మర్రి
2) గులాబీ, మామిడి
3) నిమ్మ, అరటి 4) బెండ, చిక్కుడు
56. నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా?
1) రైజోబియం 2) బాసిల్లస్
3) మైకోరైజా 4) పెన్సిలిన్
57. కింది వాటిలో స్థూల పోషకం ?
1) ఇనుము 2) నత్రజని
3) రాగి 4) మాంగనీస్
58. నేలకు పోషకాలను చేర్చేది?
1) పంట మార్పిడి
2) సేంద్రీయ ఎరువు
3) రసాయన ఎరువులు
4) పైవన్నీ
59. నేల నుంచి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి?
1) ప్రధాన ధాన్యాలు
2) సేంద్రీయ ఎరువు
3) రసాయన ఎరువులు
4) పైవన్నీ
60. కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా?
1) బాసిల్లస్ ధురంజెన్సిస్
2) రైజోబియం 3) అజటోబాక్టర్
4) బాసిల్లస్ సూడోమోనాస్
61. వరిసాగు చేసిన తర్వాత మినుములను సాగుచేస్తే దేన్ని అదుపులో ఉంచవచ్చు?
1) టుంగ్రోవైరస్
2) ధాన్యాన్ని తినే గొంగళి పురుగు
3) అజటోబాక్టర్
4) బాసిల్లస్ సూడోమోనాస్
62. సేంద్రీయ సేద్య విధానంలో రైతు?
1) సహజ ఎరువులను ఉపయోగిస్తారు
2) సహజ కీటకనాశ పద్ధతులను అవలంబిస్తారు
3) పంట మార్పిడి, మిశ్రమ పంట విధానం పాటిస్తారు
4) పైవన్నీ
63. యూరియాలో నత్రజని శాతం?
1) 36 శాతం 2) 46 శాతం
3) 56 శాతం 4) 44 శాతం
64. కీటకనాశనులు వేటిని సంహరించడానికి ఉపయోగిస్తారు?
1) సూక్ష్మజీవులు 2) పురుగులు
3) కీటకాలు 4) శిలీంధ్రాలు
65. మొక్కలు విడుదల చేసే నీరు వేటిద్వారా ఆవిరి అవుతుంది?
1) బాహ్యచర్మం
2) పత్రాంతర కణజాలం
3) పత్రరంధ్రాలు 4) దారువు
66. ఏ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి?
1) వరి 2) మినుము
3) వేరుశనగ 4) సజ్జ
67. నీటిని పరిరక్షించే నీటిపారుదల పద్ధతి?
1) కాలువ నీటి వ్యవస్థ
2) చెరువు నీటి వ్యవస్థ
3) డ్రిప్ ఇరిగేషన్ 4) పైవేవీ కాదు
స్రవంతి
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు