తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
- దేశ విభజన తర్వాత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299
- రాజ్యాంగ సభలో అత్యధిక సభ్యులు జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు.
- బీఆర్ అంబేద్కర్ భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన వారు కాదు.
- రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్రశాసన సభలు ఎన్నుకున్నాయి. స్వదేశీ రాజులు కూడా కొందరిని నామినేట్ చేశారు.
- రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య 15.
- కష్టాలు కన్నీళ్లు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది.
- రాజ్యాంగ ముగింపు సభలో బీఆర్ అంబేద్కర్ చేసిన ఉపన్యాసంలో ముఖ్యాంశాలు.
ఎ. 1950, జనవరి 26న వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం.
బి. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు విలువ అనే సిద్ధాంతాన్ని ఆచరించబోతున్నాం. - కానీ ఈ ఆర్థిక సామాజిక చట్రం కారణంగా ఒక మనిషి ఒక విలువ అనే సూత్రాన్ని అమలు చేయలేం.
- ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది.
రాజ్యాంగ సభ చర్చలు
- బీఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ చర్చ నిమిత్తం రాజ్యాంగ ముసాయిదా ప్రతిని విడుదల చేసింది.
- ఈ ప్రతిపై అన్ని అంశాలపై అనేకసార్లు చర్చ జరిగింది.
- అధిక శాతం సభ్యుల ఓట్ల ఆధారంగా అంతిమ నిర్ణయం తీసుకునేవారు.
- ముసాయిదా ప్రతికి 200పైగా సవరణలను పరిగణనలోకి తీసుకున్నారు.
- 3 సంవత్సరాల కాలంలో 114 రోజులు చర్చలు జరిగాయి. సభలో మాట్లాడిన ప్రతి అంశాన్ని నమోదు చేసి భద్రపరిచారు.
- బి.ఆర్ అంబేద్కర్ 1948లో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచారు.
భారత రాజ్యాంగ ప్రవేశిక-ప్రధాన రాజ్యాంగ భావనలు
- భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఇది రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం వంటిది.
- భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ప్రవేశిక లేదా పీఠిక.
- ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది జాతీయ లక్ష్యాలను వివరిస్తుంది.
రాజ్యాంగ ప్రవేశికలోని పదాలు -వివరణ భారతదేశ ప్రజలమైన మేము..
- భారతదేశంలోని ప్రజలు అంటే పెద్దలు, పిల్లలు అని అర్థం. ఇది భారత గణతంత్ర స్వభావాన్ని చాటుతుంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు.
- ఈ రాజ్యాంగాన్ని ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా రాసి చట్టంగా చేశారు.
- భారతదేశంలో 1652 భాషలున్నాయి. వీటిలో రాజ్యాంగం గుర్తించిన భాషలు 22సర్వసత్తాక
- మన దేశం గురించి అంతర్గత, బహిర్గత నిర్ణయాలన్నీ మనమే తీసుకునే అధికారం కలిగి ఉండం. మనల్ని ఇతర దేశాలు ఆదేశించడానికి వీల్లేదు.
- ఇతర దేశాలతో మన దేశానికి ఉపయోగపడే విధంగా వాణిజ్య, విద్యా ఒప్పందాలు చేసుకోవచ్చు.
- బయట శక్తులు ఏవీ చట్టాలు రూపొందించలేవు.
సామ్యవాదం
- సంపదను అందరూ సమానంగా అనుభవించడం. ఎలాంటి వివక్ష లేకుండా అందరూ అన్ని సౌకర్యాలు సమానంగా పొందడం.
- అన్ని రకాల అసమానతలను తగ్గించడానికి, అంతం చేయడానికి దేశం కృషి చేస్తుంది.
లౌకిక రాజ్యం
- మత ప్రమేయం లేని రాజ్యం అన్ని మతాలకు సమాన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
- మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడవు.
- ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యం ఇవ్వదు.
- పౌరులకు పూర్తి మత స్వేచ్ఛ ఉంటుంది.
భారతదేశంలో గల మతాలు
- హిందువులు 80%, క్రైస్తవులు 2%
- ముస్లింలు 13%
- సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఏ మతాన్ని విశ్వసించనివారు కూడా భారతదేశంలో ఉన్నారు.
- భారతదేశంలో పుట్టిన మతాలు హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మతాలు. వీటిలో బౌద్ధ మతం విదేశాలకు విస్తరించింది.
ప్రజాస్వామిక రాజ్యం
- ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ ఈ విధంగా నిర్వచించారు. ‘ప్రజల యెక్క ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం’.
- ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. దీన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. రాజులు, రాణులు లేకుండా పరిపాలన సాగుతుంది.(గణతంత్రం)
- ప్రజాప్రతినిధులు సాధారణ మెజారిటీ ద్వారా ఎన్నుకుంటారు.
- ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అంటారు.
- మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలు చేస్తారు.
- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వబడింది.
- చట్టాలు పార్లమెంటులో రూపొందించబడతాయి.
- పార్లమెంట్లో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నాయి.
- లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు.
గణతంత్రం
- ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. రాజ్యంలోని రాజువలే వారసత్వంగా అధికారం రాదు.
సమన్యాయం
- ప్రజలందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించబడింది.
- అందరికీ ఒకే చట్టాలు, సమాన గౌరవం, సమాన హోదా, సమాన అవకాశాలు, హక్కులు కల్పించబడ్డాయి.
- అందరికీ నివాసం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది.
- ప్రతి పౌరునికి ఏం చెందాలి అనేది నిర్ణయించడంలో వాళ్లు పుట్టుక, నమ్మకాలు, సంపద, హోదాలను బట్టి వివక్ష చూపించరు.
- అన్యాయానికి గురైన ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు.
సమానత్వం
- జాతి, కులం, మతం, భాష, నివాస ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాతిపదికన అవకాశాలు, గౌరవం కల్పించాలి.
- మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానతను ఇవ్వడం లేదు. కానీ అందరికి ఒకే హోదా ఉండేలా చూస్తుంది.
- దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి. అవకాశాల్లో సమానత్వానికి హామీ ఇస్తుంది.
- ఒక పదవికి ప్రత్యేక అర్హతలుండవలసి వస్తే అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు.
స్వేచ్ఛ
- దేశ ప్రజలకు ఆలోచనల్లో భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో భారత రాజ్యాంగం స్వేచ్ఛను కల్పించింది.
- భారత రాజ్యాంగం కల్పించిన కొన్ని స్వేచ్ఛలు-మాట్లాడే స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ సంచరించే స్వేచ్ఛ, నివాసముండే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ
- వ్యక్తి గౌరవం- అందరికి సమాన గౌరవం రాజ్యాంగం కల్పించింది.
- దేశ సమైక్యత – మతాలు, భాష, సంస్కృతి ఏవైనా అందరూ కలిసి మెలిసి జీవించడం.
- సౌభ్రాతృత్వం-సోదరభావం, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల వలే మెలగాలి.
- తోటి పౌరులను పరాయి వారిగా భావించకుండా వారిని తక్కువ చేయకుండా ఉండాలి.
ఆదేశిక సూత్రాలు
- పీఠిక కాకుండా మన రాజ్యాంగంలో ప్రభుత్వ విధానానికి ఆదేశిక సూత్రాలు అనే విభాగం ఉంది.
- ఈ భాగం భారత ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొంది.
ఉదా.. సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించడం మొదలైనవి. - ఈ సూత్రాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ప్రభుత్వాలు వీటిని అనుసరించడం లేదనిపించినప్పుడు మనం న్యాయస్థానంలో కేసులు వేయలేం.
ప్రభుత్వ వ్యవస్థలు
పైన పేర్కొన్న విలువలు, ఆదర్శాలకు అనుగుణంగా దేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం వ్యవస్థాగత ఏర్పాట్లను ప్రస్తావించింది. అవి
ఎ. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
బి. సమాఖ్య వ్యవస్థ
సి. మూడు స్థాయిల్లో ప్రజాస్వామ్యం
డి. రాజ్యాంగాన్ని కాపాడే స్వతంత్ర సంస్థలు
పార్లమెంటరీ వ్యవస్థ విధానం
- రాజ్యాంగం మనదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులతో కూడిన ప్రభుత్వం అమలు చేస్తుంది.
- పరిపాలనను ప్రధాని నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గం (క్యాబినెట్) చేపడుతంది. ప్రభుత్వం మొత్తానికి అధినేతగా రాష్ట్రపతి ఉంటాడు.
సమాఖ్య వ్యవస్థ
- భారతదేశం అనేక చిన్న రాష్ర్టాలతో ఏర్పడింది. అధికారాలు, విధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించారు.
- సైన్యం, రైల్వేలకు సంబంధించి చట్టాలు చేయడం, వాటిని అమలు పరచడం. కేంద్రం, పోలీసు, రోడ్డు, పాఠశాలలు వంటి అంశాల నిర్వహణ-రాష్ట్రం.
- కేంద్ర పార్లమెంట్లో లోక్‌సభ, రాజ్యసభ అనే రెండు సభలున్నాయి. లోక్‌సభ సభ్యులను, శాసన సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.
- రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభలు ఎన్నుకుంటాయి.
- ఈ విధంగా చట్టాలు చేయడంలో రాష్ర్టాల పాత్ర కూడా కేంద్ర స్థాయిలో ఉంటుంది.
- మన దేశంలో ప్రజాస్వామ్యం మూడు స్థాయిల్లో ఉంది
- కేంద్ర స్థాయిలో-పార్లమెంటు
- రాష్ట్ర స్థాయిలో-రాష్ట్ర శాసన సభలు
- జిల్లా స్థాయిలో- పంచాయతీ రాజ్ వ్యవస్థ
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు
1. న్యాయ వ్యవస్థ- న్యాయస్థానాలు
2. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-ప్రభుత్వ ఖాతాల పర్యవేక్షణ
3. ఎన్నికల సంఘం- స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ
- ఇవి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తూ రాష్ట్రపతికి నేరుగా నివేదిస్తాయి.
ప్రస్తుత రాజ్యాంగం
- రాజ్యాంగం మారుతూ సజీవంగా ఉండే పత్రం. సమాజ మార్పులను, కోరికలను ప్రతిబింబించాలి.
- దానికి పవిత్రమైనది, స్థిరమైనదిగా మార్చడానికి వీలులేనిదిగా చూడలేం.
- చట్టాలను రాజ్యాంగంలోని అధికరణాలను సవరించడానికి అవకాశం కల్పించబడింది. వీటికే రాజ్యాంగ సవరణలు అని పేరు.
- రాజ్యాంగ అధికరణల సవరణను పార్లమెంటు మాత్రమే చేయాలి.
- 2011 నాటికి రాజ్యాంగానికి 97 సవరణలు చేశారు.
రాజ్యాంగ మూల ప్రతిపై సంతకం చేసిన కొందరు ప్రముఖులు
- జవహర్ లాల్ నెహ్రూ- ప్రధాని
- వల్లభాయ్ పటేల్- ఉప ప్రధాని
- జైరాం దాస్ చౌలత్ రాం- ఆహార వ్యవసాయ మంత్రి
- రాజకుమారి అమృత్ కౌర్- ఆరోగ్య మంత్రి
- జాన్ మథాయ్-ఆర్థిక మంత్రి
- జగజ్జీవన్ రామ్- కార్మిక శాఖ మంత్రి
- చట్టం, న్యాయం-ఒక సన్నివేశ అధ్యయనం
- ప్రజలు, అన్యాయాలకు, భౌతిక దాడులకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు.
- ఫిర్యాదులో కింది అంశాలుంటాయి.
- పోలీస్ స్టేషన్ అధికారి (ఎస్ఎచ్వో)ని సంబోధిస్తూ ఫిర్యాదు రాయాలి
- ఫిర్యాదు వివరాలు
- నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం
- ఏం జరిగింది?
- నిందితుడి పేరు, లింగం, చిరునామా సాక్షుల పేర్లు
- విన్నపం (నిందితులను చట్టం ప్రకారం శిక్షించడం కోరడం, తెలిసి ఉంటే వర్తించే సెక్షన్‌ను సూచించాలి.)
- ఫిర్యాదుదారు సంతకం, చిరునామా ఇతర వివరాలు
- ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో రైటరు నివేదికను తయారు చేస్తాడు. దీనినే తొలి సమాచార నివేదిక (FIR) అంటారు
- FIRను స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) నమోదు చేస్తారు.
- FIR ఆధారంగా పోలీస్ స్టేషన్‌లోని రిజిష్టర్ లో నేరం వివరాలను పొందుపర్చుతారు. ఎటువంటి రుసుం లేకుండా (FIR) ప్రతిని ఫిర్యాదు దారునికి ఇవ్వాలి.
- FIR దాఖలు చేసిన తర్వాత కేసును పరిశోధించి పరిష్కరించవలసిన బాధ్యత పోలీసులది.
- FIR రాసిన సమాచారాన్ని పెద్దగా చదివి వినిపించాలి. వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఫిర్యాదుదారుడు దానిపై సంతకం చేయాలి.
- ఒకవేళ ఫిర్యాదు తీసుకోవడానికి SHO తిరస్కరిస్తే DSP లేదా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు