Geography- Groups Special | ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ నీళ్లు
భారతదేశ నదులు – నీటి వనరులు
- గృహ అవసరాల కోసం ఉపయోగిస్తున్న నీటి శాతం – 5%
- భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రమాదం గల భూమి – 4 కోట్ల ఎకరాలు
- భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో కలుషితమైన నీరు – 70%
భారతదేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది అవి :
1. హిమాలయాలు
2.ద్వీపకల్ప పీఠభూమి
3. సింధూ – గంగా మైదానం. - పుట్టుక ఆధారంగా భారతదేశ నదీజల వ్యవస్థ రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి : హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు
1. హిమాలయ నదులు : - గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు వీటిలో ముఖ్యమైనవి.
- సింధూ,బ్రహ్మపుత్ర నదులు ఎత్తైన ప్రాంతా ల్లో ప్రవహించడం వల్ల V ఆకారపు లోయలను ఏర్పరిచాయి.
- హిమాలయ నదులు జీవనదులు. సంవత్సరమంతా వాటిలో నీరు ఉంటుంది. వర్షపాతం కరుగుతున్న మంచు ద్వారా వీటికి నీరు లభిస్తుంది.
- ఈ నదులన్నీ దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంలో ప్రారంభమై పర్వతాల వల్ల వేరు చేయబడ్డాయి.
- ఇవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తర్వాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వతాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకొంటాయి.
2. ద్వీపకల్ప నదులు :
ద్వీపకల్ప నదుల వర్గీకరణ :
1. తూర్పునకు ప్రవహించేవి – కృష్ణా, గోదావరి, కావేరి, మహానది
2. పశ్చిమానికి ప్రవహించేవి – నర్మదా, తపతి
3. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగంలో పుట్టి గంగానదీ వ్యవస్థకు చెందినవి – చంబల్, సింధూ, బేత్వా, కేన్, సోన్. - ద్వీపకల్ప నదులు జీవనదులు కావు. వీటి ప్రవాహ మార్గం మారదు. వక్రతలు ఉండవు.
- అరేబియా సముద్రంలో కలిసే నదులకు, తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులకు విభాజక కేంద్రం – పశ్చిమ కనుమలు
నీటి వినియోగం : - జల చక్రం ఆధారంగా సంవత్సరంలో అంతర్గత బాహ్య ప్రవాహాల నీటిని అంచనా వేయడం ద్వారా సంవత్సరంలో మనకు ఎంత నీరు అందుబాటులో ఉంటుందో అంచనా వేస్తారు.
ఉపరితల ప్రవాహాల ద్వారా
బయటకు పోయే నీళ్లు : - ఉపరితల ప్రవాహాల (కాలువలు, వాగులు) ద్వారా భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకు నీరు ప్రవహిస్తుంది.
- వర్షాకాలంలో ఈ ఉపరితల ప్రవాహాలు గణనీయంగా పెరుగుతాయి.
- వర్షపాతంలో కొంత భాగం భూగర్భ జలాలలోకి చేరుతుంది. దీనిలో కొంత బావుల్లోకి ప్రవహించి ఉపయోగపడుతుంది. మరికొంత చాలా లోతైన ప్రాంతాలకు చేరుకుని మళ్లీ అందుబాటులోకి రాదు.
- బాహ్య ప్రవాహాల ద్వారా నీరు, నీటి ఆవిరి రూపంలోకి మారుతుంది. కొంత భూగర్భ జలం బయటకు వచ్చి వాగులు, నదుల్లో కలుస్తుంది.
వ్యవసాయానికి నీరు : - పంటలకు నీరు వర్షపాతం ద్వారా , సాగునీటి ద్వారానే అందుతుంది. తద్వారా తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం పంట భూములకు ఉంటుంది.
- వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీరు ఉండి అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరువు పరిస్థితుల్లో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడలిపోతాయి.
గృహ అవసరాలకు, పశువులకు నీటి అవసరం : - తాగునీటికి, పంటకు, స్నానానికి. శుభ్రపరచడానికి పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది.
- ఆదాయంతో సంబంధం లేకుండా అందరికి ఈ నీరు అందేలా ప్రణాళికలు తయారు చేయాలి.
పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం : - ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీరు అవసరం. అయితే వ్యవసాయం, గృహ వసతి అవసరాల మధ్య వైరుధ్యం ఉంది.
- పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, తిరిగి వినియోగించుకోవటం అనేవి ముఖ్యమైన సవాలు.
ఒక గ్రామంలో నీటి వినియోగం :
1. వ్యవసాయానికి నీరు
2. గృహ అవసరాలకు, పశువులకు నీటి వినియోగం
3. పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగం
ఒక గ్రామంలో నీటి నిల్వలు :
1. ఒక గ్రామంలో చెరువులు, కుంటలు, మడుగులు వంటివి ఉపరితల నిల్వలు
2. బావులు, బోరుబావులు అంతర్భూజల నిల్వలు - వార్షిక ప్రవాహాలు బావులు, బోరుబావుల్లో నీటిని పునరుద్ధరించే నీటి నిల్వలను బట్టి మనకు అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది. మన అవసరాలకు కూడా ఈ పరిమితిలో ఉంచుకోవాలి.
- మనం చాలా లోతు నుంచి నీటిని బయటికి తీసినప్పుడు అవి వేల సంవత్సరాల కాలం నాటి నిల్వలు అని గమనించాలి.
- తీవ్ర కరువు పరిస్థితుల్లోనే ఈ నీటిని ఉపయోగించి వర్షాలు బాగా పడిన తర్వాత తిరిగి పునరుద్ధరించబడేలా చేయడం ద్వారా నీటి నిల్వల్లో సుస్థిరం సాధించవచ్చు.
తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం :
- తుంగభద్రా నది కృష్ణానదికి ఉపనది. ఈ నదీ జలాలను కర్నాటక, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు వినియోగించుకుం టున్నాయి.
- తుంగభద్రా నది పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాల్లో జన్మిస్తుంది.
- దీని పరీవాహక ప్రాంతం 71,417 చ.కి.మీ. ఇందులో 57,671 చ.కి.మీ. కర్నాటకలో ఉంది. మిగిలినది ఆంధ్ర, తెలంగాణల్లో ఉంది.
- తుంగభద్రా నది పరీవాహక ప్రాంతాన్ని రెండుగా విభజిస్తారు.
1. కర్నాటకలోని ఎగువ, మధ్య పరీవాహక ప్రాంతాలు.
2. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ పరీవాహక ప్రాంతం. - అధికారిక గణంకాల ప్రకారం మూడు రాష్ర్టాల్లో వ్యవసాయ భూమి ఎక్కువ. వ్యవసాయ భూమి మినహా మిగిలిన భూములు గడ్డి భూములు, చెట్లు, చెరువులున్నాయి.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని దిగువ పరీవాహాక ప్రాంతంలో వర్షపాతం తక్కువ. కరువు పరిస్థితులు ఎక్కువ. ఇక్కడ కొన్ని ప్రాంతాలు వర్షపాతం, భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాయి. మిగిలిన ప్రాంతం తుంగభద్రానదీ కాలువలపై ఆధారపడి ఉంది.
- ప్రభుత్వ భూములను సాగుకు ఆక్రమణలు ఎక్కువ. దీంతో అటవీ భూములు తగ్గిపోవడం, చెట్లను నరికి వేయడం కారణంగా భూగర్భంలో ప్రవహించే నీటి మోతాదు పరీవాహక ప్రాంతంలో తగ్గిపోతున్నది.
- గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థ పదార్థాల వల్ల తుంగభద్ర ఆనకట్ట రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.
నీటి హేతుబద్ధత – సమ వినియోగం - నీటిని సమర్థంగా, న్యాయంగా వినియోగించడానికి అంతర్గత, బాహ్య ప్రవాహాలను లెక్కించాలి.
- గ్రామ పరీవాహక, సమగ్రాభివృద్ధికి, “ఆదర్శగ్రామ పథకం” కింద “హినారే బజార్”ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
- “హినారే బజార్” గ్రామం మహారాష్ట్రలోని “అహ్మద్‌నగర్ ” జిల్లాలో ఉంది.
- అహ్మద్‌నగర్ జిల్లా 400 మి.మీ వర్షపాతంలో కరువు పీడిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా సహ్యాద్రి పర్వత శ్రేణికి తూర్పున గల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంది.
- మహారాష్ట్రలో ఆదర్శగ్రామ పథకం అమలుకు గ్రామాల ఎంపికకు పెట్టిన షరతుల్లో ముఖ్యమైన నాలుగు నిషేధాలు. ఇవి రాలేగావ్ సిద్ధి గ్రామం సాధించిన విజయాల స్ఫూర్తితో రూపొందించబడ్డాయి.
1. చెట్లను నరకడం నిషేధం – కృహత్ బందీ
2. పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం – చెరాయి బందీ
3. మత్తు పానీయాల నిషేధం -నషాబందీ
4. అధిక సంతానం నిషేధం – నస్బందీ - భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ విధించుట హివారే బజార్ ప్రయోగం ప్రధానాంశం.
- వర్షపాతం బాగున్న సంవత్సరం చలికాలంలో మొత్తం విస్తీర్ణంలో సాగుచేయవచ్చు. వర్షపాతం తక్కువగా ఉంటే చలికాలంలో సాగువిస్తీర్ణం తగ్గించాలి.
- వర్షపాత వివరాలను పక్కాగా నమోదు చేసి పంట ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు వరుసగా తక్కువ వర్షాపాతమున్న తాగునీటికి కొరత ఏర్పడలేదు.
ఉమ్మడి వనరుగా నీరు : - భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు.
- ప్రస్తుత చట్టాల్లో ఉన్న ప్రధాన లోపం భూమి హక్కుకు, భూగర్భ జలాలపై హక్కుకు సంబంధం కలపడం. దీని అర్థం భూగర్భ జలాలపై భూమి ఉన్న వారికి హక్కు ఉంటుంది.
- భూగర్భ జలాల నుంచి ఎంత నీటిని తోడుకుంటారు అనే దానిపై ఎలాంటి పరిమితి విధించలేదు.
- భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను భూగర్భజలాలు పాటించవు. ఎందుకంటే నీరు ప్రవహించే వనరు.
- ఒక బోరు బావి నుంచి తోడుకోగల నీరు భూగర్భంలో రాతి పొరల ఏర్పాటు వర్షపాతం ఉపరితల నీటి నుంచి నేల లోపలకు ఇంకే నీరు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
- ఒక బోరు బావి నుంచి ఎక్కువ నీరు తోడేస్తుంటే చుట్టూ ఉన్న బావులు ఎండిపోవచ్చు.
- కాబట్టి నీరులాంటి ప్రవహించే వనరుపై యాజమాన్యం గురించి ఆలోచించడం సరికాదు. భూగర్భంలో ప్రవహించే నీటికి ఎటువంటి సరిహద్దులుండవు.
- భూమి యాజమాన్యానికి భూమి మీద బోరు బావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేసే నీటిని తోడటంపై పరిమితులు విధించాలి.
- ఎటువంటి నియంత్రణ లేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ చెందిన ఆస్తిగా భావించాలి.
- నియంత్రణ అనేది అంత సులభం కాదు. విద్యుత్, చమురు, సహజవాయువు, నీరు వంటి వనరులు ఒకరు ఉపయోగించుకొన్నది. మిగిలిన వారి అందుబాటును ప్రభావితం చేస్తుంది.
- భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితి మూలాల్లోకి రాష్ర్టాలు వెళ్లటం లేదు. దీనికి విరుద్ధంగా మరింత లోతు నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా విద్యుత్ సబ్సిడీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి.
- కేరళలోని పెరుమట్టి గ్రామంలో కోకాకోలా కంపెనీ చుట్టుపక్కల ప్రాంతంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో పాటు, మంచినీటి నాణ్యత ప్రభావితం అవుతుందనే కారణంతో గ్రామ పంచాయితీ కోకాకోలా కంపెనీకి ఇచ్చిన భూగర్బ జాలాల వినిగియోగానికి సంబంధించిన లైసెన్స్ పునరుద్ధరంచకూడదని నిర్ణయం తీసుకుంది.
- 2014 జనవరి నాటి ఈ వివాదం సుప్రీంకోర్ట్ విచారణలో ఉంది.
- కేరళలో ఇద్దరు జడ్జీలు భూగర్భజలాలకు సంబంధించి పరస్పర విరుద్ధ భావాలు వ్యక్తపరిచారు.
- మొదటి జడ్జి భూగర్భ జాలలను అందరికీ అవసరమైన ప్రజావనరుగా పరిగణించి ఏ ఒక్కరూ వాటిని అధికంగా వాడుకోకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావించారు. ండవ జడ్జి దీనికి భిన్నంగా భూయజమానికి భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుందని తీర్పు చెప్పారు.
- ఈ రెండు తీర్పులు చట్టాల మీద ప్రస్తుతమున్న గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి.
Previous article
Mathematics | the average of the first fifty multiples of 7 is ?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు