నీటి వృథాను అరికట్టడానికి ప్రయోజనకర సేద్య పద్ధతి?
1. కింది వాటిలో ఏక వార్షిక మొక్క ఏది?
1) ఒరైజాసటైవా
2) రఫానస్ సటైవస్
3) మ్యూపాపారడైసియాకా
4) ట్రిబ్యులస్
2. కింది వాటిని జతపరచండి?
జాబితా-ఎ జాబితా -బి
1) గోధుమ ఎ) ఎఫిమెరల్
2) బీట్రూట్ బి) ఏకవార్షికం
3) అరటి సి) ద్వివార్షికం
4) పల్లేరు డి) బహువార్షికం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3. కిందివాటిలో పొడ దేనికి ఉంటుంది?
1) గన్నేరు 2) చామంతి
3) సంపెంగ 4) పైవన్నీ
4. కింది వాటిని జతపరచండి?
1) సరుగుడు, నరమామిడి
ఎ) శంకాకార వృక్షాలు
2) మర్రి, వేప, చింత
బి) ఛత్రాకార వృక్షాలు
3) కొబ్బరి, ఈత
సి) మాను
4) గడ్డి జాతులు, చెరకు, వెదురు
డి) తృణ కాండం
5) అరటి, మెట్ట తామర
ఇ) అసృత / మిథ్యాకాండం
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
5. తృణ కాండం ఏ మొక్కలో కనిపిస్తుంది?
1) గడ్డి జాతులు 2) చెరకు
3) వెదురు 4) పైవన్నీ
6. అరటి, మెట్టతామరల్లో ఉండే కాండం?
1) తృణ కాండం 2) మిథ్యాకాండం
3) మాను
4) చేవదేరిన కాండం
7. మొక్కల్లోని ఆహార కర్మాగారాలు?
1) వేర్లు 2) కాండాలు
3) పత్రాలు 4) పుష్పాలు
8. ప్రపంచంలో గల పూలనిచ్చే మొక్కల జాతుల సంఖ్య?
1) 1,00000 2) 1, 25,000
3) 1, 50,000 4) 1, 75,000
9. రంగులు కలిగి ఉండే పువ్వులు?
1) పగలు వికసించేవి
2) రాత్రి వికసించేవి
3) మధ్యాహ్నం వికసించేవి
4) సాయంత్రం వికసించేవి
10. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు?
1) మల్లెపువ్వు 2) గోబిపువ్వు
3) రఫ్లీషియా 4) తామర
11. రాత్రి వేళల్లో వికసించే పుష్పాలు ఏ విధంగా ఉంటాయి?
1) తెల్లగా- సువాసన భరితంగా
2) నల్లగా దుర్గంధ భరితంగా
3) ఎర్రగా సువాసన భరితంగా
4) వివిధ రంగులు సువాసన భరితంగా
12. కీటకాలను ఆకర్షించే పూలలో ఉండే తీయనైన పదార్థం?
1) మకరంధం 2) తేనె
3) 1, 2 4) హానీడ్యూ
13. పూలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి?
1) 1-2 రోజులు 2) 2-3 రోజులు
3) 3-4 రోజులు 4) 4-5 రోజులు
14. కింది వాటిలో పూలకు సంబంధించి సరైన నినాదం ఏది?
ఎ) పూలదండలు గౌరవానికి పూల చెట్లు ఆహ్లాదానికి
బి) పూల చెట్ల వాసన మనకెంతో స్వాంతన
సి) సిగకు పూలందం నేలకు చెట్లందం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవన్నీ
15. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం?
1) సుజకీబానా 2) ఇకేబానా
3) హోండాబానా 4)జపనీస్ మ్యాజిక్
16. ఈ పువ్వుతో సెంట్లు తయారు చేస్తారు?
1) పిటూనియా 2) మల్లె
3) గులాబీ 4) రఫ్లీషియా
17. రఫ్లీషియా గురించి కింది వాక్యాల్లో సరైనది?
ఎ) ఇది ప్రపంచంలో అతి పెద్ద పుష్పం
బి) దీని బరువు 4 కిలోలు, వ్యాసం ఒక మీటరు
సి) కుళ్లిన మాంసం వాసన కలిగి ఉంటుంది
డి) కుళ్లిన వాసనను 2 కి.మీ. వరకు వెదజల్లుతుంది
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
18. పూసే కాలాన్ని బట్టి కింది పువ్వులను జతపరచండి?
1) మల్లెలు ఎ) వేసవి కాలం
2) కనకాంబరాలు బి) వర్షాకాలం
3) చామంతి సి) శీతాకాలం
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-సి, 2-బి, 3-ఎ
19. కింది వాటిలో విత్తనం లేని ఫలం ఏది?
1) అరటి 2) కొబ్బరి
3) కిస్మిస్ 4) పైవన్నీ
20. కింది వాటిలో విత్తనాలు లేని కూరగాయ ఏది?
1) బంగాళదుంప 2) క్యారెట్
3) బీట్రూట్ 4) పైవన్నీ
21. కింది వాటిలో ఏ వేరును ఆహారంగా మనం ఉపయోగిస్తాం?
1) క్యారెట్ 2) బీట్రూట్
3) ముల్లంగి 4) పైవన్నీ
22. కింది వాటిలో ఏ మొక్క కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది
1) బంగాళదుంప 2) కంద
3) పసుపు 4) పైవన్నీ
23. ఏ ఎడారి మొక్కలో కాండం కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది?
1) బ్రహ్మజెముడు 2) నాగజెముడు
3) 1, 2 4) కలబంద
24. మొక్కలోని ఇతర భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడటాన్ని ఏమంటారు?
1) బీజ వ్యాప్తి 2) శాఖీయ వ్యాప్తి
3) శాఖీయోత్పత్తి 4) కాండ వ్యాప్తి
25. క్యారెట్ మొక్క జీవితకాలం?
1) 3 సం.రాలు 2) 2 సం.రాలు
3) 1 సంవత్సరం 4) 6 నెలలు
26. కింది వాటిలో ఔషధ మొక్క కానిది?
1) తులసి 2) వేప
3) నీలగిరి 4) మామిడి
27. ఒక కిలో తేనె తయారీకి ఎన్ని పూల మకరంధం కావాలి?
1) 1 మిలియన్ 2) 2 మిలియన్లు
3) 3 మిలియన్లు 4) 4 మిలియన్లు
28. చర్మవ్యాధులు, పుండ్లు నివారణకు ఉపయోగపడే మొక్క?
1) వెల్లుల్లి 2) పుదీనా
3) వేప 4) నీలగిరి
29. అరుదైన అనేక రకాల మొక్కలు మనకు లభించే ప్రదేశం?
1) ఎగ్జిబిషన్ 2) సంత
3) నర్సరీ 4) మార్కెట్
30. ఏ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి?
1) వరి 2) మినుము
3) వేరుశనగ 4) సజ్జ
31. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని రకాల వరి వంగడాలు, వంకాయ రకాలు ఉండేవి?
1) 4,400, 2,500 2) 5,400, 3,500
3) 6,400, 4,500 4) 7,400, 5,500
32. కింది వాటిలో అతి పురాతన వ్యవసాయం?
1) పోడు/ విస్తాపన
2) సాంద్ర వ్యవసాయం
3) సుస్థిర వ్యవసాయం
4) మిశ్రమ వ్యవసాయం
33. ఆధునిక పద్ధతుల్లో సాగుచేసి ఎక్కువ దిగుబడిని పొందే వ్యవసాయం?
1) పోడు వ్యవసాయం
2) సాంద్ర వ్యవసాయం
3) మిశ్రమ వ్యవసాయం
4) సుస్థిర వ్యవసాయం
34. కింది వాటిలో రైతు మిత్రుడు ఎవరు?
1) వానపాము 2) జెర్రిపోతు (పాము)
3) జీవ ఎరువులు 4) పైవన్నీ
35. కింది వాటిలో అతి ప్రమాదకర కలుపు మొక్క ఏది?
1) కుక్కవామింట 2) ముళ్ల వంగ
3) 1, 2 4) తుంగ
36. ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులను కలిగించే కలుపు మొక్క?
1) తుత్తురు బెండ 2) పార్ధీనియం
3) బల రక్కసి 4) గురంగూర
37. కింది వాటిని జతపరచండి.
1) దీర్ఘకాలపు పంట ఎ) 180 రోజులు / అంతకంటే ఎక్కువ కాలం
2) స్వల్పకాలక పంట బి) 100 రోజులు/ అంతకంటే తక్కువ కాలం
3) ఖరీఫ్ పంటలు సి) వరి, జొన్న,మొక్కజొన్న
4) రబీ పంటలు డి) గోధుమ, బార్లీ, ఆవాలు, బఠాణీలు
5) జైద్ పంటలు ఇ) దోస, కర్జూర,కూరగాయలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ
4) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి, 5-బి
38. రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు పుష్పించే మొక్క?
1) గోధుమ 2) పత్తి
3) సోయా చిక్కుడు 4) పైవన్నీ
39. కింది మొక్కపై రాత్రి కాల ప్రభావం ఉండదు?
1) గోధుమ 2) పత్తి
3) జొన్న 4) సోయా చిక్కుడు
40. కింది వాటిలో విశ్వధాతువు ఏది?
1) బార్లీ 2) గోధుమ
3) వరి 4) మొక్కజొన్న
41. మీసోఫిలిక్ యుగం హరప్పా నాగరికత కాలంలో ఏ పంటను సాగు చేసినట్లు ఆధారాలున్నాయి?
1) పత్తి 2) బార్లీ
3) జొన్న 4) వరి
42. ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో వరిని పండించే దేశం?
1) చైనా 2) ఇండియా
3) జపాన్ 4) అమెరికా
43. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు ప్రారంభించే పండుగ?
1) బతుకమ్మ 2) సంక్రాంతి
3) దసరా 4) ఏరువాక
44. అమృతసారి, బంగారుతీగ, కొల్లేటి కుసుమ, పొట్టి బాసంగి అనేవి ఏ పంట వంగడాలు?
1) గోధుమ 2) కాఫీ
3) వరి 4) వేరుశనగ
45. కింది వాటిని జతపరచండి?
1) ఒరైజా సటైవా ఎ) ఆసియా
2) ఒరైజా గ్లబెర్రియా బి) ఆఫ్రికా
3) ఒరైజా గ్లుమపాట్యులా సి) అమెరికా
4) మొలగొలుకులు డి) నెల్లూరు
5) సోనా ఇ) కర్నూలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి, 5-ఇ
4) 1-డి, 2-ఇ, 3-బి, 4-సి, 5-ఎ
46. మన దేశంలో సంకరజాతి విత్తనాలను రూపొందించడం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1911 2) 1921
3) 1931 4) 1941
47. కింది వారిలో ఎవరు వరి విత్తనాల రూపకల్పనకు పరిశోధన చేశారు?
1) డా, శివరాం 2) డా. జి.పి. హెక్టార్
3) డా. లక్డావాలా 4) డా. ఘోష్
48. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ స్థాపించిన సంవత్సరం?
1) 1927 2) 1928
3) 1929 4) 1930
49. 1950 నాటికి దేశంలో ఎన్ని రకాల వరి వంగడాలను రూపొందించారు?
1) 245 2) 345
3) 445 4) 545
50. పొమాటోను ఏయే మొక్కల సంకరణం ద్వారా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు?
1) వంకాయ టొమాటో
2) టొమాటో బంగాళాదుంప
3) బంగాళాదుంప పొట్లకాయ
4) బంగాళాదుంప బీట్రూట్
51. నీటి వృథాను అరికట్టడానికి అత్యంత ప్రయోజనకర సేద్య పద్ధతి
1) బిందు సేద్యం 2) గొట్టపు బావులు
3) కాలువలు 4) చెరువులు

– ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం





