GPAT | జీ ప్యాట్ 2023
GRADUATE PHARMACY APTITUDE TEST | ఫార్మా.. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగం. కొవిడ్ తర్వాత ఈ రంగం మరింత పుజుంకుంది. మానవజాతి ఉన్నంత వరకు ఈ రంగానికి ఢోకాలేదు. ఫార్మా పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష జీ ప్యాట్-2023 ప్రకటన విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
జీ ప్యాట్ 2023
- దేశవ్యాప్తంగా 870 ఫార్మా కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి పరీక్ష ‘గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్’ – జీప్యాట్. ఈ పరీక్షను 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
కోర్సు: ఎం.ఫార్మా / తత్సమాన కోర్సు (పీజీస్థాయి)
ప్రవేశాలు కల్పించే సంస్థలు
- దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ అనుమతి పొందిన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు. దీనిలో భాగస్వామ్యం ఉన్న కొన్ని ప్రముఖ సంస్థలు.. నైపర్, మొహాలి, న్యూఢిల్లీలోని జామియా హాండార్డ్, చండీగఢ్-యూనివర్సిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీ-కోల్‌కతా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-ముంబై, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్, ఐఐటీ బీహెచ్‌యూ-వారణాసి, మహారాజ సయాజీరావ్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా-వడోదర, నైపర్-హైదరాబాద్, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్-న్యూఢిల్లీ, ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం తదితరాలు
ఎవరు అర్హులు…?
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంటర్ తర్వాత నాలుగేండ్ల కోర్సు, లేటరల్ ఎంట్రీ విద్యార్థులు కూడా అర్హులే) లేదా బీఫార్మసీ (10+2+4) ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు/బీటెక్ (ఫార్మాస్యూటికల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ) లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణులు.
నోట్: జీప్యాట్ రాసే అభ్యర్థులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎంపిక ఎలా: దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
పరీక్ష విధానం: - ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
- పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 3 గంటల
కాలవ్యవధి. 125 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత విధిస్తారు. - రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
నోట్: జీప్యాట్ రాసేవారికోసం ఎన్టీఏ దేశవ్యాప్తంగా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల (టీపీసీ)ను ప్రారంభించింది. టీపీసీలో అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ నోడల్ ఆఫీసర్, స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎన్టీఏ వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 6
- ఫీజు: జనరల్/ఓబీసీలకు
- రూ.2200/-
- మహిళలు, ట్రాన్స్జెండర్లు (ఏ కేటగిరీ అయినా), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ (పురుష/మహిళ)- రూ.1100/-
- వెబ్సైట్: https:// gpat.nta.nic.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Previous article
Science & Technology | ‘జాకబ్సన్’ అనే జ్ఞానేందియం ఉండే జీవి?
Next article
01st March Current Affairs | తెలంగాణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?