01st March Current Affairs | తెలంగాణ
శ్రీహన్ రెడ్డి
నాసా (నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) పరీక్షలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీహన్ రెడ్డి ప్రపంచ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఫిబ్రవరి 19న నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రైటెస్ట్ మైండ్స్ ఆఫ్ వరల్డ్ ఐదో స్థాయి పరీక్షల్లో సత్తాచాటాడు. దీంతో అతడు అమెరికాలోని నాసా కేంద్రాన్ని సందర్శించేందుకు అర్హత పొందాడు.
దుండిగల్ ఠాణా
రాష్ట్రంలో ఉత్తమ ఠాణాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ ఫిబ్రవరి 20న ఎంపికయ్యింది. కేంద్ర హోం శాఖ ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. 2022కు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ స్టేషన్ తెలంగాణలో తొలి ర్యాంకు సాధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రశంసాపత్రాన్ని అందజేసింది.
బయోమి సదస్సు
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన్ అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ, మెడిసిన్ (బయోమి)-2023 సదస్సు ఫిబ్రవరి 23న ముగిసింది. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ సదస్సు నిర్వహించారు. బయో, ఫార్మా రంగాల్లో వస్తున్న మార్పులు, చేయాల్సిన పరిశోధనలపై చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి సైంటిస్టులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు.
టీఎస్ఎఫ్డీసీ
అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ప్రమాణాలు పాటిస్తున్న తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ)కు జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ (ఎఫ్ఎస్సీ) సర్టిఫికెట్ ఫిబ్రవరి 23న లభించింది. రాష్ట్రంలో తయారయ్యే సేంద్రియ అటవీ ఉత్పత్తులకు 5 సంవత్సరాల పాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్సీ అనుమతిచ్చింది. కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కింది. ఈ అటవీ ఉత్పత్తుల నుంచి తయారు చేసే కాగితం, టెట్రా ప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్ఎస్సీ ఆమోదం లభించింది.
బయో ఏషియా సదస్సు
20వ బయో ఏషియా-2023 సదస్సు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సదస్సుకు 50 దేశాల నుంచి సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులు హాజరయ్యారు. వైద్యం, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనుగొనడంపై చర్చించారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?