Science & Technology | ‘జాకబ్సన్’ అనే జ్ఞానేందియం ఉండే జీవి?
1. జతపరచండి.
1. లైపేజ్ ఎ. పప్టైడ్లు
2. న్యూక్లియేజ్ బి. స్టార్చ్
3. టయలిన్ సి. న్యూక్లికామ్లాలు
4. పెస్టిడేజేస్ డి. కొవ్వులు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2. పిండి పదార్థంపై చర్య జరిపి డెక్స్ట్రీన్స్, మాల్టోజ్ అనే అంత్య ఉత్పాదకాలను ఏర్పరిచే ఎంజైమ్ ఏది?
1) లైపేజ్ 2) టయలిన్
3) సుక్రోజ్ 4) లాక్టోజ్
3. కింది వాటిలో ఏ ఎంజైమ్ క్లోమం ద్వారా స్రవించబడి ప్రొటీన్లపై చర్య జరుపుతుంది?
1) పెప్సిన్
2) న్యూక్లియేజ్
3) ట్రిప్సిన్ 4) పప్ట్టైడేజ్
4. జీర్ణనాళం ప్రారంభం నుంచి అంత్యం వరకు ఉండే కొన్ని భాగాల సరైన వరుసక్రమం?
1) ఆస్యకుహరం, గ్రసని, జీర్ణాశయం, ఆహారవాహిక, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళం
2) గ్రసని, ఆస్యకుహరం, జీర్ణాశయం, ఆహారవాహిక, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళం
3) గ్రసని, ఆస్యకుహరం, జీర్ణాశయం, ఆహారవాహిక, చిన్నపేగు, పురీషనాళం, పెద్దపేగు
4) ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళం
5. అంధనాళాన్ని, జెజునాన్ని కలిపే భాగం?
1) ఆంత్రమూలం 2) శేషాంత్రికం
3) కోలాన్ 4) పురీషనాళం
6. క్షీరదాల్లో లాలాజలగ్రంధులు కింది ఏ భాగంలో ఉంటాయి?
1) ఆస్యకుహరం 2) గ్రసని
3) ఆహారవాహిక 4) నోరు
7. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. దంతాలు డెంటిన్ అనే అత్యంత గట్టి పదార్థంతో ఏర్పడును
బి. దంతపు పైభాగాన్ని కప్పుతూ ఎనామిల్ అనే మెరిసే పొర ఉంటుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
8. శాశ్వత దంతాలలో కింది ఏ రెండు రకాల దంతాలు సమాన సంఖ్యలో ఉంటాయి?
1) కుంతకాలు, రదనికలు
2) కుంతకాలు, అగ్రచర్వణకాలు
3) అగ్రచర్వణరకాలు, చర్వణకాలు
4) కుంతకాలు, చర్వణకాలు
9. డయాస్టీమా అంటే?
1) కుంతకాలు లోపించడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశం
2) రదనికలు లోపించడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశం
3) అగ్రచర్వణకాలు లోపించడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశం
4) చర్వణకాలు లోపించడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశం
10. జతపరచండి.
1. కుంతకాలు ఎ. విసురుదంతాలు
2. రదనికలు బి. నములు దంతాలు
3. అగ్రచర్వణకాలు సి. చీల్చుదంతాలు
4. చర్వణకాలు డి. కోరపళ్లు
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
11. కింది వాటిలో ఏ హార్మోన్ జీర్ణాశయం నుంచి స్రవించే జఠరరసం ఉత్పత్తిలో, జీర్ణాశయ కదలికలకు తోడ్పడును?
1) సెక్రెటిన్ 2) గాస్ట్రిన్
3) విల్లికైనిన్ 4) ఎంటిరోకైనిన్
12. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. జీర్ణాశయం నుంచి ఆహారం ఆంత్రమూలంలోకి చేరడానికి సెక్రెటిన్ తోడ్పడును
2. ఆంత్రమూలంలో ఉత్పత్తి అయ్యే కొలిసిస్టోకైనిన్ క్లోమరసం ఆంత్రమూలం చేరడంలో తోడ్పడుతుంది
1) 1 2) 2
3) 1, 2 4) ఏదీకాదు
13. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. పెద్దపేగులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు
బి. పెద్ద పేగులో ఈ-కోలై అనే బ్యాక్టీరియాను కలిగిన భాగం కోలాన్
సి. పెద్ద పేగులో చూషకాలు వంటి నిర్మాణాలు ఉండి చిన్న చిన్న ఆహారరేణువులను శోషణం చేసి రక్తంలోకి పంపించును
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) ఎ, బి, సి
14. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనడానికి కారణం?
1) వినాళభాగం, నాళ సహిత భాగం రెండూ కలిగి ఉంటుంది
2) ఇది ఎంజైమ్లను, హార్మోన్లను స్రవిస్తుంది
3) ఇది జీర్ణక్రియలో, గ్లూకోజ్ నియంత్రణలో పాల్గొంటుంది
4) పైవన్నీ
15. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ఉచ్ఛాస, నిశాసంలోని నైట్రోజన్ శాతాల్లో మార్పు ఉండదు
బి. ఉచ్ఛాసంలోని ఆక్సిజన్ శాతం నిశాసంలోని ఆక్సిజన్ శాతం కంటే ఎక్కువ
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
16. కింది ఏ జీవిలో జాకబ్సన్ అనే జ్ఞానేంద్రియం ఉంటుంది?
1) పాము 2) తేలు
3) బల్లి 4) రొయ్య
17. కింది వాటిలో శ్వాసవ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఏది?
1) డిఫ్తీరియా 2) పయేరియా
3) మలేరియా 4) డయేరియా
18. శ్వాసక్రియ రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?
1) చిన్నపిల్లలు 2) యువకులు
3) మధ్యవయస్కులు
4) ముసలివారు
19. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. వాయుశ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగి గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిత్తి చేయబడుతుంది
బి. అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగి గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిత్తి చేయబడుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
20. రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యే భాగం ఏది?
1) మెదడు 2) హృదయం
3) మూత్రపిండాలు
4) ఊపిరితిత్తులు
21. క్షీరదాల కుడి, ఎడమ ఊపిరితిత్తుల్లోని లంబికల సంఖ్య, వాటిని చుట్టి ఉండే ఫ్లూరాత్వచాల సంఖ్య వరుసగా?
1) 3, 2, 2 2) 2, 3, 2
3) 2, 2, 3 4) 3, 3, 2
22. జతపరచండి.
1. ప్లాస్మాత్వచం ఎ. చర్మశ్వాసక్రియ
2. పుస్తకాకార ఊపిరితిత్తులు బి. వ్యాపనం
3. పుస్తకాకార మొప్పలు సి. పుపుస శ్వాసక్రియ
4. చర్మం డి. జల శ్వాసక్రియ
1) 1-సి, 2-బి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
23. జతపరచండి.
1. తేలు ఎ. పుస్తకాకార మొప్పలు
2. రొయ్య బి. పుస్తకాకార ఊపిరితిత్తులు
3. వానపాము సి. మొప్పలు
4. టాడ్పోల్లార్వా డి. చర్మం
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
24. శ్వాసక్రియ వల్ల ప్రతిరోజు ఎన్ని మి.లీ. నీరు బయటకు విడుదల అవుతుంది?
1) 200 2) 300
3) 400 4) 500
25. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. నిమ్నజీవులైన అకశేరుకాల్లో గుండె నాడులచే నిర్మితం అందుకే దీన్ని నాడీ జనిత హృదయం అంటారు
బి. క్షీరదాలు వంటి ఉన్నత జీవుల్లో గుండె కండరాలచే నిర్మితం అందుకే దీన్ని కండర జనిత హృదయం అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
26. కింది వాటిలో గుండెలో పెద్ద గది?
1) కుడి కర్ణిక 2) ఎడమ కర్ణిక
3) కుడి జఠరిక 4) ఎడమ జఠరిక
27. జతపరచండి.
1. సాధారణ రక్తపీడనం ఎ. 120/80
2. ఒక స్పందనకు గుండె నుంచి బయటకి వచ్చే రక్తం (మీ.లలో) బి. 50/40
3. కార్డియాక్ అవుట్పుట్ (మి/మినిట్స్లలో) సి. 70
4. హృదయ స్పందన పూర్తి కావడానికి పట్టే కాలం (ని. లలో) డి. 0.8
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
28. హై బీపీ అంటే?
1) సిస్టోల్ పీడనం పెరిగి, డయాస్టోల్ పీడనం తగ్గడం
2) సిస్టోల్, డయాస్టోల్ పీడనాలు రెండూ పెరగడం
3) సిస్టోల్ పీడనం తగ్గి, డయాస్టోల్ పీడనం పెరగడం
4) సిస్టోల్, డయాస్టోల్ పీడనాలు రెండూ తగ్గడం
29. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా గుండెలోని కవాటాలను సరిచేయడం (లేదా) కృత్రిమ కవాటాలను అమరుస్తారు
బి. బైపాస్ సర్జరీలో హృదయధమనికి అవాంతరాలు ఏర్పడితే దాని పక్కనే కొత్త రక్తనాళాన్ని అమరుస్తారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
30. కింది వాటిలో అతిపెద్ద ధమని, అతి పెద్ద సిర వరుసగా?
1) పుపుస ధమని, పుపుస సిర
2) మహాధమని, పుపుస సిర
3) మహాధమని, మహాసిర
4) హృదయధమని, హృదయ సిర
31. జతపరచండి.
1. రక్తం గడ్డకట్టించే ఎంజైమ్ ఎ. థ్రాంబోసైట్స్
2. రక్తం గడ్డకట్టించే విటమిన్ బి. థ్రాంబోకైనేజ్
3. రక్తం గడ్డకట్టించే మూలకం సి. విటమిన్-కె
4. రక్తం గడ్డకట్టించే కణాలు డి. Ca
5. రక్తం గడ్డకట్టించే కారకాలు ఇ. ఫైబ్రినోజన్
1) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ, 5-బి
2) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఇ, 5-బి
32. డెంగీని కలిగించే వైరస్ కింది ఏ కణాలపై ప్రభావం చూపడం వల్ల వీటి సంఖ్య తగ్గుతుంది?
1) లింఫోసైట్స్ 2) మోనోసైట్స్
3) న్యూట్రోఫిల్స్ 4) రక్తఫలకికలు
33. రక్తాన్ని గడ్డ కట్టించడానికి నిరోధించే సహజకారకం ఏది?
1) సోడియం సిట్రేట్ 2) EDTA
3) ప్రోథ్రాంబిన్ 4) హెపారిన్
34. అతిపొడవైన RBC గల జంతువేది?
1) ఏనుగు 2) కస్తూరిజింక
3) ఆంఫీయుమ 4) ఒంటె
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
కండరాలు (Muscles)
- కండరాల అధ్యయనాన్ని ‘మయాలజీ/ సార్కాలజీ’ అంటారు. వీటి కదలికల అధ్యయనాన్ని ‘కైనిసాలజీ’ అంటారు.
- ముఖ్యవిధి – సంకోచ, సడలికలు చెంది ఎముకలను కదల్చడం.
- వీటి మొత్తం సంఖ్య -639. అతిపెద్ద కండరం-గ్లుటియస్ మాక్టిమస్ (పిరుదు కండరం), అతిచిన్న కండరం – స్టెపీడియస్ (చెవి కండరం), అతి పొడవైన కండరం- సార్టోరియస్ (తొడ కండరం), అతి బలమైన కండరం- మాసెటర్ (దవడ కండరం), కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు K, Ca. దీన్ని వివరించే సిద్ధాంతం ‘ైస్లెడింగ్ ఫిలమెంట్ థియరీ’ ప్రతిపాదించింది హక్సలే.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు