GAT-B & BET 2023 | బయో టెక్నాలజీతో బంగారు భవిత
GAT-B & BET 2023 | ఎవర్ గ్రీన్ కెరీర్లో బయోటెక్నాలజీ ఒకటి. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో అవకాశాలు రానున్న రోజుల్లో పుష్కలంగా పెరుగనున్నాయి. ప్రస్తుతం బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు, జేఆర్ఎఫ్ కోసం జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష జీఏటీ-బీ అండ్ బీఈటీ-2023. ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు, సంస్థలు, అర్హత తదితర వివరాలు సంక్షిప్తంగా….
జీఏటీ-బీ అండ్ బీఈటీ-2023
- గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) అండ్ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్
Biotechnology Eligibility Test (బీఈటీ)-2023
జీఏటీ- బీ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు - ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ , బయో రిసోర్సెస్ బయోటెక్నాలజీ), ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ మెరైన్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, ఎమ్మెస్సీ బయోఇన్ఫర్మాటిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ (అగ్రి) ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఎంటెక్ కంప్యూటేషనల్ బయాలజీ, ఎంటెక్ బయోప్రాసెస్ టెక్నాలజీ, ఎంటెక్ ఫుడ్ బయోటెక్నాలజీ, ఎంటెక్ ఫార్మస్యూటికల్ బయోటెక్నాలజీ, ఎంవీఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ.
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ, బీపీటీ, బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంబీబీఎస్, ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు వయస్సు 28 ఏండ్లు మించరాదు.
ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా - ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
- ఐసీటీ ముంబై, ఐఐఐటీ ఢిల్లీ, కొచ్చిన్ యూనివర్సిటీ, పుదుచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ కర్ణాటక, తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, జేఎన్‌యూ ఢిల్లీ, సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ, ఓయూ-హైదరాబాద్, బీహెచ్‌యూ, పీజీఐఎంఈఆర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్‌పూర్ యూనివర్సిటీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఇండోర్, అమిటీతో పాటు పలు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 31
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 23
- వెబ్సైట్: https://dbt.nta.ac.in
Next article
Career guidance | Study in Singapore
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?