Navodaya Vidyalaya | విద్యార్థి వికాసానికి నవోదయం
Navodaya Vidyalaya 6th Class Admissions | విద్యాలయాలు కేవలం చదువునే అందించవు. విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంట్కు దోహదం చేస్తాయి. చదువుతోపాటు క్రీడలు, కళలు ఇలా అనేక రకాల ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అందించడం తప్పనిసరి. వీటన్నింటిని సమపాళ్లలో అందించినప్పుడే విద్యార్థికి సమగ్ర వికాసం జరుగుతుందని మనోవైజ్ఞానిక శాస్త్రం పేర్కొంటుంది. అనేక కారణాల రీత్యా నేటి కాలంలో బోధనతోపాటు ఆటలు, పాటలు, కళలు, సాహిత్యం ఇలా అన్నింటిని మేళవించి బోధించే పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత విద్యతోపాటు కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా, విదార్థుల పరిపూర్ణ వికాసానికి కృషి చేస్తున్నవే నవోదయ విద్యాలయాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
నవోదయ విద్యాలయ సమితి
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 1986లో వీటిని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో 649 జేఎన్వీలు ఉన్నాయి. రాష్ట్రంలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రతి జేఎన్వీలో ఆరోతరగతికి 80 సీట్ల చొప్పున అందుబాటులో ఉంటాయి.
- గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, బాలికలకు 33 శాతం సీట్లను కేటాయిస్తారు.
- జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ) పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలోనే ఉంటాయి. ఈ పాఠశాలల్లో ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. సీబీఎస్ఈ సిలబస్‌తో బోధన ఉంటుంది.
ఉచిత విద్య - జేఎన్వీలో ఉచిత విద్యను అందిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి మాత్రం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బాలికలు, బీపీఎల్ వర్గాల పిల్లలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అర్హతలు - 2023-24 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించిన 75 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే మూడు, నాలుగు, ఐదో తరగతి చదివి ఉండాలి. అభ్యర్థులు 2012, మే 1 నుంచి 2014, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
- ఏ జిల్లా జేఎన్వీకి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ జిల్లా స్థానిక అభ్యర్థులై ఉండాలి.
ఎంపిక విధానం ఇలా.. - ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ (జేఎన్వీఎస్టీ) మూడు విభాగాల్లో నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష ఆఫ్‌లైన్ పరీక్ష. పెన్ అండ్ పేపర్ విధానంలో ఉంటుంది.
- మొత్తం 80 ప్రశ్నలు. 100 మార్కులు. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు
- పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్షలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్
- ఈ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న జిల్లా, అక్కడ ఉన్న సీట్ల సంఖ్య, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఆగస్టు 10
- వెబ్సైట్: https://cbseitms.rcil.gov.in/nvs/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?