IMU CET 2023 | సముద్రమంత అవకాశాలు
ఐఎంయూలో ప్రవేశాలు
మారిటైం పుష్కలమైన అవకాశాలు ఉన్న రంగం. భారత్‌లో 12 మేజర్, 200 పైగా నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. సుమారు 7500 కి.మీ. సముద్ర తీరప్రాంతం భారత్ సొంతం. రానున్న సంవత్సరాల్లో ‘బ్లూ ఎకానమీ’ మరింత పెరుగనున్నది. అపారమైన అవకాశాలు ఈ రంగంలో రానున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఐఎంయూ అందించే కోర్సుల గురించి సంక్షిప్తంగా…
ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ)
- దీన్ని 2008లో ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ భారత షిప్పింగ్ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. చెన్నై ప్రధాన కార్యాలయం. మారిటైం అంటే సమద్ర రంగానికి సంబంధించిన విద్య, శిక్షణ, పరిశోధనలతోపాటు ఓషనోగ్రఫీ, మారిటైం హిస్టరీ, లా, సెక్యూరిటీ, రెస్క్యూ, కార్గో, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తదితర అంశాల కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రారంభించారు. దేశంలోని 7 ప్రధానమైన పరిశోధన సంస్థలు ఐఎంయూ పరిధిలో పనిచేస్తున్నాయి. దేశంలోని మారిటైం కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐఎంయూ ఏటా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ టెస్ట్ ద్వారా పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అందిస్తున్న కోర్సులు
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
- బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్), బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)- ఈ రెండు కోర్సుల కాలవ్యవధి నాలుగేండ్లు.
- ఈ కోర్సులను చెన్నై, కోల్‌కతా, ముంబై పోర్ట్ క్యాంపస్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
- బీఎస్సీ (నాటికల్ సైన్స్)- మూడేండ్లు. ఈ కోర్సును చెన్నై, కొచ్చి, నవీ ముంబై కా్ంయపస్లు అందిస్తున్నాయి.
- బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ & ఈకామర్స్)- మూడేండ్లు. ఈ కోర్సును చెన్నై, కొచ్చి క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
- బీఎస్సీ (షిప్ బిల్డింగ్ & రిపేర్)- ఈ కోర్సును సీఎస్టీ పాలక్కడ్ అందిస్తుంది.
- డీఎన్ఎస్ (నాటికల్ సైన్స్ డిప్లొమా)- ఏడాది. ఈ కోర్సును చెన్నై, నవీ ముంబై క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
- అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ- మారిటైం లాజిస్టిక్స్- మూడేండ్లు. ఈ కోర్సును విశాఖపట్నం క్యాంపస్ ఆఫర్ చేస్తుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ (రెండేండ్ల కోర్సులు)
- ఎంటెక్ (మెరైన్ టెక్నాలజీ), ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్&ఓషన్ ఇంజినీరింగ్), ఎంటెక్ (డ్రెడ్జింగ్&హార్బర్ ఇంజినీరింగ్), ఎంబీఏ (పోర్ట్&షిప్పింగ్ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్&లాజిస్టిక్స్ మేనేజ్మెంట్). పీజీ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజినీరింగ్ (ఏడాది). వీటితోపాటు పీజీ డిప్లొమా, పీహెచ్డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
ప్రవేశ విధానం - బీబీఏ ప్రోగ్రామ్ మినహాయించి మిగిలిన అన్ని కోర్సులలో ప్రవేశాలను ఐఎంయూ సెట్ ద్వారా కల్పిస్తారు.
- 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (ఇంటర్‌స్థాయి) నుంచి ప్రశ్నలు ఇస్తారు.
నోట్: ఎంబీఏ, ఎంటెక్ ప్రవేశాల పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. బీబీఏకు ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ, ఎంబీఏ తదితరాలకు వెబ్సైట్ చూడవచ్చు.
ఐఎంయూ క్యాంపస్‌లు
కోల్‌కతా, ముంబై పోర్ట్ క్యాంపస్, నవీ ముంబై, చెన్నై, విశాఖపట్నం, కొచ్చి. ఇవి కాకుండా 17 ఐఎంయూ అప్లయేటెడ్ మారిటైం విద్యా సంస్థలు ఉన్నాయి.
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 18
ఐఎంయూసెట్ తేదీ: జూన్ 10
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.imu.edu.in
Next article
BARC Recruitment | బార్క్‌లో 4374 ఖాళీలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?