Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.EPFO Recruitment | ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
EPFO SSA Recruitment 2023 | న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి జాతీయ పరీక్షల సంస్థ (National Testing Agency) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, హిందీలో కంప్యూటర్ టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 2674 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 2674
పోస్టులు : సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్. (ఏపీలో 39, తెలంగాణలో 116 ఖాళీలు)
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, హిందీలో కంప్యూటర్ టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏండ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం : నెలకు రూ.29,200 నుంచి రూ.92,300.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ పరీక్ష 600 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పూర్తిచేయాలి. పరీక్షలో జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ లిటరసీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్: http://recruitment.nta.nic.in & www.epfindia.gov.in
2. EPFO Recruitment | ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు
EPFO Stenographer Recruitment 2023| న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి)(Stenographer) పోస్టుల భర్తీకి జాతీయ పరీక్షల సంస్థ (National Testing Agency) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ టైపింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రకటన ద్వారా మొత్తం 185 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 185
పోస్టులు : స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి)
అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ టైపింగ్ అనుభవం
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏండ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం : నెలకు రూ.25,500 నుంచి రూ.81,000.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ పరీక్ష 800 మార్కులకు ఉంటుంది. 2 గంటల 10 నిమిషాల్లో పూర్తిచేయాలి. పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 27
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్: http://recruitment.nta.nic.in & www.epfindia.gov.in
3.IRCON Recruitment | ఇర్కాన్‌లో 34 పోస్టులు
IRCON Recruitment 2023 | వర్క్స్ ఇంజినీర్ (Works Engineer posts) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, S&T తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒక యేడాది పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు : వర్క్స్ ఇంజినీర్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, S&T తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒక యేడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.36000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 26 వరకు.
వెబ్సైట్ : ircon.org
4.AIASL Varanasi | ఏఐఏఎస్ఎల్ వారణాసిలో 36 పోస్టులు
AIASL Varanasi Recruitment 2023 | వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 36
పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి 10వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత
వయసు: 28 ఏండ్లు మించకూడదు
జీతం: నెలకు రూ.23640
ఎంపిక : వాక్ఇన్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వేదిక : పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటర్ కాలేజ్, సిస్వాన్, బబత్‌పూర్, వారణాసి, పిన్ – 221006, ఉత్తర ప్రదేశ్.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 24 నుంచి 26 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.
వెబ్సైట్ : www.aiasl.in
5.ESIC Faridabad Recruitment | ఈఎస్ఐసీ ఫరిదాబాద్‌లో 77 పోస్టులు
ESIC Faridabad Recruitment 2023 |యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ తదితర విభాగాలలో.. సీనియర్ రెసిడెంట్ (Senior Residents), సీనియర్ రెసిడెంట్(జీడీఎంఓ) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఫరీదాబాద్‌లోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 77
పోస్టులు: సీనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్(జీడీఎంఓ).
విభాగాలు: యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, క్యాజువాలిటీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్బీ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.67700నుంచి రూ.127141లక్షలు
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్, ఎన్‌హెచ్-3, ఎన్ఐటీ, ఫరిదాబాద్.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 26
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:15 నుంచి.
వెబ్సైట్ : www.esic.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?