Entrance Examinations | ప్రవేశపరీక్షలు- దరఖాస్తు విధానం
మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో….
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగాను 6, 7, 8 తరగతుల్లో (ఇ.మీ)లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రవేశ తరగతులు: 6, 7, 8 (ఇంగ్లిష్ మీడియం)
# అర్హతలు: ఆరోతరగతిలో ప్రవేశాల కోసం అయిదో తరగతి, ఏడో తరగతికి ఆరో తరగతి ఉతీతర్ణత, ఎనిమిదో తరగతికి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిదాలయాల్లో చదివి ఉండాలి.
# తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.లక్షా యాభైవేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు మించరాదు.
# వయస్సు: 2022, ఆగస్టు 31 నాటికి ఆరోతరగతికి 12 ఏండ్లు, ఏడోతరగతికి 13 ఏండ్లు, ఎనిమిదో తరగతికి 14 ఏండ్లు మించరాదు.
#ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
ముఖ్యతేదీలు
# దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరితేదీ: జూన్ 2
# ప్రవేశ పరీక్షతేదీ: జూన్ 19
# దరఖాస్తు ఫీజు: రూ.100
# వెబ్సైట్: https://mjptbcwreis.telangana.gov.in
ఏఐఎంఏ- మ్యాట్
దేశంలోని ప్రముఖ బీ స్కూల్స్‌లో ఎంబీఏ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది.
మ్యాట్
# మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)ను 1988 నిర్వహిస్తున్నారు. దీన్ని కేంద్ర విద్యాశాఖ 2003 నుంచి జాతీయస్థాయి పరీక్షగా గుర్తించింది. సుమారు 600 బీ స్కూల్స్ మ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.
# అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
# ఎంపిక: ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ లేదా పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
# నోట్: అభ్యర్థులు పై పరీక్ష విధానాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు.
ముఖ్యతేదీలు
# దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరితేదీ: మే 9
# పరీక్ష తేదీ: మే 15
# వెబ్సైట్: https://mat.aima.in/may22/
ఇంటర్‌తో ఐఐఎంలో ప్రవేశాలు
కేవలం ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ప్రవేశాలు కల్పించే ఐపీఎం నోటిఫికేషన్ విడుదలైంది.
ఐపీఎం: ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. దేశంలో మొదటిసారి ఐఐఎం ఇండోర్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సును 2011లో ప్రారంభించింది. ఈ కోర్సు కాలవ్యవధి ఐదేండ్లు. ఈ కోర్సులో మొదటి మూడేండ్లు ఫౌండేషన్, తర్వాతి రెండేండ్లు మేనేజ్మెంట్పై ఉంటుంది.
# మూడేండ్ల కోర్సును బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) డిగ్రీగా, తర్వాత రెండేండ్ల కోర్సును మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)గా పరిగణిస్తారు. దీన్ని డ్యూయల్ డిగ్రీగా కూడా పిలుస్తారు.
# మొదటి మూడేండ్లు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్ స్టడీస్, లాంగ్వేజెస్‌ను బోధిస్తారు. వీటితోపాటు డ్యాన్స్, మ్యూజిక్, డ్రామా, స్పోర్ట్ ఉంటాయి.
# తర్వాత పీజీపీ లెవల్ కరికులం ఉంటుంది. దీనిలో కమ్యూనికేషన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హెచ్ఆర్, ఐటీ, మార్కెటింగ్, ఓబీ &హెచ్ఆర్, స్ట్రాటజీ తదితర అంశాలు ఉంటాయి.
# నాలుగో సంవత్సరం చివర్లో ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తారు.
# అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో 2020/2021లో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు లేదా 2022లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
# వయస్సు: 2002, ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది.
# ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ అసెస్మెంట్/ఇంటర్వ్యూ
# ఆప్టిట్యూడ్ టెస్ట్: ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మూడు సెక్షన్లు ఉంటాయి.
# మొదటి సెక్షన్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ. ఈ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
# రెండో సెక్షన్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ఇస్తారు.
# మూడో సెక్షన్లో వెర్బల్ ఎబిలిటీ నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
నోట్: క్వాంటిటేటివ్ ఎబిలిటీ షార్ట్ ఆన్సర్ సెక్షన్ మినహాయించి మిగిలిన రెండు సెక్షన్లలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
# ఆప్టిట్యూడ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా పర్సనల్/అసెస్మెంట్ టెస్ట్ కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
ప్లేస్‌మెంట్స్
# ఐఐఎంలో ప్లేస్‌మెంట్స్‌కు బెయిన్ అండ్ కంపెనీ, బీసీజీ, డెలాయిట్, ఆప్టమ్, ఏసీటీ, జేపీ మోర్గాన్, డీఈ షా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, సిప్లా, ఎల్ అండ్ టీ, ఎంఎక్స్ ప్లేయర్, ఏషియన్ పెయింట్స్, హిండ్‌వేర్, ఐటీసీ, హిందుస్థాన్ లివర్స్, బజాజ్, పేటీఎం, మైక్రోసాప్ట్, ఎస్ బ్యాంక్, వాల్‌మార్ట్, జెన్‌ప్యాక్, టాటా, ఎస్బీఐ క్యాప్, ఫోన్ పే తదితర సంస్థలు కాలేజీ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంటాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 21
ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 2
వెబ్సైట్: https:// www.iimidr.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?