జనరల్ ఎస్సే ప్రిపరేషన్ ఎలా?(Groups Guidance)

గ్రూప్స్ గైడెన్స్
త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పరీక్ష ద్వారా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, మున్సిపల్ కమిషనర్ వంటి కీలకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షలో విజయానికి ప్రత్యక్షంగా దోహదపడే జనరల్ ఎస్సే ప్రిపరేషన్ గురించి సలహాలు, సూచనలు నిపుణ పాఠకుల కోసం..
# గ్రూప్-1 మెయిన్స్‌లోని మొత్తం పేపర్లలో జనరల్ ఎస్సే (పేపర్-1)కు 150 మార్కులు కేటాయించారు. జనరల్ ఎస్సే సిలబస్‌లో మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్లో రెండు అంశాల చొప్పున మొత్తం ఆరు అంశాలను పేర్కొన్నారు. వీటిలో నుంచి వచ్చే మూడు ప్రశ్నలకు (ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు) మూడు గంటల్లో సమాధానాలు రాయాలి.
సిలబస్
# గ్రూప్-1 మెయిన్స్‌లోని మొత్తం పేపర్లలో జనరల్ ఎస్సే (పేపర్-1)కు 150 మార్కులు కేటాయించారు. జనరల్ ఎస్సే సిలబస్‌లో మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్లో రెండు అంశాల చొప్పున మొత్తం ఆరు అంశాలను పేర్కొన్నారు. వీటిలో నుంచి వచ్చే మూడు ప్రశ్నలకు (ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు) మూడు గంటల్లో సమాధానాలు రాయాలి.
సెక్షన్-1
1) కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ (సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు)
2) ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ (ఆర్థిక వృద్ధి, న్యాయ అంశాలు)
సెక్షన్-2
1) డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ (భారత రాజకీయ పరిణామాలు)
2) హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా (భారత దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం)
సెక్షన్-3
1) డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక రంగంలో అభివృద్ధి పరిణామాలు)
2) ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (విద్య, మానవ వనరుల అభివృద్ధి)
# మిగతా పేపర్లలో ఒక్కో ప్రశ్నకు 10 మార్కులుండే అవకాశం ఉంది. అంటే ఐదు ప్రశ్నలకు రాసే సమాధానాలను జనరల్ ఎస్సేలో ఒక ప్రశ్నకు రాయాలి. కాబట్టి అభ్యర్థులు జనరల్ ఎస్సే ప్రిపరేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
జనరల్ ఎస్సే లక్ష్యం
#జనరల్ ఎస్సే రాయడానికి నిర్దిష్టమైన నిబంధనలు లేనప్పటికీ కొన్ని సూత్రాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. జనరల్ ఎస్సే ప్రధాన లక్ష్యం వివిధ సబ్జెక్టులపై ఉన్న విషయపరిజ్ఞానాన్ని, అవగాహనను, ఒక అంశాన్ని వ్యాసరూపంలో రాయడంలో వారి సామర్థ్యాన్ని పరిశీలించడం.
# ఎంచుకున్న ప్రశ్నపై సమగ్ర అవగాహన, సమాధానాన్ని సమర్థవంతంగా పొందుపరుస్తూ క్రమపద్ధతిలో వివరించే సామర్థ్యాన్ని జనరల్ ఎస్సేలో ప్రధానంగా గమనించడంతో పాటు ఆలోచనలు, వ్యక్తీకరణలో సహజత్వం, వ్యాసం రాసే విధానానికి సంబంధించిన నియమాలను పాటించడాన్ని పరిగణనలోకి తీసుకొని మార్కులు వేస్తారు.
# జనరల్ ఎస్సే రాయడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఎంచుకున్న అంశానికి సంబంధించి కచ్చితమైన, నిర్దిష్టమైన భావ ప్రకటనకు ప్రోత్సాహం ఉంటుంది.
లక్షణాలు : అర్థవంతమైన సందేశాత్మక ఉపోద్ఘాతం (ఇంట్రడక్షన్)
# పరిచయం సంక్షిప్తంగా, క్లుప్తంగా, ప్రశ్న సారాంశాన్ని ఉద్దేశాన్ని తెలిపేదిగా ఉండాలి. సంబంధిత అంశానికి ఉన్న ప్రాముఖ్యతను, ప్రభావాన్ని, పర్యవసానాన్ని చిన్న చిన్న సామెతల రూపంలో లేదా వర్తమాన సంఘటనలతో పరిచయాన్ని ప్రారంభించాలి. ముఖ్యంగా తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం వచ్చే విధంగా సమాచారాన్ని క్రమపద్ధతిలో రాయాలి.
మధ్యభాగం
# జనరల్ ఎస్సే పూర్తి స్వరూపం మధ్యభాగంలోనే కనిపిస్తుంది. దీనిలో సంబంధిత టాపిక్ పట్ల అభ్యర్థికి ఉన్న అవగాహన, విషయ స్పష్టత, ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఆశావాద దృక్పథం, విశ్లేషణాత్మక శక్తి, నిర్ణయాత్మక శక్తి, నిర్ణయాత్మక శక్తి, స్థిత ప్రజ్ఞత, సమగ్ర దృక్పథం, వర్తమాన సమాచారం.
# సంబంధిత అంశానికి సంబంధించి ప్రభుత్వ దృక్పథంపై వివరించిన తీరును ప్రధానంగా గమనిస్తారు.
ముగింపు
#ముగింపు సమర్థవంతంగా, ప్రభావంతంగా ఉండాలి. ముగింపు భవిష్యత్ దర్పణం కలిగి, సలహాలు, సూచనల రూపంలో పరిష్కార మార్గాలు ఉండాలి.
సమయ పాలన కీలకం
# జనరల్ ఎస్సే ప్రశ్నలు ప్రత్యేకమైన నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. అభ్యర్థి ప్రశ్నను పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని సమగ్ర దృక్పథంలో సమాధానాన్ని రాయాలి. ఎస్సే సమాచారం విస్తృతంగా ఉండటంవల్ల అభ్యర్థి సమయపాలన పాటించకపోతే తక్కువ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కో ప్రశ్నకు కేటాయించిన గంట సమయాన్ని కింది విధంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించాలి.
1) ప్రశ్న ఎంపిక- 5 నిమిషాలు
2) రఫ్ వర్క్- 5 నిమిషాలు
3) ఉపోద్ఘాతం- 5 నిమిషాలు
4) మధ్యభాగం- 35 నిమిషాలు
5) ముగింపు- 5 నిమిషాలు
# జనరల్ ఎస్సే రాసేటప్పుడు మరో కీలక అంశం మూడు భాగాల మధ్య సమతుల్య పాటించడం. అంటే మొత్తం సమాధానంలో ఉపోద్ఘాతానికి 5-10 శాతం, మధ్యభాగానికి 80-90 శాతం, ముగింపు 5-10 శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
# ప్రశ్న ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్నను ఒకసారి ఎంపిక చేసుకున్న తరువాత మళ్లీ మార్చడానికి ప్రయత్నించవద్దు. అదేవిధంగా సమాధానాన్ని రాస్తున్నప్పుడు ఏదైనా అంశానికి సంబంధించిన గణాంకాలను సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఆలోచనలను క్రమబద్ధంగా, తర్కబద్ధంగా క్లుప్తంగా, సమగ్రంగా వివరించే ప్రయత్నం చేయాలి.
#జనరల్ ఎస్సే పేపర్ ద్వారా అభ్యర్థి మనస్తత్వాన్ని అంచనావేసే అవకాశం ఉంది. రాబోయే నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ఇంటర్వ్యూలో పరీక్షించే, పరిశీలించే అంశాలను ఎస్సేలో గమనించే అవకాశం ఎక్కువగా ఉన్నందున జనరల్ ఎస్సేను ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ప్రిపేర్ కావాలి.
నూతనకంటి వెంకట్
పోటీపరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు