Author of the book ‘Tribal Hyderabad’ | ట్రైబల్ హైదరాబాద్ గ్రంథ రచయిత ?
గ్రూప్స్ ప్రత్యేకం – తెలంగాణ సమాజం, సంస్కృతి
గతవారం వివిధ నృత్య కళారూపాల గురించి తెలుసుకున్నాం. పేరిణి శివతాండవం, గుస్సాడి నృత్యం గురించి ముఖ్యమైన అంశాలను అందించాం. ఇప్పుడు తెలంగాణలో ప్రముఖ జాతరలు, వాటి ప్రాముఖ్యత ఇతర విషయాల గురించి అందిస్తున్నాం.
సమ్మక్క-సారలమ్మ జాతర
# చారిత్రక నేపథ్యం: కాకతీయుల కాలంలో పొలవాసను పాలించే మేడరాజు తన కుమార్తె అయిన సమ్మక్కను ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రాజ్యాన్ని పాలిస్తూ కాకతీయుల సామంతునిగా ఉన్న పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు.
# పగిడిద్ద రాజు పన్ను కట్టకపోవడంతో కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు తన సేనాని యుగంధరుని (గన్నమ నాయకుడు)తో కలిసి మేడారంపై దండెత్తుతాడు.
# ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు, సారక్క, నాగులమ్మ మరణిస్తారు. కాకతీయ సేనలకు ఎదురొడ్డి పోరాడిన జంపన్న ఓటమిని జీర్ణించుకోలేక సంపెంగ వాగులో దూకి మరణిస్తాడు. వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క తీవ్ర గాయాలపాలై చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమవుతుంది.
ప్రత్యేకతలు
#ఈ జాతర కోయతెగ గిరిజనులకు ప్రముఖమైంది. ఈ జాతరలో పూజారులుగా వడ్డెలు ఉంటారు.
# ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక్క జాతరకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది.
#ఈ జాతరను తెలంగాణ కుంభమేళా/దక్షిణ భారత కుంభమేళాగా పేర్కొంటారు. దీన్ని ఆదివాసి జాతర అని కూడా అంటారు.
#1996, ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
# ఈ జాతరలో సమర్పించే నైవేద్యం (బెల్లం) ను బంగారంగా పేర్కొంటారు.
# విగ్రహాలను కాకుండా కంకవనం (వెదురు చెట్లు) కొయ్య చెక్కలను గద్దెలపై ఉంచి అమ్మవార్లుగా పూజిస్తారు.
# సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో, పగిడిద్ద రాజును పడగ రూపంలో
తీసుకొస్తారు.
#సమ్మక్క వాహనం పెద్దపులి, సారక్క వాహనం జింక.
#సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు
జరుపుతారు.
# 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరిగింది. మళ్లీ 2024లో ఈ జాతర నిర్వహిస్తారు.
# 2022 జాతరలో సమ్మక్క రాక సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ (ఇది రెండోసారి).
# జంపన్న దూకి ఆత్మహత్య చేసుకున్న కారణంగా జంపన్న వాగుకు ఆ పేరు వచ్చింది. అంతకుముందు దీన్ని సంపెంగ వాగు, దయ్యాల మడుగు అని పిలిచేవారు.
సమ్మక్క-పగిడిద్ద రాజులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
# కుమార్తెలు: సారక్క/సారలమ్మ,
నాగులమ్మ
# కుమారుడు: జంపన్న
# సారలమ్మ భర్త: గోవింద రాజు
రెండేండ్లకోసారి
# ఈ జాతరను ప్రతి రెండేండ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు నిర్వహిస్తారు.
# ఈ జాతర 4 రోజులపాటు జరుగుతుంది.
విధానం
మొదటి రోజు: కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు.
రెండో రోజు: చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు.
మూడో రోజు: ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరుతారు.
నాలుగో రోజు: అమ్మవార్లకు ఆవాహనం పలికి వారిని యథాస్థానాలకు చేర్చుతారు.
గమనిక: పగిడిద్ద రాజును మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల నుంచి, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి, జంపన్నను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.
నాగోబా జాతర
#నాగోబా అంటే నాగదేవత. పామును దేవత రూపంలో పూజిస్తారు.
# ఈ జాతరను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గోండు తెగవారు జరుపుకొంటారు. ప్రతి ఏడాది పుష్య మాసంలో బళ అమావాస్య రోజున ఈ జాతర జరుగుతుంది.
# ఈ జాతరను ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నిర్వహిస్తారు.
# ఈ జాతరకు 15 రోజుల ముందు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు గ్రామం సమీపంలోని హస్తన మడుగు నుంచి గోదావరి జలాలను తీసుకొస్తారు. ఈ జలాలతో నాగోబా దేవతను అభిషేకిస్తారు.
# ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల వంశీయులు తయారుచేసిన కుండల్లోనే గంగా జలాన్ని తీసుకొస్తారు.
# ఈ జాతర సందర్భంగా నూతన వధువులను నాగోబా దేవత వద్దకు తీసుకొచ్చి పూజ నిర్వహించి, వధువును పరిచయం చేస్తారు. దీన్ని భేటింగ్ కార్యక్రమం లేదా పరిచయ వేదిక అంటారు.
# ఈ సందర్భంగా గోండులు నిర్వహించే నృత్యం- గుస్సాడి
# ఇది దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర. మొదటి అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారక్క.
# ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ జాతర సందర్భంగా గోండు దర్బార్ (పూజా దర్బార్) నిర్వహించి, దానికి జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించి, గిరిజనుల సమస్యలను విన్నవించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాడు.
#1942లో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది.
# కరోనా కారణంగా 2021లో ప్రభుత్వం తరఫు అధికారులు దర్బార్ నిర్వహించలేదు. దాంతో ఆలయ పీఠాధిపతి వెంకటరావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
#ఈ జాతరలో ఆ ఏడాది మరణించిన తమ పెద్దల పేరిట తూం పూజలు నిర్వహిస్తారు.
హైమన్ డార్ఫ్
# ఆస్ట్రియా దేశానికి చెందిన హైమన్ డార్ఫ్ నిజాం నవాబు కాలంలో నిజాం కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. గోండు ప్రజల జీవితాలను, వారి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి.. ఆ సమస్యలకు పరిష్కారాలు సూచించడానికి హైమన్ డార్ఫ్‌ను నిజాం నవాబు నియమించాడు. ఈయన పూర్తిపేరు క్రిస్టఫర్ వాన్ ప్యూరర్ హైమన్ డార్ఫ్. హైమన్ డార్ఫ్ పరిశోధన వివరాలు ఆయన రాసిన ‘ట్రైబల్ హైదరాబాద్’ అనే గ్రంథంలో ఉన్నాయి.
గొల్లగట్టు జాతర
# ఈ జాతరను పెద్దగట్టు జాతర, పాలశెర్లయ్య జాతర, దురాజ్‌పల్లి జాతర అని కూడా పిలుస్తారు.
# రాష్ట్రంలో జరిగే రెండో అతిపెద్ద జాతర.
#ఈ జాతరను ప్రతి రెండేండ్లకు ఒకసారి మాఘ మాసంలో నిర్వహిస్తారు.
#ఈ జాతర సాధారణంగా 4 రోజుల జాతర అయినప్పటికీ గత మూడేండ్లుగా 5 రోజులపాటు నిర్వహిస్తున్నారు.
# సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని పాలశెర్లయ్య గుట్ట మీద ఈ జాతర జరుగుతుంది.
#ఇక్కడ పూజించే దేవతలు లింగమంతుల స్వామి, డమ్మ తల్లి (యాదవుల ఆరాధ్య దైవం). జాతరకు ముందు సూర్యాపేట గొల్లబజారు నుంచి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు.
#ఈ జాతర సందర్భంగా ఖాసింపేట యాదవులు పసిడి కుండను ఆలయ గోపురంపై ఉంచుతారు.
# దిష్టి పోయడం, గండ దీపం వెలిగించడం వంటి ఆచారాలు ఈ జాతరలో నిర్వహిస్తారు.
# వరంగల్ జిల్లా చీకటాయపాలెంకు చెందిన దేవర వంశీయులు, నల్లగొండ జిల్లాకు చెందిన తండు, మట్ట వంశీయులు ఈ జాతరను నిర్వహిస్తారు.
# నెలవారం కార్యక్రమాన్ని మున్నీ, మెంతబోయిన వంశీయులు చేపడతారు.
# చంద్రపట్నం కార్యక్రమాన్ని బైకాన్లు (చీకటాయపాలెం) నిర్వహిస్తారు.
# లింగమంతుల స్వామి ఆలయాన్ని
చోళచాళుక్యులు నిర్మించారు.
# 1966 నుంచి దేవాదాయశాఖ అధికారికంగా జాతరను నిర్వహిస్తుంది.
# ఈ జాతరలో నైవేద్యాన్ని కుక్కల బండపై ఉంచి కుక్కలవలే నాలుకతో స్వీకరిస్తారు.
విధానం
మొదటి రోజు: 30 విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను కేసారం గ్రామం తీసుకెళ్లి, హక్కుదారులకు చూపించి, కంకణం కట్టి, ఊరేగింపుగా గుట్టమీదికి తీసుకెళ్తారు. ఇదేరోజు మందగంపల ప్రదర్శన ఉంటుంది.
రెండో రోజు: లింగమంతుల స్వామికి బోనాలు, డమ్మ తల్లికి మొక్కులు సమర్పిస్తారు.
మూడో రోజు: చంద్రపట్నం నిర్వహిస్తారు (లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల పెండ్లి కార్యక్రమం).
నాలుగో రోజు: నెలవారం నిర్వహిస్తారు (పెండ్లయిన 16 రోజులకు నిర్వహించే కార్యక్రమాన్ని పోలి ఉంటుంది).
ఐదో రోజు: మకర తోరణం తొలగింపు, పూజారులు కేసారం చేరడంతో జాతర ముగుస్తుంది.
నమూన ప్రశ్నలు
గతవారం తరువాయి..
11. చిందు భాగవతానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? (4)
ఎ. నిజామాబాద్ జిల్లా చిందు భాగవతానికి పుట్టినిల్లు
బి. మాదిగకులంపై ఆధారపడిన డక్కలివారు ఈ కళారూపాన్ని పుదర్శిస్తారు
సి. ఈ ప్రదర్శన ముందుగా ఎల్లమ్మ దర్శనంతో ప్రారంభమవుతుంది
డి. చిందు భాగవతంలో బుడ్రాఖాన్ పాత్ర కూడా కనిపిస్తుంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
12. కింది వాటిలో సరైన వాక్యం ఏది? (1)
ఎ. కోయ నృత్యాన్ని పెరమ్ కోకీ ఆటగా కూడా పేర్కొంటారు
బి. వీరనాట్యానికి మరో పేరు ఖడ్గ నృత్యం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
13. చుట్టకాముడి నృత్యానికి పేరుగాంచిన జిల్లా ఏది? (4)
1) పూర్వ ఆదిలాబాద్
2) పూర్వ వరంగల్ 3) పూర్వ ఖమ్మం
4) పూర్వ నల్లగొండ
14. మవ అనే పువ్వు పుష్పించే కాలంలో కొత్తబట్టలు ధరించి నృత్యం చేసేవారు? (2)
1) గోండులు 2) చెంచులు
3) కోయలు 4) ఎవరూకాదు
15. చిందు కళలో పేరుగాంచిన మహిళ చిందు ఎల్లమ్మ అసలు పేరు? (2)
1) లక్ష్మి 2) సరస్వతి
3) పార్వతి 4) గాయత్రి
16. మామిడి పంట చేతికి వచ్చే సమయంలో కింది ఏ గిరిజన తెగవారు నృత్యాన్ని ప్రదర్శిస్తారు? (4)
1) గోండు 2) కోయ
3) చెంచు 4) కొండరెడ్లు
17. కింది వాక్యాల్లో సరైనది ఏది? (3)
ఎ. పూర్వ వరంగల్ జిల్లా కోయ జాతి పురుషులు కురు నృత్యం చేస్తారు
బి. తప్పెటగూళ్లు అనే నృత్య రూపకాన్ని యాదవ కులానికి చెందిన పురుషులు ఎక్కువగా చేస్తుంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
18. కింది నృత్యాలను, వాటికి సంబంధించిన పదాలను జతపర్చండి? (4)
ఎ. కోయ నృత్యం 1. దొరల సట్టమ్
బి. మయూరి నృత్యం 2. ఖోండ్ తెగ
సి. గరగ నృత్యం 3. ఘటం
డి. గుస్సాడి నృత్యం 4. మాల్జిలన టోపీ
ఇ. చెంచు నాటకం
5. కథానాయకుడు, కథానాయిక
1) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
2) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
3) ఎ-3, బి-2, సి-3, డి-4, ఇ-5
4) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
19. జాలువారే సెలయేళ్లు, పచ్చని అడవుల్లో హృద్యంగా సాగే నృత్యం?(2)
1) రేల నృత్యం 2) మయూరి నృత్యం
3) కురు నృత్యం 4) కోయ నృత్యం
20. గర్ఘర, విషమ, వికట, భావాశ్రయ, కవివారక అనే ఐదు భాగాలు కలిగిన నృత్యం? (4)
1) గుస్సాడి 2) థింసా
3) ఉరుముల 4) పేరిణి
21. గుస్సాడి నృత్యానికి సంబంధించి పద్మశ్రీ పురస్కారం (2022లో) అందుకున్న కళాకారుడు? (2)
1) గుస్సాడి వీరరాజు
2) గుస్సాడి కనకరాజు
3) గుస్సాడి రామకృష్ణ
4) గుస్సాడి యాదగిరి
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?