UPSC EPFO | ఈపీఎఫ్ఓలో 577 ఈవో, ఏపీఎఫ్సీ పోస్టులు
UPSC EPFO Recruitment 2023 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO), అకౌంట్స్ ఆఫీసర్ (AO), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 25న విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది.
మొత్తం పోస్టులు: 577
ఇందులో ఈవో లేదా ఏవో పోస్టులు 418 (జనరల్ 204, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 78, ఈడబ్ల్యూఎస్ 51, పీడబ్ల్యూడీ 25), ఏపీఎఫ్సీ 159 (జనరల్ 68, ఎస్సీ 25, ఎస్టీ 12, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 16, పీడబ్ల్యూడీ 28) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు ఏవో పోస్టులకు 30 ఏండ్లు, ఏపీఎఫ్సీ 35 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
- రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోతవిధిస్తారు. పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, వొకాబ్యులరీ, జనరల్ సైన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 25
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 17
వెబ్సైట్: upsconline.nic.in లేదా upsc.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?