డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు
1. సెమీకండక్టర్ల రంగానికి సంబంధించి కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ. గుజరాత్లో రెండు, అసోంలో సెమికండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు
బి. రెండు ప్లాంట్లను టాటా ఎలక్ట్రానిక్స్, ఒక ప్లాంట్‌ను సీజీ పవర్ ఏర్పాటు చేస్తుంది
సి. 2029 నాటికి ప్రపంచంలోని చిప్ వ్యవస్థల్లో భారత్ ఐదోస్థానంలో ఉంటుందని అంచనా
డి. ఈ ప్లాంట్లకు 2024 మార్చి 13న ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు
1) ఎ, బి, సి, 2) బి, సి, 3) సి, డి 4) పైవన్నీ
జవాబు: 4
2. ఎలక్ట్రికల్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం (ఈఎంపీఎస్)- 2024కు సంబంధించి సరైనవి ఏవి?
ఎ. ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి
బి. ఈ స్కీం కోసం 500 కోట్లు నిధులను ఏర్పాటు
సి. ద్వి, త్రిచక్ర వాహనాల కోసం మాత్రమే
డి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినది
ఈ. రాయతీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి
1) ఎ, బి 2) ఎ,బి,సి 3) ఎ,డి, ఈ 4) పైవన్నీ
జవాబు: 2
3. జమిలీ ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీకి సంబంధించి సరైన అంశాలు ఏవి?
ఎ. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో
బి. మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించారు
సి. జమిలీ ఎన్నికలను నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఐదు ఆర్టికల్స్‌ను సవరణ చేయాల్సి ఉంటుంది
డి. దీనిపై లా కమిషన్ కూడా నివేదికను సిద్ధం చేసింది ఈ. పైవన్నీ
1) ఎ, బి 2) ఎ,బి,సి 3) ఎ,డి,ఈ 4) పైవన్నీ
జవాబు: 4
4. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి సంబంధించి సరైన అంశాలు ఏవి?
ఎ. ప్రభుత్వ పాఠశాల వివిధ నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది
బి. ఇవి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో పనిచేస్తాయి
సి. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, తాగునీరు, మర్మమత్తు పనులు, టాయిలెట్ల నిర్మాణం, విద్యుదీకరణ, పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ తదితరాల కోసం
డి. డీఈవో, ఎంఈవో, హెచ్ఎంలు దీనిలో సభ్యులు
1) ఎ, బి, సి, 2) ఎ, డి, 3) ఎ, సి, డి 4) పైవన్నీ
జవాబు: 1
5. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ డెవిన్‌కు సంబంధించి సరైనవి?
ఎ. యూఎస్‌కు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ రూపొందించింది
బి. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సి. దీన్ని రక్షణ రంగంలో ఉపయోగించడం కోసం తయారుచేశారు
డి. ఇది ఒక ప్రాంప్ట్ ఇస్తే కోడింగ్, వెబ్‌సైట్స్ క్రియేటింగ్, సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి 3) ఎ,బి, డి 4) ఎ, బి, డి
జవాబు: 4
6. యూసీసీ బిల్లుకు సంబంధించి సరైన అంశాలు?
ఎ. స్వాతంత్య్రానంతరం దీన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్
బి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరి 7న యూసీసీని అమోదించింది
సి. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 11న ఆమోదం తెలిపింది
డి. ఈ బిల్లును అమలు చేస్తున్న రెండో రాష్ట్రం ఉత్తరాఖండ్
1) ఎ, బి, సి 2) ఎ,సి, డి 3) ఎ, బి,సి,డి 4) ఎ, బి, డి
జవాబు: 1
7. మొబైల్ ఫోన్ల తయారికి సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏవి?
ఎ. మొబైళ్ల ఉత్పత్తిలో భారత్ రెండోస్థానం
బి. 2014- 22 మధ్య మొబైల్ తయారీ ఏటా 23 శాతం పెరిగింది
సి. ప్రపంచంలో మొబైళ్ల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, వియత్నాం మూడోస్థానంలో ఉంది
డి. మొబైళ్ల ఎగుమతిలో భారత్ మూడోస్థానంలో ఉంది
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి 3) ఎ, సి, డి 4) ఎ, బి,సి, డి
జవాబు: 4
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






