కాంగో హరివాణంలోని వర్షపాతం ఏ రకానికి చెందినది?
1. గ్రానైట్ ఒక …. శిల?
1) పాతాళ 2) ఉప పాతాళ
3) అగ్నిపర్వత 4) రూపాంతర ప్రాప్త
2. కింది వాటిలో ఉద్గమ శిల ఏది?
1) గ్రానైట్ 2) గాబ్రో
3) బసాల్ట్ 4) డోలమైట్
3. కింది వాటిలో శకలమయం కాని అవక్షేప శిల ఏది?
1) ఇసుకరాయి 2) సున్నపురాయి
3) బురదరాయి 4) కంగ్లామరేట్
4. ఫలకరాయి దేని నుంచి రూపాంతర ప్రాప్తం చెందినది?
1) సున్నపురాయి 2) ఇసుకరాయి
3) షేల్ 4) గ్రానైట్
5. భారత ద్వీపకల్పం ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడింది?
1) అవక్షేప
2) అవక్షేప, రూపాంతర ప్రాప్త
3) అగ్ని, అవక్షేప
4) అగ్ని, రూపాంతర ప్రాప్త
6. కింది మైదానాల్లో ఏది ఉప ధ్రువ మండలంలో ఉంది?
1) మిసిసిపీ 2) నైలు
3) సైబీరియన్ 4) ముర్రే-డార్లింగ్
7. టిబెట్ పీఠభూమి ఒక?
1) పర్వతాంతర పీఠభూమి
2) ఖండ పర్వత ప్రదేశం
3) అగ్ని పర్వత పీఠభూమి
4) కవచ ప్రదేశం
8. పశ్చిమ కనుమలు?
1) ముడత పర్వతాలు
2) పరిశిష్ట పర్వతాలు
3) అగ్ని పర్వతాలు
4) ఖండ పర్వతాలు
9. నదీ వికోశీకరణం వల్ల ఏర్పడిన ఆఖరి రూపాన్ని ఏమంటారు?
1) వరద మైదానం
2) పీడ్మౌంట్ మైదానం
3) పెనిప్లేన్ మైదానం
4) పెడిప్లేన్ మైదానం
10. భూకంపం మూల స్థానాన్ని ఏమంటారు?
1) భూకంప నాభి 2) అధికేంద్రం
3) తరంగ బిందువు
4) విరూపాకారక కేంద్రం
11. కింది భూ స్వరూపాల్లో ఏది ఉద్గమ అగ్ని పర్వత కారకరూపం?
1) అగ్నిపర్వత గ్రీవం 2) లాకోలిత్
3) బాతోలిత్
4) అగ్నిపర్వత పీఠభూమి
12. కింది పీఠభూముల్లో ఏది అగ్నిపర్వత చర్య వల్ల ఏర్పడింది?
1) టిబెట్ పీఠభూమి
2) అపలేషియన్ పీఠభూమి
3) కొలరాడో పీఠభూమి
4) దక్కన్ నాపల
13. కింది భూకంప తరంగాల్లో దేనికి పార్శాలను కదిలించగల సామర్థ్యం ఉంది?
1) ప్రాథమిక తరంగాలు
2) ద్వితీయ తరంగాలు
3) దీర్ఘ తరంగాలు 4) తృతీయ తరంగాలు
14. భూపటలం ద్వారా మాత్రమే పయనించే సామర్థ్యం కలిగిన భూకంప తరంగాలు?
1) P- తరంగాలు 2) S- తరంగాలు
3) L- తరంగాలు
4) వక్రీభవన తరంగాలు
15. శిలాజాలు ఉండే శిలలు?
1) పాతాళ శిలలు 2) అగ్ని శిలలు
3) అవక్షేప శిలలు
4) రూపాంతర ప్రాప్త శిలలు
16. ‘వెసూవియస్’ అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది?
1) ఇండోనేషియా 2) ఇటలీ
3) అమెరికా 4) జపాన్
17. నదీలోయ దిగువకు పోయినప్పుడు సరైన వరుస క్రమంలో వచ్చే భూ స్వరూపాలు ఏవి?
1) భాండరంధ్రం, వరద మైదానం, ఒండలి వీవన
2) భాండరంధ్రం, ఒండలి వీవన, వరద మైదానం
3) ఒండలి వీవన, వరద మైదానం, భాండరంధ్రం
4) వరద మైదానం, ఒండలి వీవన, భాండరంధ్రం
18. హిమగర్తలు వేటితో కలిసి ఉండవు?
1) లోయ హిమానీ నదాలు
2) ఖండాంతర్గత హిమానీ నదాలు
3) ఆల్ఫెన్ హిమానీ నదాలు
4) గిరిపద హిమానీ నదాలు
19. హిమానీ నద క్రమక్షయ కారకాలైన సరైన జంట పదాలను గుర్తించండి.
1) భక్షణ, ఘర్షణ
2) ఎగురవేత, రాపిడి
3) ఉప ఘర్షణ, ఉత్పతనం
4) జలోత్పీడన చర్య, భక్షణ
20. ‘బజాడా’ అనేది ఒక?
1) ఒండలి మైదానం 2) ఇసుక దిబ్బ
3) డైక్ 4) శిలా పీఠభూమి
21. ఎడారిలో గల సువిశాల సమతల శిలాతలాన్ని ఏమంటారు?
1) హమాడా 2) బజాడా
3) ఎర్గ్ 4) యార్డంగ్
22. భూమి లోపలి గుహల కప్పు నుంచి కిందికి వేలాడే సున్నపురాతి స్తంభాలను ఏమంటారు?
1) ఊడ శిల 2) పుట్ట శిల
3) సున్నపు రాతి స్తంభాలు
4) హమ్స్
23. కార్స్ట్ ప్రాంతంలో విశాలంగా, లోతుగా గరాటు రూపంలోని గుంటలను ఏమని పిలుస్తారు?
1) ఉపలాస్ 2) కందరాలు
3) సింక్‌హోల్స్ 4) డొలైన్స్
24. ఎడారిలో గల పల్లపు ప్రాంత అంతఃస్థలీయ సరస్సులను ఏమంటారు?
1) జూగెన్స్ 2) ప్లయాలు
3) పియెడ్మౌంట్స్ 4) ఎర్గ్స్
25. అత్యధిక ఓజోన్ సాంద్రీకరణం ఏ ఆవరణంలో ఉంది?
1) ట్రోపో ఆవరణ 2) స్ట్రాటో ఆవరణ
3) అయనో ఆవరణ 4) ఎక్సో ఆవరణ
26. నైరుతి దిశ వైపు వీచే వ్యాపార పవనాలను ఏమంటారు?
1) నైరుతి పవనాలు
2) ఈశాన్య పవనాలు
3) దక్షిణ పవనాలు
4) పశ్చిమ పవనాలు
27. భూమికి ప్రసరితమైన సౌరశక్తిని ఏమని పిలుస్తారు?
1) ఇన్సులేషన్ 2) సౌరపుటం
3) వికిరణ శక్తి 4) సౌర పవనం
28. సాధారణ క్షీణతా క్రమంలోగల ఉష్ణోగ్రత విభిన్నతి విలువ?
1) ప్రతి 165 అడుగుల ఎత్తుకు 10F తరుగుదల
2) ప్రతి 165 అడుగుల ఎత్తుకు 10F పెరుగుదల
3) ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 10C తరుగుదల
4) ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 10C పెరుగుదల
29. కింది వాటిలో ఉష్ణోగ్రత విలోమానికి ఏవి అనుకూల పరిస్థితులు?
1) శీతాకాలపు అతి చల్లటి రాత్రులు, నిర్మలాకాశం, పొడిగాలి, పవనాలు లేకుండటం
2) శీతాకాలపు అతి చల్లటి రాత్రులు, మేఘావృత ఆకాశం, పవనంతో కూడిన తేమ గాలి
3) చల్లటి వేసవి రాత్రులు, నిర్మలాకాశం, పవనంతో కూడిన తేమ గాలి
4) పవనంతో కూడిన చల్లని వేసవి రాత్రులు, మేఘావృత ఆకాశం, తేమ గాలి
30. కాంగో హరివాణంలోని వర్షపాతం ఏ రకానికి చెందినది?
1) పర్వతీయ 2) చక్రవాత
3) రుతుపవన 4) సంవహన
31. దక్షిణార్ధ గోళంలో కింది ఏ ప్రాంతం రుతుపవన వర్షపాతం పొందుతుంది?
1) ఆస్ట్రేలియా ఉత్తర భాగం
2) న్యూజిలాండ్ ఉత్తర ద్వీపం
3) న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం
4) టాస్మేనియా ఉత్తర ప్రాంతం
32. 600-650 అక్షాంశాల మధ్య వాతావరణ పీడనం?
1) అల్ప పీడనం 2) అధిక పీడనం
3) సాధారణ పీడనం
4) అత్యధిక పీడనం
33. కింది వాటిలో ఉష్ణమండల ఎడారి కానిది ఏది?
1) సహారా 2) అటకామా
3) కలహారి 4) గోబి
34. డోల్డ్రమ్ ఒక..?
1) తీవ్రతర పవనాలు గల ప్రాంతం
2) అధిక పీడనం గల ప్రాంతం
3) కిందికి దిగే గాలి గల ప్రాంతం
4) పైకి పోయే గాలి గల ప్రాంతం
35. మధ్యధరా శీతోష్ణస్థితి గల ప్రాంతాల్లో…. ప్రసిద్ధి?
1) అడవుల పెంపకం
2) ద్రాక్ష తోటల పెంపకం
3) తేనెటీగల పెంపకం
4) పట్టుపురుగుల పెంపకం
36. కింది ప్రాంతాల్లో మధ్యధరా శీతోష్ణస్థితి ప్రభావితం కానిది ఏది?
1) దక్షిణ ఫ్రాన్స్
2) మధ్య కాలిఫోర్నియా
3) దక్షిణ చిలీ
4) నైరుతి ఆస్ట్రేలియా
37. మధ్యధరా ప్రాంతాలు శీతాకాలంలో వర్షపాతం పొందటానికి గల కారణం?
1) పశ్చిమ పవనాలు ధ్రువాల వైపు జరుగుట
2) పశ్చిమ పవనాలు భూమధ్య రేఖ వైపు జరుగుట
3) వ్యాపార పవనాలు ధ్రువాల వైపు జరుగుట
4) వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వైపు జరుగుట
38. పెరూ ప్రవాహం శీతల ప్రవాహం,ఎందుకంటే?
1) అది దక్షిణ ధ్రువాన పుడుతుంది
2) అది ఉన్నత అక్షాంశాల నుంచి కింది అక్షాంశాల వైపు ప్రవహిస్తుంది
3) అది మార్గమధ్యన ఉష్ణాన్ని కోల్పోతుంది
4) అది శీతాకాలమందు మాత్రమే ప్రవహిస్తుంది
39.ఘనీభవించిన వర్షబిందువులతో కూడిన అవపాతాన్ని ఏమంటారు?
1) హిమం 2) వడగళ్లు
3) హిమ శిఖరం 4) గ్లేజ్
40. 300-400 అక్షాంశాల మధ్య తూర్పు ప్రాంతాల్లో వర్షపాతం ఏ కాలంలో సంభవిస్తుంది?
1) శీతా కాలంలో 2) వేసవి కాలంలో 3) వర్షా కాలంలో 4) సంవత్సరం పొడవునా
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






