Science & Technology | ‘పర్యావరణ వ్యవస్థ’ పదాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1. ఫెంగ్యూన్ అనే వాతావరణ సంబంధ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
1) జపాన్ 2) చైనా
3) దక్షిణ కొరియా 4) రష్యా
2. దేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది?
1) ఆదిత్య 2) పరమ్ యువ
3) పరమ్ 4) విక్రమ్-100
3. నాసా ప్రఖ్యాత అంతరిక్ష టెలిస్కోప్ పేరు?
1) బబుల్ 2) డబుల్
3) రబుల్ 4) హబుల్
4. అంతరిక్ష పరిశోధక నౌక PSLV-C 14 ఇటీవల ఓషియాశాట్-2తో పాటు ఎన్ని నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది?
1) 5 2) 6
3) 7 4) 9
5. ‘క్యోటో ప్రోటోకాల్’ దేనికి సంబంధించింది?
1) వాతావరణ మార్పు
2) జంతుబలి
3) మాదక ద్రవ్యాల దుర్వినియోగం
4) మనుషుల అక్రమ రవాణా
6. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన రసాయనం?
1) కార్బన్ మోనాక్సైడ్
2) మిథైల్ ఐసోసయనేట్
3) ఇథైల్ ఐసోసయనేట్
4) సయనో హైడ్రిన్
7. దేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం?
1) NRSC 2) ISRO
3) IIRS 4) SHAR
8. GSLV-D6లో ఉపయోగించే ఇంధనం పేరు?
1) పెట్రోల్, గ్యాస్
2) ఇథనాల్, డీజిల్
3) ద్రవ ఆక్సిజన్, పెట్రోల్
4) ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ప్రొపెల్లంట్లు
9. భారత మొదటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు?
1) శ్రీహరికోట 2) కేఫ్ కెన్నడి
3) బైకనూర్ 4) ఫ్రెంచ్‌గయానా
10. సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ప్రాధాన్యం ఏ సంస్థలో దొరికింది?
1) ఆహార, వ్యవసాయ సంస్థ
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ
3) ఐక్యరాజ్య సమితి
4) ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్
11. మైక్రోసాఫ్ట్ ఆఫీసులో భాగం కానిది?
1) ఎంఎస్ వర్డ్
2) ఎంఎస్ ఎక్సెల్
3) ఎంఎస్ పవర్ పాయింట్
4) ఎంఎస్ మీడియా ప్లేయర్
12. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ నడిపేది ఎవరు?
1) సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్
2) సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్
3) కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్
4) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్
13. నందాదేవి బయోస్పియర్ ఏ ప్రదేశంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరాంచల్
3) ఛత్తీస్‌గఢ్ 4) తెలంగాణ
14. మంగళ్యాన్ అనేది?
1) భారత చంద్రయానం
2) భారత అంగారకయానం
3) భారత ప్రతిపాదిత బృహస్పతియానం
4) ఇటీవల ప్రయోగించిన జీఎస్ఎల్వీ రాకెట్
15. డిజిటల్ సంకేతాలను ఎనలాగ్ సంకేతాలుగా మార్చే సాధనం?
1) ప్యాకెట్ 2) మోడెం
3) బ్లాక్ 4) చిప్
16. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం?
1) తుర్కపలి 2) తక్కుగూడ
3) ఆదిభట్ల 4) పోలేపల్లి
17. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం?
1) నరోరా 2) రావత్‌భటా
3) తారాపూర్ 4) కల్పక్కం
18. కింది వాటిలో ఏ దేశం భారతదేశంతో కలిసి బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించింది?
1) యునైటెడ్ కింగ్డమ్
2) ఇజ్రాయెల్ 3) అమెరికా
4) రష్యా
19. కింది వాటిలో జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణి ఏది?
1) అగ్ని-4 2) పృథ్వీ
3) కె-4 4) ఆకాశ్
20. దేశంలో ఉపగ్రహం డేటాను గ్రహించే భూతల కేంద్రం ఉన్న ప్రదేశం?
1) అహ్మదాబాద్ 2) షాద్‌నగర్
3) డెహ్రాడూన్ 4) శ్రీహరికోట
21. భూభాగంపై క్షిపణుల పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన పర్యావరణ ఉద్యమం?
1) బిష్ణోయ్ 2) సైలెంట్ వ్యాలీ
3) బాలియాపాల్ 4) పోస్కో
22. ఐటీఐఆర్ అంటే?
1) ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్
2) ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్
3) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఇండస్ట్రియల్ రీజియన్
4) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్
23. ‘పర్యావరణ వ్యవస్థ’ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) రీటర్ 2) ఓడం
3) ఎర్నెస్ట్ హ్యాకెల్ 4) టాన్స్లే
24. దేశంలో జీవవైవిధ్య చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 2003 అక్టోబర్ 1
2) 1999 మార్చి 1
3) 1980 నవంబర్ 3
4) 1972 ఏప్రిల్ 3
25. ఇస్రో ప్రయోగించిన మొదటి మల్టీ వేవ్‌లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ?
1) ఆస్ట్రోశాట్
2) స్పేస్శాట్
3) కాస్మోశాట్
4) కార్టోశాట్
26. కింది వాటిలో మహావైవిధ్య కేంద్రం?
1) థాయిలాండ్ 2) భారతదేశం
3) బంగ్లాదేశ్ 4) పాకిస్థాన్
27. కింది వాటిలో ఏది భారతీయ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్?
1) అగ్ని-2 2) బ్రహ్మోస్
3) నాగ్ 4) త్రిశూల్
28. డీఆర్డీఓకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) పుణె
3) డెహ్రాడూన్ 4) బాలాసోర్
29. దేశంలో మొదటి రక్షణ పారిశ్రామిక పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కేరళ 2) గోవా
3) మధ్యప్రదేశ్ 4) పశ్చిమబెంగాల్
30. తెలంగాణలో ప్రభుత్వ ప్రతిపాదిత ‘ఫార్మాసిటీ’ నెలకొల్పే ప్రాంతం?
1) జీడిమెట్ల 2) శంషాబాద్
3) ముచ్చర్ల 4) షామీర్పేట్
31. భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ వాహక నౌక?
1) PSLV 2) ASLV
3) GSLV 4) SLV-3
32. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన డా. ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డును మొదట అందుకున్న వారు?
1) ప్రొ. మస్తాన్ సిర్ బర్మా
2) ఎన్ వలర్మతి
3) జ్యోతిమణి గౌతమన్
4) టీ కే అనురాధ
33. ‘Think Different’ అనే స్టేట్మెంట్ కింది ఏ ఎలక్ట్రానిక్ కంపెనీ ట్యాగ్‌లైన్?
1) నోకియా 2) ఆపిల్
3) సామ్సంగ్ 4) ఎరిక్సన్
34. జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) చైర్మన్ ఎవరు?
1) జస్టిస్ శ్రీకృష్ణ
2) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
3) జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి
4) ఎన్ వీ రమణ
35. ఓజోన్ పొర మందాన్ని కింది ఏ కొలతలలో కొలుస్తారు?
1) సీజీపీయమ్
2) రేడియన్ యూనిట్లు
3) కూలూంబ్ యూనిట్లు
4) డాప్సన్ యూనిట్లు
36. ‘బుద్ధుడు నవ్వాడు’ అనే పేరుతో అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?
1) 1973 2) 1974
3) 1988 4) 1996
37. ‘భారత అణుశక్తి పిత’ అని కింది ఎవరిని అంటారు?
1) ఏపీజే అబ్దుల్ కలాం
2) హెచ్ జె భాభా
3) విక్రమ్ సారాభాయ్
4) మేఘనాథ్ సాహా
38. ‘INSPIRE’ కార్యక్రమంలో వేటిని చేర్చలేదు?
1) మౌలిక విజ్ఞాన శాస్ర్తాలు
2) ఇంజినీరింగ్ శాస్ర్తాలు
3) వైద్య శాస్ర్తాలు
4) సామాజిక శాస్ర్తాలు
39. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు?
1) 2010 2) 2011
3) 2012 4) 2005
40. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) జమ్ము కశ్మీర్
3) కేరళ 4) సిక్కిం
41. దేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఎక్కడ నుంచి ప్రయోగించారు?
1) సోవియట్ యూనియన్
2) యూఎస్ఏ 3) భారతదేశం
4) ఇజ్రాయెల్
42. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు?
1) సీవీ రామన్
2) విక్రమ్ సారాభాయ్
3) ఏపీజే అబ్దుల్ కలామ్
4) సతీశ్ ధావన్
43. దేశంలో మొదటి అణుశక్తి కేంద్రం ఏది?
1) తారాపూర్, మహారాష్ట్ర
2) రావత్‌భటా, రాజస్థాన్
3) నరోర, ఉత్తరప్రదేశ్
4) కాక్రపార్, గుజరాత్
44. ప్రపంచంలో మొదటిసారి పూర్తిగా సౌరశక్తితో నిర్వహిస్తున్న విమానాశ్రయం?
1) న్యూయార్క్ 2) టోక్యో
3) బీజింగ్ 4) కొచ్చిన్
45. దేశంలో స్థాపించిన మొదటి ఐఐటీ ?
1) ఐఐటీ, ఖరగ్‌పూర్
2) ఐఐటీ, ముంబై
3) ఐఐటీ, చెన్నై
4) ఐఐటీ, కాన్పూర్
46. దేశంలో కార్యాచరణలో ఉన్న మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం?
1) ఐఆర్ఎస్- 1ఎ
2) ఇన్శాట్- 1ఎ
3) జీశాట్- 1
4) పీఎస్ఎల్వీ -డి3
47. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రునిపైకి తీసుకెళ్లిన అంతరిక్ష వాహక నౌక పేరు?
1) అపోలో – 5
2) అపోలో – 11
3) అపోలో – 203
4) అపోలో – 10
48. చంద్రయాన్-1 అంతరిక్ష పరీక్షను ఇండియాలోని ఏ ప్రాంతం నుంచి ప్రయోగించారు?
1) వీలర్ ఐలాండ్
2) శ్రీహరికోట
3) బాలాసోర్
4) తిరువనంతపురం
49. దేశంలో చమురు నిల్వలు ఏ శిలల్లో ఎక్కువగా దొరుకుతాయి?
1) సెడిమెంటరీ శిలలు
2) మెటామర్షిక్ శిలలు
3) టెక్టోనిక్ శిలలు
4) వాల్కనిక్ శిలలు
50. కింది వాటిలో గ్రీన్హౌస్ వాయువు కానిది?
1) H2O 2) CO
3) SO2 4) CO2
జీవ ఇంధనాలు ( Bio Fuels )
ప్రత్యక్షంగా మొక్కలపై (లేదా) పరోక్షంగా వ్యవసాయ, వాణిజ్య, గృహ, పారిశ్రామిక వ్యర్థాలపైన వివిధ సూక్ష్మజీవుల జీవక్రియల ఫలితంగా రూపుదిద్దుకొనే ఇంధనాలను జీవ ఇంధనాలుగా పరిగణిస్తారు.
ఉదా. బయో ఇథనాల్.
మొక్కజొన్న, చెరకు వంటి, మొక్కల్లోని కార్బోహైడ్రేట్ల నుంచి వెలువడే చక్కెర లేదా స్టార్చ్‌ని కిణ్వ ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయో ఇథనాల్ అనే జీవ ఇంధనంగా పిలిచే ఆల్కహాల్‌ను తయారు చేస్తారు.
ఇథనాల్‌ను పరిశుద్ధ స్థితిలో వాహనాల్లో ఇంధనంగా వినియోగిస్తారు. అయితే దీన్ని ప్రస్తుతం గ్యాసోలిన్తో తగిన మోతాదుల్లో కలిపి గ్యాసోహాల్గా వాహనాల్లో వినియోగిస్తున్నారు. ఫలితంగా శిలాజ ఇంధనాలపై సహజసిద్ధంగా ఉండే డిమాండ్ కొంతమేరకు తగ్గించి, హరితగృహ వాయువుల ఉద్గారాన్ని కొంతమేరకు తగ్గించడానికి వీలు కల్పిస్తున్నారు.
వేలా తరంగ శక్తి
ఆటు పోట్ల సమయంలో సముద్రమట్టంలో వచ్చే హెచ్చుతగ్గుల ఆధారంగా నీటి యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే పరిజ్ఞానం అభివృద్ధిపరచబడింది. సముద్ర తీరప్రాంతాల్లో అనుకూలంగా ఉన్న చోట టైడల్ రిజర్వాయర్లను నిర్మించి, టైడల్ జనరేటర్లను అమర్చి వాటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ పరిజ్ఞానానికి అవసరమైన, అనుకూలమైన ప్రదేశాలు తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో ఈ విధానంలో విద్యుదుత్పత్తికి సానుకూలతలను పరిశీలిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు