UPSC civils – 2023 దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ – 2023 ఈ నెల విడుదలైన సంగతి తెలిసిందే. (ఫిబ్రవరి) 1న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎవరైన ఉంటే upsc.gov.in లేదా upsconline.nic.in. వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు ప్రస్తుతం డీగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. నోటిఫికేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ లతోసహా వివిధ సివిల్ సర్వీసులకు సంబంధించి మొత్తం 1,105 ఖాళీలున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023
మొత్తం ఖాళీలు: 1,105
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 2023 ఆగస్టు 1, నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2, 1991 నుంచి ఆగస్టు 1, 2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అటెంప్టుల సంఖ్య: ఓబీసీ, ఇతర (GL/EWS) అభ్యర్ధులు 9 ప్రయత్నాలలో సర్వీస్ చేపట్టవచ్చు. SC/ST అభ్యర్ధులకు అపరిమితం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిలలో జరుగుతుంది.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 28, 2023
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు రుసుము: ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2023 (సాయంత్రం 6 గంటల వరకు).
వెబ్సైట్ : upsc.gov.in
upsconline.nic.in.
పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో చూడొచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?