TMC Recruitment | టాటా మెమోరియల్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
TATA Memorial Hospital Recruitment | ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ (Homi Bhabha Cancer Hospital), వారణాసిలోని మహామాన్య పండిట్ మదన్ మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్(MPMMCC)లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ ఫిజిషియన్ తదితర మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్(TMC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆనస్థేషియాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ ఫిజిషియన్
విభాగాలు: గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆనస్థేషియాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
వయస్సు : 40 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.67700- రూ.78800
ఎంపిక : రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 08
వెబ్సైట్ : https://tmc.gov.in/m_events/Events/JobVacancies
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?