AIC Recruitment | న్యూఢిల్లీ ఏఐసీలో 40 మేనేజ్మెంట్ ట్రెయినీలు
AIC Recruitment 2023 | మేనేజ్మెంట్ ట్రెయినీ(Management Trainee) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్ మేనేజ్మెంట్, లా తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 40
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రెయినీలు
విభాగాలు: రూరల్ మేనేజ్మెంట్, లా
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ & కోఆపరేషన్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, లా) పీజీ ఎంబీఏ (రూరల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్) పీజీ డిప్లొమా (రూరల్ మేనేజ్మెంట్, అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్)లో ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.60000
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ టెస్ట్‌పై ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 06
ఆన్లైన్ పరీక్ష తేది: ఏప్రిల్/ మే 2023
వెబ్సైట్ : www.aicofindia.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?