టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్

# 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
# ఆగస్టు 14న రాతపరీక్ష
రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ) లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్టికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్టికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్టికల్ అండ్ ఎలక్టానిక్స్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో ఐదేండ్లు, దివ్యాంగులకు మరో 10 ఏండ్లు గరిష్ఠ వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు.
వివరాలకు http://tsnpdcl.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. తాజా నోటిఫికేషన్తో కలుపుకొని ఇప్పటివరకు 20,473 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
- Tags
- jobs
- jobs notification
- TSNPDCL
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
హిమాలయా నదీ వ్యవస్థ