సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ట్యాలీ, ఈఆర్పీ 9, సీ లాంగ్వేజ్, ట్యాక్సేషన్, డెస్క్ టాప్ పబ్లిషింగ్, బ్యూటీషియన్, అడ్వాన్స్డ్ బ్యూటీషియన్, యోగా, టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ మేకింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెహందీ డిజైనింగ్, హెయిర్ స్టెలిస్ట్, సాఫ్ట్ టాయ్ మేకింగ్ తదితర కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులు, నిరుద్యోగ యువత, గృహిణిలకు ఉపయుక్తంగా ఉండే ఈ కోర్సుల్లో చేరేందుకు కనీసం పదో తరగతి పాసైనవారు అర్హులని, ఎటువంటి వయోపరిమితి లేదని వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, సీట్లు పరిమితంగా ఉన్నందున ‘ముందు వచ్చినవారికి ముందు’ ప్రాతిపదికన కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 7013457432, 8498080599, 9397824542 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ పోస్టులు
ఎన్టీపీసీ లో 12 పోస్టుల భర్తీ
ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
Gain a grasp over geography
Dalit movement: Role of triumvirate
సూర్యుడిని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?