Government Jobs 2023 | 745 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
1. UPSC EPFO | ఈపీఎఫ్ఓలో 577 ఈవో, ఏపీఎఫ్సీ పోస్టులు
UPSC EPFO Recruitment 2023 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO), అకౌంట్స్ ఆఫీసర్ (AO), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 25న విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది.
మొత్తం పోస్టులు: 577
ఇందులో ఈవో లేదా ఏవో పోస్టులు 418 (జనరల్ 204, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 78, ఈడబ్ల్యూఎస్ 51, పీడబ్ల్యూడీ 25), ఏపీఎఫ్సీ 159 (జనరల్ 68, ఎస్సీ 25, ఎస్టీ 12, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 16, పీడబ్ల్యూడీ 28) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు ఏవో పోస్టులకు 30 ఏండ్లు, ఏపీఎఫ్సీ 35 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోతవిధిస్తారు. పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, వొకాబ్యులరీ, జనరల్ సైన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 25
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 17
వెబ్సైట్: upsconline.nic.in లేదా upsc.gov.in
2.NIE: ఎన్ఐఈ-చెన్నైలో 23 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సెమీ స్కిల్డ్ వర్కర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి
చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ(ఎన్ఐఈ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 23
పోస్టులు: ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సెమీ స్కిల్డ్ వర్కర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి హైస్కూల్, ఐటీఐ, ఇంటర్, డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, డీఎన్బీ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు: 28-70 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.15800 నుంచి రూ.1.5లక్షలు
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: మార్చి 17
3.BEL Recruitment 2023 | ఇంజనీరింగ్ అర్హతతో బెల్లో ఉద్యోగాలు
Bharat Electronics Limited Recruitment | బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ప్రారంభం కాగా.. మార్చి 17వ తేదీతో ముగియనుంది. మొత్తం 110 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీని ద్వారా ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు బెల్ తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ టెలీ కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 110
పోస్టు: ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు: ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు బీఈ, బీటెక్/ బీఎస్సీ (4 ఏండ్ల ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో (కింది లింక్ ద్వారా గూగుల్ ఫామ్‌లో పూర్తి చేయాలి)
చివరితేదీ: మార్చి 17
వెబ్సైట్: https://www.bel-india.in
4. RITES: రైట్స్-గురుగావ్‌లో 08 పోస్టులు
సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూస్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూస్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి బీటెక్/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 8 నుంచి 15 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 40-50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.60000 నుంచి రూ.2.4లక్షలు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.600.
చివరి తేది: మార్చి 17
వెబ్సైట్: https://www.rites.com/Career
5.AIIMS: ఎయిమ్స్ బిలాస్పూర్లో లైబ్రేరియన్ గ్రేడ్, టెక్నీషియన్ పోస్టులు
లైబ్రేరియన్ గ్రేడ్, టెక్నీషియన్(రేడియాలజీ), ల్యాబ్ టెక్నీషియన్ (జేఎంఎల్టీ), ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : లైబ్రేరియన్ గ్రేడ్, టెక్నీషియన్(రేడియాలజీ), ల్యాబ్ టెక్నీషియన్ (జేఎంఎల్టీ), ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 18-27 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ/ EWS అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మార్చి 17
వెబ్సైట్: https://www.aiimsbilaspur.edu.in/recruitment
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?