ఆర్మీ ర్యాలీ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ 3
అగ్నిపథ్ స్కీంలో భాగంగా నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 3న తుది గడువు అని ఆర్మీ ఉన్నతాధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఉంటుందని పేర్కొన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు వివరించారు. పదో తరగతి పాసైన వారు ఇందుకు అర్హులని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 23 ఏండ్లు నిండిన వారు www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Previous article
పాత కోటాలోనే పీజీ కౌన్సెలింగ్
Next article
ఓపెన్ స్కూళ్లలోనూ క్రెడిట్ ట్రాన్స్ఫర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?