ఓపెన్ స్కూళ్లలోనూ క్రెడిట్ ట్రాన్స్ఫర్
# రెగ్యులర్‌గా పాసైన రెండు సబ్జెక్టులు ఓపెన్‌కు
# ఎస్సెస్సీ, ఇంటర్లో తప్పిన విద్యార్థులకు మంచి అవకాశం
మీరు.. ఎస్సెస్సీలో లేదా ఇంటర్లో కొన్ని సబ్జెక్టులు తప్పారా.. ఇక నా వల్లకాదని వదిలేశారా.. అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో పది లేదా ఇంటర్లో చేరండి. గతంలో రెగ్యులర్‌గా పాసైన రెండు సబ్జెక్టుల క్రెడిట్స్‌ను ఓపెన్ స్కూల్‌కు బదలాయించుకోవచ్చు. ఓపెన్ స్కూళ్లలో చేరిన వారు ఏదైనా 5 సబ్జెక్టులు పాసైతే సరిపోతుంది. క్రెడిట్ ట్రాన్స్ఫర్తో రెండు సబ్జెక్టులు పాస్ అయినట్టే. అంటే మరో మూడు సబ్జెక్టులకు పరీక్షలు రాస్తే సరిపోతుంది. సంబంధిత విద్యార్థులు 2018 తర్వాత మార్చి, జూన్ తర్వాత ఆయా సబ్జెక్టులు పాసై ఉండాలి.
మ్యాథ్స్ లేకుండా..
సాధారణంగా పదో తరగతి అంటేనే తెలుగు/ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక,రసాయన, జీవశాస్త్రాలు, సాంఘికశాస్త్రం సబ్జెక్టులుగా ఉంటాయి. ఇంటర్‌లోనూ కోర్సుల తీరు నిర్దిష్టంగా ఉంటుంది. కానీ ఓపెన్ స్కూల్లో డిగ్రీ తరహాలో బకెట్ సిస్టంను అమలుచేస్తున్నారు. పది, ఇంటర్లో సబ్జెక్టులను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -ఏ, గ్రూప్ – బీ, గ్రూప్ -సీలో నచ్చిన సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. గ్రూప్ -బీలో గణితం కఠినంగా ఉంటుందనుకొనే వారు సులభంగా ఉండే హోమ్‌సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ సంస్కృతి, వారసత్వం, బిజినెస్ స్టడీస్‌లో ఏదో రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసే వారు వీటికి సంబంధించిన సబ్జెక్టులు తీసుకోవచ్చు.
కొనసాగుతున్న ప్రవేశాలు..
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే దరఖాస్తుకు గడువు ముగియగా, ఆలస్య రుసుంతో ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది. ఇప్పటివరకు పదో తరగతి, ఇంటర్ కలిపి 10వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టుగా అధికారులు వెల్లడించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు