April 05 Current Affairs | అంతర్జాతీయం
ఐఎన్ఎస్ సుమేధ
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ నౌక విదేశీ పర్యటన నిమిత్తం మార్చి 26న అల్జీరియాలోని పోర్ట్ అల్జీర్స్‌కు చేరుకుంది. అల్జీరియన్ నేవీ, అల్జీర్స్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, నౌకాదళాల మధ్య సముద్ర సహకారం, పరస్పర చర్యలను పెంపొందించడమే ఈ పర్యటన ఉద్దేశం.
దేశద్రోహ చట్టం రద్దు
పాకిస్థాన్‌లోని లాహోర్ హైకోర్టు వలస పాలకుల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని మార్చి 30న కొట్టివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ షాహిద్ కరీం దేశ ద్రోహానికి సంబంధించిన పాక్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఎ ను కొట్టేశారు. దేశ ద్రోహ చట్టం స్వతంత్ర పాకిస్థాన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ఆయుధంగా తయారైందని ఓ పౌరుడు పిటిషన్ వేయడంతో కోర్టు విచారణ జరిపి ఈ నిర్ణయం వెలువరించింది.
జీరో వేస్ట్స్ డే
ఏటా మార్చి 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్స్గా నిర్వహిస్తున్నారు. వ్యర్థాలను తగ్గించడం, స్థిరమైన వినియోగం, ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడానికి ఈ డేని జరుపుకొంటున్నారు. మార్చి 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్‌ను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2022, డిసెంబర్ 14న తీర్మానించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘అచీవింగ్ సస్టెయినబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మినిమైజింగ్ అండ్ మేనేజింగ్ వేస్ట్’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?