April 05 Sports Current Affairs | క్రీడలు
సాత్విక్-చిరాగ్
భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. మార్చి 26న స్విట్జర్లాండ్‌లోని బాసిల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ రెన్ జియాంగ్ యు-టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది.
ప్రపంచకప్ షూటింగ్
భోపాల్‌లో మార్చి 26న ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు సాధించింది. చైనా మొదటి స్థానంలో నిలిచింది. చైనా 8 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది.
అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. మార్చి 26న దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ 118 (46 బంతులు) పరుగులు చేశాడు. సౌతాఫ్రికా జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి గెలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డి కాక్ 100 (44 బంతులు) పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఛేదన రికార్డు 2018లో ఆస్ట్రేలియా (245/5) పేరిట ఉంది. అప్పుడు న్యూజిలాండ్ జట్టు 243/6 స్కోర్ చేసింది.
శ్రీజ
నేషనల్ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. మరో విభాగంలో కాంస్య పతకం లభించింది. మార్చి 27న ముగిసిన ఈ ఈవెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున ఆడిన శ్రీజ సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి స్వర్ణం సాధించింది.
- డబుల్స్‌లో శ్రీజ-దియా చిటాలె జోడీ స్వస్తిక ఘోష్-శృతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించి స్వర్ణం గెలుచుకుంది.
- టీమ్ ఈవెంట్లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన జట్టు తమిళనాడును ఓడించి స్వర్ణం సాధించింది.
- మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం దక్కింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?