Current Affairs April 05 | జాతీయం
36 శాటిలైట్లు
ఇస్రో 36 ఇంటర్నెట్ శాటిలైట్లను వన్‌వెబ్ ఇండియా-2 పేరుతో మార్చి 26న విజయవంతంగా ప్రయోగించింది. బ్రిటన్‌కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోల బరువున్న ఈ శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వన్‌వెబ్ ఇండియా-1 పేరుతో 2022, అక్టోబర్ 23న మొదటి విడతగా 36 శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది.
గంగా
దేశంలో మొదటిసారి దేశీ గిర్ జాతికి చెందిన క్లోనింగ్ ఆవు దూడను పుట్టించినట్లు కర్నాల్ (హర్యానా)లోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) మార్చి 28న వెల్లడించింది. 32 కిలోల బరువున్న ఈ ఆవు దూడకు గంగా అని పేరు పెట్టారు. గిర్, సాహివాల్, తార్పార్కర్, రెడ్ సింధీ ప్రముఖ దేశీ జాతి పశువులు. ఇవి పాల ఉత్పత్తిలో, భారత పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. క్లోనింగ్ ద్వారా పుట్టిన గంగా ద్వారా రోజుకు 15 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేయవచ్చని ఎన్డీఆర్ఐ వెల్లడించింది.
జీ-20
జీ-20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు విశాఖపట్నంలో మార్చి 28న ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు జీ-20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ థీమ్‌తో నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం చేయడంపై చర్చించారు. మొదటి ఐడబ్ల్యూజీ సమావేశం జనవరి 17న పుణెలో జరిగింది.
కాంపిటీషన్ బిల్లు
లోక్‌సభలో కాంపిటీషన్ (సవరణ) బిల్లు-2022 మార్చి 29న ఆమోదం పొందింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై ప్రస్తుతం అనుసరిస్తున్న మార్కెట్ టర్నోవర్ పద్ధతిలో కాకుండా అంతర్జాతీయ టర్నోవర్ ఆధారంగా జరిమానా విధించే అధికారం ఈ బిల్లు ద్వారా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు లభించనుంది.
ఓట్ ఫ్రమ్ హోం
దేశంలో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మార్చి 29న షెడ్యూల్ విడుదల చేశారు. ఆ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే (ఓట్ ఫ్రమ్ హోం) సదుపాయం ఎన్నికల సంఘం కల్పించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?