కొత్తగా మరో 1,663 కొలువులు

-1,522 ఇంజినీరింగ్ పోస్టులు
– ఆర్థికశాఖలో 53 ఉద్యోగాలు
– భూగర్భ జలశాఖలో మరో 88
-రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి
-త్వరలోనే నోటిఫికేషన్లు
– ఇప్పటివరకూ మొత్తం 46,988 పోస్టుల భర్తీకి ఓకే
యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 46,988 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్టయింది. గతంలో పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, విద్య, ఆరోగ్య శాఖల్లో 45,325 ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నీటిపారుదల, ఆర్అండ్బీ శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్ పోస్టులు సహా 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటిలో నీటిపారుదలశాఖలోని 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భూగర్భ జలశాఖలో 88 పోస్టులు, ఆర్అండ్బీ శాఖలోని 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆర్థిక శాఖలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
Chicken hearted fellow
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
20 లోపు గురుకులాల్లో చేరండి
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
Buzz in the tech sector