RIMC – TSPSC | ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలు
RIMC – Telangana State Public Service Commision | ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ్ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- వివరాలు: ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జనవరి-2024 టర్మ్
- అర్హులు: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు.
- వయస్సు: 2024, జనవరి 1 నాటికి పదకొండున్నర ఏండ్లకు తగ్గకుండా, పదమూడేండ్లకు మించకుండా ఉండాలి. 2011, జనవరి-2012, జూలై 1 నాటికి మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా.
- పరీక్ష విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమెటిక్స్ (200 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (75 మార్కులు), ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- రాత పరీక్షలో అర్హత సాధించినవారికి 50 మార్కులకు వైవా వోస్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులు.
- దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50 శాతం ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించివారికి చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
- దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీవారికి రూ.555.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తును నింపి అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్రస్‌కు పంపాలి.
- పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే ఉంటుంది.
- ఫీజు: ఏడాదికి జనరల్ విద్యార్థులకు రూ.77,500, ఎస్సీ, ఎస్టీలకు రూ.63,900.
ముఖ్యమైన తేదీలు - దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 15
- పరీక్ష తేదీ: జూన్ 3
- వెబ్సైట్: www.rimc.gov.in
Previous article
NITW Recruitment | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






