TS EAMCET | ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ సులభతరం
- ఇంటర్ సెకండియర్ హాల్‌టికెట్ నంబర్ అనుసంధానం
- ఒకే క్లిక్‌తో ఆటోమెటిక్ ఫిల్లింగ్
- ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
- 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈ ఏడాది ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ సులభతరం కానున్నది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ సెకండియర్ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే దరఖాస్తులో మీ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. తర్వాత మరికొన్ని వివరాలు, ఫీజు చెల్లిస్తే దరఖాస్తు చేయడం పూర్తయినట్టే. 2010 నుంచి ఇప్పటివరకు ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి వివరాలను ఎంసెట్ వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే వివరాలన్నీ ఆటోమెటిక్‌గా పూరించబడతాయి. విద్యార్థి ఫొటో, సంతకం దరఖాస్తు ఫారంలోకి వచ్చేస్తుంది. కానీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు మాత్రం అన్ని వివరాలను అప్లోడ్ చేయాలి. టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ అధికారులు మంగళవారం విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 3 నుంచి ప్రారంభంకానున్నది. సందేహాలుంటే tseamce thelpdesk2023@jntuh.ac.in ఈ మెయిల్ లేదా 74169 23578,74169 08215 నంబర్లను సంప్రదించవచ్చు.
దరఖాస్తులో తప్పు జరిగింది ఎలా?
ఆన్లైన్లో దరఖాస్తు చేయడం అయిపోయాక.. మార్పులకు అస్సలు వీలుండదు. కావున విద్యార్థులు ముందుగానే తమ వివరాలను తప్పుల్లేకుండా సరిగ్గా నమోదు చేయాలి. కేవలం పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, టెస్ట్జోన్ వంటి వివరాలే ఏప్రిల్ 12 నుంచి 14 వరకు సవరణకు అవకాశం ఉన్నది.
ఏ మీడియంలో రాయొచ్చు?
మీడియం ఎంపికలో ఈ ఏడాది రెండు ఆప్షన్లు ఇస్తున్నారు. గతంలో ఓన్లీ ఇంగ్లిష్, తెలుగు/ఇంగ్లిష్, ఇంగ్లిష్/ఉర్దూ అనే మూడు ఆప్షన్లు ఉండగా, ఈ ఏడాది ఓన్లీ ఇంగ్లిష్ అన్న ఆప్షన్‌ను తొలగించారు. ఓన్లీ ఇంగ్లిష్ ఆప్షన్ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా పట్టణప్రాంతాల వారే ఈ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నారు.
తప్పుల్లేకుండా చూసుకోవాలి
ఎంసెట్ దరఖాస్తు విధానాన్ని సులభత రం చేస్తున్నాం. అదేవిధంగా, స్వల్ప మా ర్పులు చోటుచేసుకొంటున్నాయి. కొన్ని కొత్త ఫీచర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తు న్నాం. ఆయా మార్పులు మార్చి 3 వరకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు దరఖాస్తుల్లో సాధ్యమైనంత వరకు తప్పుల్లేకుండా చూసుకోవాలి. చివరి నిమిషంలో అనేక తప్పులు తలెత్తే అవకాశం ఉన్నది. ఆఖరి వరకు వేచిచూడకుండా ముందుగానే దరఖాస్తు చేయడం ఉత్తమం.
-ప్రొఫెసర్ డీన్‌కుమార్, ఎంసెట్ కన్వీనర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?