Telangana history | తెలంగాణ రచనలు.. తేనెలొలికే భావాలు
తెలంగాణ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం
మల్లికార్జున పండితుడు
- వీరశైవ మతాన్ని ప్రచారం చేసిన తొలి తెలంగాణ కవి. తెలుగులో శివతత్వ సారం, మల్లికార్జున శతకం వంటి రచనలు చేశాడు.
పాల్కురికి సోమనాథుడు
- ఇతడి స్వస్థలం పాలకుర్తి (జనగామ జిల్లా). దేశకవితా బ్రహ్మ అనే బిరుదు ఉంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం (తొలి తెలుగు శతకం) రచనలు చేశారు.
బమ్మెర పోతన
- ఇతడి స్వస్థలం బమ్మెర (ఓరుగల్లు). సహజకవి అనే బిరుదు కలవాడు. ఇతడి గురువు ఇవటూరి సోమశేఖరుడు. ఆంధ్ర మహాభాగవతం, నారాయణ శతకం, వీరభద్ర విజయం, భోగినీ దండకం వంటి రచనలు చేశారు.
కాళోజీ నారాయణరావు
- 1914 సెప్టెంబర్ 9న హనుమకొండ జిల్లాలోని మడికొండలో జన్మించారు. కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
- నా గొడవ, జీవన గీతం, అనకతలు, నా భారతదేశ యాత్ర, పార్థీవ న్యాయం, కాళోజీ కథలు వంటి రచనలు చేశారు. 1977 సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కాళోజీ పని చేశారు.
- నినాదాలు- ‘అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’, ‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటు సకలించు ఆంధ్రుడా చావవెందుకురా’
మారన
- 13వ శతాబ్దానికి చెందినవాడు. ప్రథమాంధ్ర మహాపురాణ కర్త అనే బిరుదు ఉంది. మార్కండేయ పురాణం రచించాడు. తెలుగులో మార్గపురాణ ప్రక్రియకు ఆద్యుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.
గౌరన
- సరస సాహిత్య చక్రవర్తి అనే బిరుదు ఉంది. హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరితం, లక్ష్మణ దీపిక వంటి రచనలు చేశారు.
బద్దెన
- 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడి శిష్యుడు తిక్కన. కమలాసన బిరుదు కలవాడు. సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి రచించాడు.
మల్లినాథుడు
- ఇతడి స్వస్థలం కొలి చెలమ (మెదక్). ఇతడి సమకాలికులు సింగ భూపాలుడు, మొదటి దేవరాయలు. రఘువంశంపై వ్యాఖ్యానం-సంజీవని, కిరాతార్జునీయంపై -ఘంటాపథం, శ్రీహర్షుని నైషధంపై వ్యాఖ్యానం- జివాతు.
మడికి సింగన
- సకలనీతి సమ్మతం (తొలి తెలుగు సంకలన గ్రంథం), భాగవత దశమస్కంధం, పద్మపురాణోత్తర ఖండం వంటి రచనలు చేశారు.
చరికొండ ధర్మన్న
- ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని చరికొండ ఇతడి స్వస్థలం. చిత్ర భారతం రచించాడు. ఈ చిత్ర భారతాన్ని పల్లె వెంకట సుబ్బారావు 1920లో వచనంగా మలిచాడు.
ఎలకూచి బాల సరస్వతి (15వ శతాబ్దం)
- ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని జటప్రోలు సంస్థానంలో జన్మించారు. రంగకౌముది, కార్తికేయాభ్యుదయం, చంద్రికా పరిణయం, వామన పురాణం వంటి రచనలు చేశారు. భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులో మల్లభూపాలియం పేరుతో అనువదించాడు.
పిల్లలమర్రి పినవీరభద్రుడు
- ఇతడి స్వస్థలం ఉమ్మడి నల్లగొండ. వాణి నా రాణి అని పేర్కొన్నాడు. శృంగార శాకుంతలం (సాళువ నరసింహరాయలకు అంకితం), జైమినీ భారతం రచనలు చేశారు.
కాకునూరు అప్పకవి
- 17వ శతాబ్దానికి చెందినవాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కాకునూరులో జన్మించారు. లాక్షణిక కవి అనే బిరుదు ఉంది. సాద్విజన ధర్మం, అనంత వ్రతకల్పం, అంబికావాదం, అప్ప కవీయం వంటి రచనలు చేశాడు.
మరిగంటి సింగనాచార్యులు
- శతఘంటావధాని, అష్టభాషా కవితా విశారదుడు బిరుదులు కలవాడు. రచనలు-దశరథ రాజనందన చరిత్ర, సీతా కల్యాణం (ఈ కావ్యాలు వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు), శ్రీరంగ శతకం, రామకృష్ణ విజయం.
అల్లం నారాయణ
- జగిత్యాలకు చెందినవారు. తెలంగాణ రాష్ర్టానికి మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు.
యాది మనాది- తెలంగాణ ఉద్యమ తీవ్రత ఆలోచనలకు పదును పెట్టే కవిత. - జగిత్యాల పల్లె-పోలీసులు, నక్సలైట్ల మధ్య జగిత్యాల ప్రాంత ప్రజలు ఎలా నలిగిపోయారో చూపించారు.
- ఈ కాలపు దుఃఖం-తెలంగాణ భాష విధ్వంసం చిత్రీకరించారు. ప్రాణహిత అనే వ్యాసం రాశారు.
చందాల కేశవదాసు
- 1876 జూన్ 20న ఉమ్మడి ఖమ్మంలోని జక్కేపల్లి గ్రామంలో జన్మించారు. తొలి తెలుగు సినీ గేయ రచయితగా గుర్తింపు పొందారు. తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్తప్రహ్లాద’కు పాటలు రాశారు.
- నాటకాల్లో పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. రచనలు- కేశవ శతకం, బలి బంధనం, సీతా కల్యాణం, రుక్మాంగద, మేలుకొలుపు, జోలపాటలు.
- చందాల కేశవదాసు ఆధ్వర్యంలో బాలభారత్ సమాజం వారు నాటకాలు ప్రదర్శించేవారు.
మగ్దుం మొయినొద్దిన్
- 1908 ఫిబ్రవరి 4న ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్‌లో జన్మించారు. బిసాద్-ఏ-రక్స్, సుర్క్-సవేరా, గుల్-ఏ-తార్, ఠాగూర్ వంటి రచనలు చేశారు. పీలా దుషాల (పసుపుపచ్చ ఉత్తరీయం) మొదటి రచన. షాయర్-ఎ-ఇంక్విలాబ్ అనే బిరుదు ఉంది. ఇతని కాలంలో భాగమతి కవిత ఎక్కువ ప్రచారం పొందినది.
వట్టికోట ఆళ్వారు స్వామి
- 1985 నవంబర్ 1న నకిరేకల్‌లో జన్మించారు. ఇతడి గురువు సీతారామారావు. జైలు లోపల(జైలు జీవిత కథల సంపుటి), ప్రజల మనిషి (నవల-తెలంగాణ ప్రజల జీవిత నేపథ్యం), గంగు, రామప్ప రభస
- తెలంగాణ చైతన్యం కోసం దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపించాడు. సికింద్రాబాద్‌లో దేశోద్ధారక సూచీ గ్రంథాలయం స్థాపించాడు.
గంగుల శాయిరెడ్డి
- ఉమ్మడి వరంగల్‌లోని రామచంద్ర గూడెంలో 1890లో జన్మించారు. ఒక చేత హలం, మరో చేత కలంతో వ్యవసాయ జీవిత కడగండ్లను చూపించాడు. కాపుబిడ్డ (1937) అనే కావ్యం రాశాడు. గ్రామీణులను రోగాల నుంచి కాపాడటానికి మూలికా వైద్యం చేసేవాడు.
సర్వదేవభట్ల నరసింహమూర్తి
- పిండిప్రోలు (ఉమ్మడి ఖమ్మం)లో 1926లో జన్మించారు. కోఠిలో ప్రజాసాహిత్య పరిషత్తు స్థాపించాడు. ప్రజాకవిరాజు అనే బిరుదు కలదు.
- 1946లో ఖమ్మం ఆంధ్రమహాసభ ప్రభావంతో నరసింహమూర్తి కమ్యూనిజ భావజాలం అలవరుచుకున్నాడు. మై గరీబ్ హూ (ఉర్దూ), లహుకీలర్ (రక్తరేఖలు), నాటిక- మార్పు, కవితా సంపుటి-అంగారే (నిప్పురవ్వలు) రచనలు చేశారు. తెలంగాణ (పక్షపత్రిక) పత్రిక నడిపాడు.
దేవులపల్లి రామానుజరావు
- వరంగల్‌లోని దేశాయిపేట ఇతడి స్వస్థలం. 1917 ఆగస్టు 25న జన్మించారు. రచనలు- కావ్యమాల, వేగు చుక్కలు, గౌతమ బుద్ధుడు, సారస్వత నవనీతం, పచ్చతోరణం, నా రేడియో ప్రసంగాలు, తెలంగాణలో జాతీయోద్యమాలు, యాభై సంవత్సరాల జ్ఞాపకాలు.
వెల్దుర్తి మాణిక్యరావు
- మెదక్ జిల్లా వెల్దుర్తిలో 1913లో జన్మించారు. రైతు పుస్తకం రచించాడు. (నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలు, రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ పుస్తకంలో పొందుపరిచాడు). ఇతని కవితల సంపుటి మాణిక్యవీణ.
- పుస్తకాలు- మాడపాటి వారి జీవితం, సర్దార్ జమలాపురం కేశవరావ్ జ్ఞాపకాలు, రాజ్యాంగ సంస్కరణలు, హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
- మాణిక్యరావు ‘అరుణ గ్రంథమాల’ అనే ప్రచురణ సంస్థకు సంపాదకుడిగా పని చేశాడు.
చుక్కా రామయ్య
- గూడూరు (ఉమ్మడి వరంగల్) ఇతడి స్వస్థలం. 1925 జనవరి 20న జన్మించారు. చిన్నపాఠం, దేశదేశాల్లో విద్య, బడిపంతుళ్లకు రాజకీయాలు, చదువుల తోవ, చదువులో సగం, చిట్టి చేతులు, జ్ఞాన లోగిళ్లు, ఇంటిభాష, లెక్కలతో నా ప్రయోగాలు, మన చదువులు, ప్రాథమికం, రామయ్య జ్ఞాపకాలు వంటి రచనలు చేశారు.
- హైదరాబాద్ రాష్ట్రంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నాడు.
- నల్లకుంట (హైదరాబాద్)లో ప్రైవేటుగా ఐఐటీ ఎంట్రెన్స్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందాడు. 2007లో ఎమ్మెల్సీగా గెలుపొందారు.
గడియారం రామకృష్ణ
- ఇతడి స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్. 1919 మార్చి 6న జన్మించాడు.
- శతపత్రము (ఆత్మకథ), మాధ విద్యారణ్య, పాంచజన్యం, దశరూపక సారం, కన్నడ సాహిత్య చరిత్ర, భారతదేశ చరిత్ర వంటి రచనలు చేశారు.
- 2007లో ఇతడి సాహిత్య సేవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
డా.సి. నారాయణ రెడ్డి (సి.నా.రె.)
- జగిత్యాలలోని హనుమాజిపేట సినారె స్వస్థలం. 1931 జూలై 29న జన్మించారు. ఇతడి పూర్తిపేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి.
- తెలుగు కవి, సాహితీవేత్త అయిన నారాయణరెడ్డి సినారెగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ‘ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు, ప్రయోగాలు’ అనే అంశంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టా పొందాడు.
- నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర (ఈ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు 1988లో లభించింది), మట్టి మనిషి ఆకాశం, కలం సాక్షిగా, భూగోళమంత మనిషి, మంటలు-మానవుడు (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు) వంటి రచనలు చేశారు.
నిర్వహించిన పదవులు - రాజ్యసభ సభ్యుడు (తెలుగు కవుల్లో రాజ్యసభ సభ్యత్వ గౌరవం పొందిన మొదటివాడు)
- అధికార భాషా సంఘం అధ్యక్షుడు
- ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు
- తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్
- ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుడిగా అనేక పదవులు నిర్వహించారు.
- 1992లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
యశోదారెడ్డి
- తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పని చేసింది. మా ఊరి ముచ్చట్లు, ధర్మశీల, ఎచ్చమ్మ కథలు, ఎదుర్కోలు రచనలు చేశారు. గ్రామీణ ఆడపడుచుల ముచ్చట్లు, బతుకమ్మ, పీర్లపండుగను జరుపుకునే సంప్రదాయాలు చిత్రీకరించారు.
తెన్నేటి సుధాదేవి
- ఉదయకాంత, లిటిల్ డిటెక్టివ్ రచనలు అందించారు. వికసించని వేదన, రవళి, అరవింద వంటి కథల సంపుటాలు అందించారు. సామెతలు ఆధారం చేసుకొని నాటికలు రాసిన మొదటి తెలుగు రచయిత్రిగా గుర్తింపు పొందింది.
నందిని సిధారెడ్డి
- సిధారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని కొండపాక. భూమి స్వప్నం, సంభాషణ వంటి రచనలు అందించారు.
సాహు, అల్లం రాజయ్య
- వీరిద్దరూ విప్లవ రచయితలు. సాహు పూర్తి పేరు శనిగరం వెంకటేశ్వర్లు. కుమ్రం భీం నవల అందించారు. దీన్ని విరసం (విప్లవ రచయితల సంఘం) ప్రచురించింది.
బన్న అయిలయ్య
- ఇతడు తెలంగాణ సాహిత్య సంస్థల పరిశోధకుడు. తెలంగాణ సాహిత్య సంస్థ గ్రంథం రాశాడు. గిరిజా మనోహర బాబుగారి షష్ఠిపూర్తి సంచికకు సంపాదకుడు.
- కాలువ మల్లయ్య కథలో తెలంగాణ జనజీవితం విశ్లేషించారు.
రాళ్లబండి కవితా ప్రసాద్
- ఇతడు సివిల్ సర్వెంట్, శతావధాని. అవధాన విద్య, ఆరంభ వికాసాలు (ఇది విశిష్ట సిద్ధాంత గ్రంథం), బంద్ వంటి రచనలు చేశారు.
జూలూరి గౌరీ శంకర్
- ఇతడి ఆధ్వర్యంలో వెలువడిన ఆధునిక కవుల సంచిక పొక్కిలి. పొక్కిలి అంటే బొడ్డు అని అర్థం. 129 మంది కవులతో కూడిన తెలంగాణ కవుల ప్రాంతీయ ఆత్మ. దీన్ని పగిలిన తెలంగాణ కవి కంఠంగా పేర్కొంటారు.
అలిశెట్టి ప్రభాకర్
- ఇతడి స్వస్థలం జగిత్యాల. 1951 జనవరి 12న జన్మించారు. శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు నుంచి స్ఫూర్తి పొందాడు.
- కవితా సంపుటాలు- ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ.
- కవితలు- అక్టోపస్ జీవితం.
జయధీర్/రేపల్లె తిరుమల రావు
- ఇతడు హనుమకొండలో 1950 జూన్ 20న జన్మించారు. అలనాటి సాహిత్య విమర్శ (అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక ఆధారంగా), గురజాడ డైరీలు, తెలుగు లిపి పరిణామం-అభివృద్ధి, సురవరం ప్రతాపరెడ్డి లేఖలు మొదలగు రచనలు అందించారు. ‘అరుణ నేత్రం’ ఇతడికి కవిగా గుర్తింపు తెచ్చింది. ‘తొవ్వముచ్చట్లు’ పుస్తకం రాశాడు.
- తెలంగాణ రైతాంగ పోరాటం-ప్రజా సాహిత్యంపై, గోండు, కోయ భాషలపై పరిశోధనలు చేశాడు.
Previous article
Polity | భారతదేశంలో పంచాయతీరాజ్‌తో సంబంధం ఉన్న కమిటీలు?
Next article
TS EAMCET | ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ సులభతరం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు