TSRJC CET 2023 | గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
గురుకులాలు భవిష్యత్‌కు బాటలు వేసే విద్యాలయాలు. ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను అందించడమే కాకుండా విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంట్కు కృషి చేస్తున్న సంస్థలు. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
బీసీ గురుకులాల్లో…
- మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్జేసీ/
ఆర్డీసీ సెట్-2023 ప్రకటన విడుదలైంది.
ఇంటర్ ప్రవేశాలు - ఇంగ్లిష్ మీడియం
- జూనియర్ కాలేజీలు-255. దీనిలో
బాలురు-130, బాలికలు-125 - గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీతోపాటు వృత్తి విద్యా కోర్సులు
డిగ్రీ ప్రవేశాలు
- రాష్ట్రంలో 14 డిగ్రీ కాలేజీలున్నాయి.
వీటిలో మహిళలు-6, పురుషులు-8 ఉన్నాయి. - కోర్సులు: బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ (ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీఎస్, ఎంఎస్డీఎస్, ఎంఎస్ఐఏ&ఎంపీజీ, ఎంఈఎస్, ఎంఈసీఎస్), బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీకాం, బీఏ, బీబీఏ, బీఎఫ్టీ
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 16
- ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 29
- వెబ్సైట్: https://mjpabcwreis.cgg.gov.in
టీఎస్ ఆర్జేసీ సెట్-2023
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 విడుదలైంది.
- గ్రూప్‌లు, సీట్ల సంఖ్య: ఎంపీసీ-1496, బైపీసీ-1440, ఎంఈసీ-60 సీట్లు ఉన్నాయి.
- ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
- ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు.
- పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
- ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్ మాద్యమంలో ఉంటుంది.
- ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీలో ప్రవేశానికి మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఇలా ఏ గ్రూప్‌లో ప్రవేశం కావాలో ఆ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 31
- ప్రవేశ పరీక్ష తేదీ: మే 6
- వెబ్సైట్: https://tsrjdc.cgg.gov.in
Previous article
Scholarship | Scholarships for Students 2023
Next article
CUET 2023 | Common University Entrance Test (UG)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?