పీజీ కోర్సులు @ సీయూ
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని ఉందా ? విభిన్నమైన కోర్సులు, విలక్షణమైన విద్యావిధానంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారా? ్యమానిటీస్, యోగా, నానోసైన్స్, స్పోర్ట్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్, జర్నలిజం, ఎంబీఏ, ఎంసీఏ వంటి విభిన్న కోర్సులు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు….
సెంట్రల్ యూనివర్సిటీలు
# దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్ 2009, పార్లమెంట్ యాక్ట్ కింద ఏర్పాటుచేశారు. ఇవి యూజీసీ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు. ఇవి కేంద్ర విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి.
పీజీ ప్రవేశాలు
# కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)- పీజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
కోర్సులు: ఎంఏ (లాంగ్వేజెస్, యోగా, యోగా సైన్స్, యోగా థెరపీ, నానో సైన్స్ తదితరాలు), ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంటెక్, ఎం.డిజైన్, ఎంఎఫ్ఏ, ఎంకాం, ఎంసీఏ, ఎంఏ ఆచార్య, ఎంఏ/ఎమ్మెస్సీ బీఈడీ, ఎంబీఏ, ఎంఫార్మా, ఎంఎస్‌డబ్ల్యూ తదితర కోర్సులు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 2022లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి లేదు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
– బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, బీహెచ్‌యూ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్ము, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్‌కంఠక్., ఐజీఎన్‌టీయూ రీజినల్ సెంటర్ మణిపూర్, డా.హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం, గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ, జేఎన్‌యూ, మణిపూర్ యూనివర్సిటీ, పుదుచ్చేరి యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, ఇఫ్లూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో సహా మొత్తం 42 యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తాయి.
పరీక్ష విధానం
# కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
#ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటాయి. సాహిత్య పేపర్లు మాత్రం ఆయా భాషల్లోనే ఉంటాయి.
# ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు
# దరఖాస్తు: ఆన్లైన్లో
#చివరితేదీ: జూన్ 18 (సాయంత్రం 5 వరకు)
# వెబ్సైట్: https://cuet.nta. nic.in
…కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?