జేఈఈ మెయిన్-2 వాయిదా
25 నుంచి రెండో సెషన్ పరీక్షలు.. నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులను మరోసారి టెన్షన్‌కు గురిచేసింది. గురువారం నుంచి ప్రారంభం కావా ల్సిన జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు కేవలం ఒక్క రోజు ముందే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ తొలుత ప్రకటించింది. తాజాగా పరీక్షలను 25 నుంచి నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పరీక్షలకు 6,29,779 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్-1 పరీక్షలకు పలు కేంద్రాల్లో సర్వర్‌డౌన్ సమస్యలు తలెత్తాయి. తాజాగా మెయిన్ -2 ఎగ్జామ్స్‌ను ఎలా నిర్వహిస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్‌కార్డులు గురు వారం నుంచి అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ వెల్లడించారు. విద్యార్థులు అడ్మిట్‌కార్డుతోపాటు అండర్టేకెన్ ఫాంను jeemain.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?