ఇంటర్‌తో ఐఐఎంలోకి !

మేనేజ్మెంట్ కోర్సులను అందించడంలో ప్రతిష్ఠాత్మక సంస్థలుగా ఐఐఎంలు పేరుగాంచినవి. ఐఐఎం బోధ్‌గయ, జమ్ములో ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడాలనుకొనే వారికి ఇదొక సువర్ణావకాశం. ప్రస్తుతం ఆ కోర్సు వివరాలు నిపుణ పాఠకులకు సంక్షిప్తంగా….
ఐపీఎం
# ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం). ఇది ఐదేండ్ల కోర్సు.
# ప్రస్తుత కాలానికి అవసరమైన సామాజిక స్పృహ కలిగిన మేనేజర్లను తయారుచేయడం దీని ప్రధాన ఉద్దేశం. సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్లో ప్రపంచస్థాయి పునాది కలిగిన విద్య ద్వారా మంచి మేనేజర్లు, నాయకులను తయారు చేయడం లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించారు.
# ఈ కోర్సులో లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్టడీస్‌కు సంబంధించిన సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారు.
# ఐఐఎం బోధ్‌గయ, జమ్ము ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఎవరు అర్హులు ?
# కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్లో ఆర్ట్/సైన్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ స్ట్రీమ్ గ్రూప్‌లో 2020, 2021లో ఉత్తీర్ణులైనవారు. 2022లో సెకండియర్ పరీక్షలు రాస్తున్న/రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్లో కనీసం 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం
# నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్)-2022 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
# కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా ఎంపిక చేస్తారు
# పరీక్షలో క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ 33 ప్రశ్నలు- 132 మార్కులు
# డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 33 ప్రశ్నలు- 132 మార్కులు ఇస్తారు.
# వెర్బల్ ఎబిలిటీ &రీడింగ్ కాంప్రహెన్షన్- 34 ప్రశ్నలు- 136 మార్కులు వస్తాయి.
# మొత్తం 100 ప్రశ్నలు. 400 మార్కులు
# పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు
ముఖ్యతేదీలు
#దరఖాస్తు: ఆన్లైన్లో
#చివరితేదీ: జూన్ 9
# పరీక్ష తేదీ: జూలై 3
# వెబ్సైట్: http://jipmat.nta. cbexams.com
…కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- entrance test
- IIM
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్‌టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers