26న ఎడ్సెట్
– హాజరుకానున్న 38 వేల మందికిపైగా విద్యార్థులు
– ఒకేరోజు 3 విడతల్లో పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో ఎడ్సెట్ ఈ నెల 26న నిర్వహించనున్నారు. తెలంగాణలో 39, ఏపీలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను ఒకేరోజు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోమని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను https:// edcet.tsche.ac. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.
సెషన్ల వారీగా హాజరయ్యే విద్యార్థులు
సెషన్ హాజరయ్యే విద్యార్థులు
మొదటి సెషన్ 12,634
రెండో సెషన్ 12,732
మూడో సెషన్ 12,725
మొత్తం 38,091
పరీక్ష సమయాలు
మొదటి సెషన్ -ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు
రెండో సెషన్ -మధ్యాహ్నం 12 : 30 గంటల నుంచి 2 : 30 గంటలు
మూడో సెషన్ – సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?