TS Govt Policies and Schemes | రాష్ట్రంలో మొదటి నగదు రహిత ఆధ్యాత్మిక పట్టణం?
తెలంగాణ ప్రభుత్వ విధానాలు – పథకాలు
1. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు?
1) 2022 మార్చి 1
2) 2022 మార్చి 2
3) 2022 మార్చి 8
4) 2022 మార్చి 5
2. తెలంగాణలో దళితులకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేసే దళితబంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2021 ఆగస్టు 4
2) 2021 ఆగస్టు 10
3) 2021 సెప్టెంబర్ 4
4) 2021 ఆగస్టు 15
3. తెలంగాణలో జాగీర్, ఇనాం భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఏ రోజున ఆర్డినెన్స్ జారీ చేశారు?
1) 2017 జనవరి 26
2) 2017 జూన్ 19
3) 2017 ఆగస్టు 15
4) 2017 సెప్టెంబర్ 25
4. కింది వాటిలో టీ-వాలెట్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.
1) 2017 జూన్ 1న హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రారంభించారు
2) ఫోన్ రీచార్జ్‌లు, బస్ టికెట్లు, ఉపకార వేతనాలు, పెన్షన్లను దీని ద్వారానే ప్రభుత్వం చెల్లిస్తుంది
3) ఈ-సేవ, మీ-సేవ ఆర్బీఐ అనుమతి గల ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ కలిసి దీన్ని ప్రారంభించాయి
4) పైవన్నీ
5. కింది వాటిలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రాథమిక విధి కానిది గుర్తించండి.
1) విద్యార్థుల్లో వ్యవస్థాపక స్వభావాన్ని పెంపొందించడం, వర్తమాన వ్యవస్థాపకులకు మార్గనిర్దేశం చేయడం
2) రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ప్రైవేటు రంగంలో గల ఉపాధి అవకాశాలను లెక్కించడం
3) రాష్ట్ర యువతకు వృత్తిపర, సంస్థాగత, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించడం
4) ప్రస్తుత పాఠ్యాంశాల్లో లేని తాజా సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం
6. ఆరో విడత హరితహారాన్ని 2020 జూన్‌లో ఎక్కడ ప్రారంభించారు?
1) నర్సాపూర్, మెదక్
2) కరీంనగర్
3) హైదరాబాద్
4) సూర్యాపేట
7. కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం ‘స్కోచ్’ అవార్డుకు ఎంపిక అయ్యింది?
1) రైతుబంధు 2) అమ్మఒడి
3) ఫాస్ట్ 4) లైఫ్ పథకం
8. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి 2023-24 బడ్జెట్లో ఎన్ని రూ. కోట్లను కేటాయించింది?
1) రూ. 250 కోట్లు
2) రూ. 200 కోట్లు
3) రూ. 350 కోట్లు
4) రూ. 300 కోట్లు
9. తెలంగాణలోని ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ‘మోడల్-ఈ-పంచాయతీ’గా ఎంపిక చేసింది?
1) ఖమ్మం 2) కరీంనగర్
3) నల్లగొండ 4) మహబూబ్‌నగర్
10. తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని ‘సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరం’గా ప్రకటించింది?
1) 2017 2) 2018
3) 2016 4) 2015
11. రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) మూడుచింతలపల్లి, మల్కాజిగిరి
2) వాసాలమర్రి, యాదాద్రి భువనగిరి
3) గట్టు, జోగులాంబ గద్వాల
4) గంగదేవిపల్లి, వరంగల్
12. దళితబంధు పథకంలో భాగంగా 2023-24 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రూ.కోట్లను కేటాయించింది?
1) రూ. 18,700 కోట్లు
2) రూ. 17,700 కోట్లు
3) రూ. 20,700 కోట్లు
4) రూ. 12,000 కోట్లు
13. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు యునెస్కో-2020 ప్రపంచ వారసత్వ సంపదగా కింది దేన్ని గుర్తించింది?
1) వేయి స్తంభాల గుడి
2) చార్మినార్
3) రామప్ప దేవాలయం
4) గోల్కొండ
14. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అడవుల్లో ఎన్ని పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు?
1) 50 2) 26
3) 36 4) 42
15. ‘జాగో-బదలో-బోలో’ నినాదం దేనికి సంబంధించినది?
1) లైంగిక వేధింపుల నుంచి బాలికలకు రక్షణ కల్పించడం
2) బాలలకు సురక్షిత ఆహారం, ఉచిత వసతి కల్పించడం
3) మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించడం
4) శిశు మరణాలను తగ్గించడం
16. తెలంగాణ రాష్ట్ర ఐటీ విధానం 2021-26లో ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయించుకుంది?
1) 20 లక్షలు 2) 10 లక్షలు
3) 15 లక్షలు 4) 5 లక్షలు
17. టీఎస్-బి-పాస్ ద్వారా కర్మాగారాల యూనిట్లను ఏర్పాటు చేసుకోవడంలో ఎక్కువ అనుమతులు పొందిన మొదటి 3 జిల్లాలు ఏవి?
1) రంగారెడ్డి, గద్వాల, నారాయణపేట
2) ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ
3) మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, కరీంనగర్
4) సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం
18. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు?
1) సుంకపాక దేవయ్య
2) ఎర్రోళ్ల శ్రీనివాస్
3) కుర్సం నీలాదేవి
4) ఎం రాంబాల్ నాయక్
19. ప్రపంచ తెలుగు మహాసభల లోగోలో కింద ఉన్నవి?
ఎ. కాకతీయుల విజయతోరణం
బి. పాలపిట్ట బొమ్మలు
సి. ప్రపంచ తెలుగు మహాసభలు-2017
డి. మన తెలంగాణ- తెలంగాణ మాగాణం
1) ఎ, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
20. తెలంగాణ ప్రభుత్వం రెండో ఐటీసీ పాలసీని ఏ సంవత్సరానికి తీసుకొచ్చింది?
1) 2022-2026
2) 2021-2036
3) 2020-2025
4) 2021-2026
21. తెలంగాణలో ఐటీ-సెజ్‌లలో భాగంగా ప్రభుత్వం ఎన్ని ఐటీ-స్పెషల్ ఎకనామిక్ జోన్లకు ప్రణాళికలు రచిస్తుంది?
1) 111 2) 52
3) 104 4) 62
22. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 2017 అక్టోబర్ 9
2) 2017 డిసెంబర్ 14
3) 2018 జూన్ 2
4) 2018 జనవరి 2
23. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు ఎన్ని డ్రైపోర్ట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1) 24 2) 22
3) 16 4) 30
24. దేశంలో తొలిసారి జీఎస్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) తమిళనాడు 4) తెలంగాణ
25. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల నమోదులో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 1 2) 2
3) 3 4) 4
26. 2023 జనవరి 27 నాటికి ధరణి పోర్టల్ ద్వారా ఎన్ని లావాదేవీలు పూర్తయ్యాయి?
1) 23,20,233 2) 13,20,233
3) 14,20,233 4) 15,20,233
27. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ కింద తెలంగాణలోని ఏ జిల్లాను ఎంపిక చేశారు?
1) యాదాద్రి భువనగిరి
2) మెదక్ 3) వరంగల్
4) ఆదిలాబాద్
28. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానలు 2022 నాటికి ఎన్ని వైద్య సేవలందిస్తున్నాయి?
1) 300 2) 356
3) 342 4) 330
29. నీతి ఆయోగ్-2020లో విడుదల చేసిన సూచీల్లో దేశంలో తెలంగాణ ఎగుమతుల్లో ఎన్నో స్థానంలో ఉంది?
1) 5 2) 6 3) 4 4) 3
30. మిషన్ భగీరథ పథకంలో ఎన్ని సెగ్మెంట్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు?
1) 29 2) 26
3) 40 4) 28
31. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2017 జూన్ 20
2) 2018 మే 30
3) 2016 జనవరి 20
4) 2016 జూన్ 20
32. కింది వాటిలో ఏ పట్టణాభివృద్ధి సంస్థలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1) శాతవాహన 2) స్తంభాద్రి
3) నిజామాబాద్ 4) పైవన్నీ
33. దివ్యాంగులకు వసతి, శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఐటీ క్యాంపస్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) హైదరాబాద్ 2) వరంగల్
3) భువనగిరి 4) కరీంనగర్
34. దేశంలో సంచార పశు వైద్య సేవల వాహనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం?
1) ఒడిశా 2) తెలంగాణ
3) కర్ణాటక 4) తమిళనాడు
35. గ్రామీణ సంచార పశు వైద్యశాలను హైదరాబాద్‌లో ఎప్పుడు ప్రారంభించారు?
1) 2017 అక్టోబర్ 10
2) 2017 జనవరి 30
3) 2017 సెప్టెంబర్ 15
4) 2017 మార్చి 15
36. తెలంగాణలో ప్రారంభించిన ‘ఈ-గోల్కొండ’ ఆన్లైన్ వేదికకు కింది వాటిలో ఏది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది?
1) పర్యాటక శాఖ
2) హోం మంత్రిత్వ శాఖ
3) చేనేత జౌళి శాఖ
4) వైద్య, ఆరోగ్య శాఖ
37. అభివృద్ధి వ్యయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్ 4) గోవా
38. భూమి కొనుగోలు పథకం ద్వారా 2014 ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 2021 వరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసింది?
1) 10,432.10 2) 16,993.27
3) 21,001.30 4) 17,531.00
39. తెలంగాణలో తొలి ఈ-హెల్త్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) జడ్చర్ల
2) జయశంకర్ భూపాలపల్లి
3) రాజన్న సిరిసిల్ల
4) సిద్దిపేట
40. శిశువుల్లో వచ్చే ఏ వ్యాధుల నుంచి పెంటా వాలెంట్ టీకా రక్షిస్తుంది?
1) కంఠసర్పి, కోరింత దగ్గు
2) హెపటైటిస్-బి
3) హిమోఫిలి ఇన్ఫ్ల్యూయెంజా
4) పైవన్నీ
41. తెలంగాణలో కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ?
ఎ. హైదరాబాద్ బి. ఖమ్మం
సి. మహబూబ్‌నగర్
డి. హనుమకొండ
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
42. మన ఊరు, మన కూరగాయలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం?
ఎ. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య ఉన్న మధ్యవర్తుల తొలగింపు
బి. రైతులకు భరోసా ఇచ్చి ఆత్మహత్యలను నివారించడం
సి. కూరగాయల ధరల స్థిరీకరణ
డి. పట్టణ వాసులు కూరగాయల అవసరాలు తీర్చడం
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
43. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి ప్రతి గ్రామంలో ఎన్ని ఎకరాల భూమిని క్రీడా స్థలంగా కేటాయిస్తుంది?
1) 2 (లేదా) 3 2) 1 (లేదా) 2
3) 1 (లేదా) 1 1/2
4) 1 1/2 (లేదా) 2 1/2
44. రాష్ట్రంలో మొదటి నగదు రహిత ఆధ్యాత్మిక పట్టణం?
1) భద్రాచలం 2) యాదాద్రి
3) వేములవాడ 4) ఏడుపాయల
45. తెలంగాణ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2018 జనవరి 2
2) 2018 జనవరి 12
3) 2018 జనవరి 3
4) 2018 జనవరి 13
46. బాలికల ఆరోగ్య సంరక్షణ కిట్‌లో భాగంగా 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఎన్ని లక్షల కిట్లను అందజేయనున్నారు?
1) 3 లక్షల కిట్లు 2) 7 లక్షల కిట్లు
3) 5 లక్షల కిట్లు 4) 2 లక్షల కిట్లు
జవాబులు
1.1 2.2 3.3 4.4
5.2 6.1 7.1 8.2
9.3 10.2 11.2 12.2
13.3 14.2 15.1 16.2
17.3 18.2 19.3 20.4
21.2 22.4 23.1 24.4
25.3 26.1 27.3 28.3
29.3 30.2 31.1 32.4
33.1 34.2 35.3 36.2
37.4 38.2 39.1 40.4
41.3 42.4 43.1 44.2
45.3 46.2
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?