చేతన, అచేతనాలను మూల సూత్రాలుగా ఎంచుకున్న వాదాలు?
టెట్ ప్రత్యేకం పెడగాగి
1. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, ఆత్మ ప్రకటన అనే అంశాలను తన విద్యా విధానాలుగా తెలిపిన సైకాలజిస్ట్ ఎవరు?
1) రూసో 2) ఆగస్టిన్
3) మాంటిస్సోరి 4) జాన్ డ్యూయి
2. స్వయం ప్రకాశం, స్వయం వివర్తన, క్రీడా విద్య, సంగీత విద్య లాంటి అంశాలను తెలిపినవారు?
1) హెర్బర్ట్ 2) ఫ్రోబెల్
3) రూసో 4) జాన్‌డ్యూయి
3. కింది వాటిలో సరికానిది?
1) పాఠ్యపథకాన్ని తెలిపిన హెర్బర్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీకి పితామహుడు
2) సైకాలజీలో తొలి ప్రయోగాలు చేసిన ఊంట్ పురాతన సైకాలజీకి పితామహుడు
3) ప్రకృతిలోకి తిరిగి పోదాం అనే నినాదం ఇచ్చినది రూసో
4) టాబ్యులారసా అనే పదాన్ని పలుమార్లు వినియోగించినది జాన్లాక్
4. కింది వాటిలో సరికానిది?
1) స్మృతిపై తొలి ప్రయోగాలు చేసినది ఊంట్
2) వైయక్తిక భేదాలపై గాల్టన్ ఏర్పాటు చేసిన ప్రయోగశాల సైకాలజీ ల్యాబొరేటరీ
3) నర్సరీ విద్యా విధానానికి పితామహుడు హెర్బర్ట్
4) పైవన్నీ
5. బోధనలో నైతిక విలువలను సూచించినది?
1) విలియం జేమ్స్ 2) ఫ్రోబెల్
3) హెర్బర్ట్ 4) లారెన్స్ కోల్బర్గ్
6. కార్యకరణ వాదానికి మూల పురుషుడు?
1) విలియం జేమ్స్ 2) జాన్ డ్యూయి
3) జె.బి. వాట్సన్
4) సెయింట్ ఆగస్టిన్
7. అవదానం, ప్రత్యక్షం, ప్రజ్ఞ అనే అంశాలు ఏ వాదంలో ప్రధాన అంశాలు?
1) ప్రవర్తన వాదం
2) సంరచన ప్రవర్తన వాదం
3) కార్యకరణ వాదం
4) మనో విశ్లేషణ వాదం
8. చేతనం, అచేతనాలను మూల సూత్రాలుగా ఎంచుకున్న వాదాలు వరుసగా?
1) సంరచన, ప్రవర్తన
2) ప్రవర్తన, కార్యకరణ
3) గెస్టాల్ట్, ప్రవర్తన
4) సంరచన, మనో విశ్లేషణ
9.అన్ని రకాల ప్రవర్తనల అధ్యయనం సైకాలజీ అని తెలుపుతూ సైకాలజీని ప్రవర్తన శాస్త్రం అని పేరు మార్చినవారు?
1) విలియం జేమ్స్ 2) ఉడ్వర్త్
3) జె.బి.వాట్సన్ 4) ఊంట్
10. సైకాలజీ ఆత్మను, మనస్సును, చేతనత్వాన్ని అలా కోల్పోయి చివరకు తన ప్రవర్తనను మాత్రమే మిగుల్చుకుంది అని కామెంట్ చేసినవారు?
1) ఉడ్వర్త్ 2) వాట్సన్
3) విలియం జేమ్స్ 4) ఊంట్
11. శిశువు వయస్సు పెరిగే కొద్ది మెదడులో పరిపక్వత జరిగి వయస్సుతో పాటు సంజ్ఞానాత్మక వికాసం కూడా చెందుతుందని వివరించినవారు?
1) పియాజే 2) గిల్ఫర్డ్
3) కోల్బర్గ్ 4) థార్న్‌డైక్
12. థార్న్‌డైక్ తెలిపిన అభ్యసన సిద్ధాంతం?
1) యత్నదోష సిద్ధాంతం
2) సమరూప మూలకాల సిద్ధాంతం
3) బహుకారక సిద్ధాంతం
4) పైవన్నీ
13. థార్న్డైక్కు సంబంధించి సరికానిది?
1) బహుకారక సిద్ధాంతం తెలిపాడు
2) సంసిద్ధత సూత్రాన్ని తెలిపాడు
3) యాంత్రిక ప్రజ్ఞకు కారణం
అయ్యేది మధ్య మెదడు అన్నాడు
4) పైవన్నీ సరైనవి
14. భాష ఒక సహజాత ప్రక్రియ, మానవ భాష అనేది అన్ని జీవులలాగే ప్రత్యేకమైనదని తెలిపినది?
1) వైగోట్స్కీ 2) చామ్స్కీ
3) కార్ల్‌రోజర్స్ 4) మాస్లో
15. సంసర్గ వాదాన్ని తెలిపినది?
1) విలియం జేమ్స్ 2) జాన్లాక్
3) అరిస్టాటిల్ 4) ప్లేటో
16. సామ్యం, వైషమ్యం, సాంతత్వం అనే వాటిని మూల సూత్రాలుగా తీసుకున్న వాదం?
1) సంరచన వాదం
2) కార్యకరణ వాదం
3) ప్రవర్తన వాదం
4) సంసర్గ వాదం
17. సంరచనాత్మక వాదులు ఏ అంశాలపై దృష్టి పెట్టారు?
1) సంవేదనలు (ఇంద్రియ జ్ఞానం)
2) ప్రతిమలు
3) అనుభూతులు 4) పైవన్నీ
18. సాంఘిక భాష, వ్యక్తిగత భాష అనే వాటిని తెలిపినది?
1) చామ్స్కీ 2) వైగోట్స్కీ
3) పియాజే 4) సీషోర్
19. ‘మానవుడు ఒక సంఘ జంతువు’ అని అన్నది?
1) ప్లేటో 2) సోక్రటీస్
3) అరిస్టాటిల్ 4) రూసో
20. రూసో నినాదం?
1) పాఠశాల ఒక సమాజం
2) ప్రకృతిలోకి తిరిగి వెళ్ద్దాం
3) కెరటాలు పడి లేవటమే ఆదర్శం
4) పోరాడితే పోయేది బానిస సంకెళ్లే
21. కింది వాటిలో సరికానిది?
1) స్వేచ్ఛగా జన్మించిన మానవునికి
నాగరికత సంకెళ్లు వేసింది-ప్లేటో
2) మనస్సు లక్కముద్ద లాంటిది- ప్లేటో
3) పాఠశాల చిన్న మోతాదు సమాజం- జాన్ డ్యూయి
4) నేటి నా స్థితికి నిన్నటి ఆలోచనలే కారణం- మెకైవర్
22. ఆత్మదర్పణ సిద్ధాంతాన్ని తెలిపినది?
1) అరిస్టాటిల్ 2) సోక్రటిస్
3) కార్ల్‌రోజర్స్ 4) కూలే
23. ‘ఆత్మ భావన సిద్ధాంతం’ తెలిపినది?
1) మాస్లో 2) కార్ల్‌రోజర్స్
3) గోల్ట్‌స్టీన్ 4) వైగోట్స్కీ
24. టాబులారసా అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది?
1) జాన్లాక్ 2) ప్లేటో
3) సోక్రటీస్ 4) అరిస్టాటిల్
25. మానవతావాద సిద్ధాంత కర్త?
1) అబ్రహం మాస్లో 2) కార్ల్ రోజర్స్
3) గోల్డ్‌స్టీన్ 4) పై అందరూ
26. స్మృతిపై విస్తృత ప్రయోగాలు చేసినది?
1) ఊంట్ 2) ఎబ్బింగ్ హాస్
3) విలియం జేమ్స్ 4) ఆల్పోర్ట్
27. 16 మూర్తిమత్వ కారకాల నికష (16PF) ను తెలిపినది?
1) ఆర్బీ కాటిల్ 2) మెకిన్ కాటిల్
3) ఆల్పోర్ట్ 4) షెల్టన్
28. మూర్తిమత్వాన్ని విలువల ఆధారంగా వర్గీకరించినవారు?
1) స్ప్రాంగర్ 2) క్రెష్మర్
3) షెల్టన్ 4) కాటిల్
29. మనో విశ్లేషణ సిద్ధాంత కర్త?
1) ఎరిక్సన్ 2) సల్లివాన్
3) యంగ్ 4) ఫ్రాయిడ్
30. ‘ఆత్మ భావన’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు?
1) కార్ల్ రోజర్స్ 2) మాస్లో
3) గోల్డ్‌స్టీన్ 4) ఎవరూ కాదు
31. ఉద్వేగ వికాసాన్ని వివరించినది?
1) బన్హమ్ 2) సోరెన్సన్
3) హర్లాక్ 4) క్యాథరిన్ బ్రిడ్జెస్
32. కింది వారిలో మానవతావాది?
1) మాస్లో 2) కార్ల్‌రోజర్స్
3) గోల్డ్‌స్టీన్ 4) పై అందరు
33. ‘జిమ్నాషియా’ పాఠశాల స్థాపకుడు?
1) అరిస్టాటిల్ 2) ప్లేటో
3) సోక్రటీస్ 4) పెస్టాలజీ
34. మనోసాంఘిక వికాసాన్ని తెలిపినవారు?
1) సిగ్మండ్ ఫ్రాయిడ్
2) కార్ల్‌యంగ్
3) ఎరిక్సన్ 4) అడ్లర్
35. వైయక్తిక మనో విజ్ఞాన శాస్ర్తాన్ని తెలిపినవారు?
1) అడ్లర్ 2) కార్ల్ యంగ్
3) ఎరిక్సన్ 4) ఫ్రాయిడ్
36. మనో నిశ్చయం, జీవిత పంథా (స్టెల్ ఆఫ్ లైఫ్) అనే పదాలను తన సిద్ధాంతంలో తెలిపినవారు?
1) యంగ్ 2) అడ్లర్
3) సల్లివాన్ 4) ఎరిక్సన్
37. సామూహిక అచేతనం, పర్సోన, అనిమస్, అనిమ లాంటి పదాలను తెలిపినవారు?
1) సల్లివాన్ 2) మాస్లో
3) అడ్లర్ 4) కార్ల్‌యంగ్
38. కార్ల్‌యంగ్ తెలిపిన సిద్ధాంతం?
1) వైయక్తిక సైకాలజీ
2) విశ్లేషణాత్మక సైకాలజీ
3) మనో విశ్లేషణ శాస్త్రం
4) మనో సాంఘిక వికాసం
39. కింది వాటిలో క్లినికల్ సైకాలజిస్ట్ కానివారు?
1) హెర్మన్ రోషాక్ 2) కార్ల్ రోజర్స్
3) ఇవాన్ పావ్లోవ్
4) సిగ్మండ్ ఫ్రాయిడ్
40. అహం పద సృష్టికర్త?
1) కార్ల్‌రోజర్స్ 2) గోల్డ్‌స్టీన్
3) మాస్లో 4) మాంటిస్సోరి
41. స్వయం ప్రేరణ పద్ధతులు వివరించినవారు ఎవరు?
1) విలియం జేమ్స్ 2) ఫ్రోబెల్
3) జాన్ డ్యూయి 4) హెర్బర్ట్
42. పాఠ్య పథకంలో సోపానాలు తెలిపినది?
1) హెర్బర్ట్ 2) ఫ్రోబెల్
3) మాంటిస్సోరి 4) అరిస్టాటిల్
43. టాబ్యులారసాలనే పదాన్ని పలుమార్లు వినియోగించినవారు?
1) అరిస్టాటిల్ 2) సోక్రటీస్
3) ప్లేటో 4) జాన్లాక్
44. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, ఆత్మ ప్రకటన లాంటి అంశాలను తన విద్యా విధానాలుగా ప్రకటించిన విద్యావేత్త?
1) మాంటిస్సోరి 2) ప్లేటో
3) సోక్రటీస్ 4) హెర్బర్ట్
45. పజిల్ పేటికతో ట్రయల్, ఎర్రర్ సిద్ధాంతాన్ని తెలిపినవారు?
1) స్కిన్నర్ 2) పావ్లోవ్
3) బ్రూనర్ 4) ఎవరూ కాదు
46. ‘ఆకృతీకరణ’ అనే ప్రవర్తన అంశాన్ని స్కిన్నర్ ఏ జీవి ద్వారా వివరించాడు?
1) ఎలుక 2) పావురం
3) కుందేలు 4) లారెంజ్ పక్షి
47. ఆల్బర్ట్ అనే శిశువుపై తెల్ల ఎలుకతో ప్రయోగాలు చేసి నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతాన్ని వివరించినవారు?
1) పావ్లోవ్ 2) వాట్సన్
3) థార్న్‌డైక్ 4) స్కిన్నర్
48. కాంతి ఆధారిత ప్రయోగాల ద్వారా గెస్టాల్ట్ విధానాన్ని తెలిపినవారు?
1) వర్థిమర్ 2) కోఫ్కా
3) పై ఇద్దరూ 4) కోహ్లర్
49. టేనరీఫ్ దీవుల్లో చింపాంజీలపై ప్రయోగాలు చేసి అంతర్ దృష్టి సిద్ధాంతాన్ని తెలిపినవారు?
1) కోహ్లర్ 2) బండూర
3) సుల్తాన్ 4) వెర్థిమర్
50. ‘పాత్ర నమూనా’ అనే అంశాన్ని ప్రధానంగా ఎంచుకున్న సిద్ధాంతాన్ని వివరించినవారు?
1) బ్రూనర్ 2) బండూర
3) ఫ్రోబెల్ 4) మాంటిస్సోరి
– పంతులు మధుబాబు
– సీనియర్ సైకాలజీ ఫ్యాకల్టీ, రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, హైదరాబాద్
డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు
1. తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
జవాబు: 1
2. కింది వాటిలో IQAirకు సంబంధించి సరైనవి?
1) ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ
2) ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2023ను విడుదల చేసింది
3) ఈ నివేదికలో మొదటి 10 స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా, తజికిస్థాన్, బుర్కినోఫాసో, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, ఈజిప్ట్, కాంగో ఉన్నాయి
4) పైవన్నీ సరైనవే
జవాబు: 4
3. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ ట్రైన్ సర్వీస్ ఏ సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు?
1) 2025 2) 2026
3) 2030 4) 2040
జవాబు: 2
– సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ సౌజన్యంతో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?