ప్రజల దృక్పథాల్లో మార్పులు.. పర్యావరణంలో నవకల్పనలు
- పర్యావరణ సుస్థిరాభివృద్ది
World Commission on Environ and Development 1985 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
- WCED చైర్మన్ : బ్రంట్‌లాండ్
- బ్రంట్‌లాండ్ కమిషన్ నివేదిక ‘మన భవిష్యత్’
- యూఎన్వో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015 సెప్టెంబర్‌లో ఆమోదించింది.
- అజెండా -2030 లక్ష్యాలు 17 కాగా ఉప లక్ష్యాలు 169 ఉన్నాయి.
- సుస్థిరాభివృద్ధిలో పర్యావరణం, సమాజం, ఆర్థిక వ్యవస్థ అనేవి ముఖ్యాంశాలు.
- యూఎన్వో 2005-2015 దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్య’గా ప్రకటించింది.
- భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించడమే సుస్థిరాభివృద్ధి.
- 1983 ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నార్వే ప్రధాని బ్రంట్‌లాండ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పర్యావరణం-అభివృద్ధి అనే సదస్సులో పర్యావరణవేత్తలు తరచూ ఉపయోగించే సుస్థిరాభివృద్ధి అనే భావనను పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ధి స్థానంలో సుస్థిరాభివృద్ధి అనే నూతన భావన ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ అనే పేరుతో 1987 సంవత్సరంలో ఐరాస ఆమోదించగా 1988లో అమల్లోకి వచ్చింది.
- బ్రంట్‌లాండ్ నిర్వచనం ప్రకారం ‘ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించడం ద్వారా సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’గా పిలుస్తారు.
సుస్థిరాభివృద్ధిలోని ప్రధానాంశాలు
- వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించకూడదు
- పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందేటటువంటి కాలుష్య పదార్థాలను పర్యావరణంలో విసర్జించకూడదు.
- అభివృద్ధి అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజలకు కనీస అసరాలు తీర్చే విధంగా ఉండాలి.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
- అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, విద్య, ఆరోగ్య, ప్రజా జీవనంలో భాగస్వామ్యం, నాణ్యమైన పర్యావరణం, సమన్యాయాన్ని పెంపొందించడం, వనరుల సమాన పంపిణీ, భవిష్యత్ తరాల కనీస అవసరాలను తీర్చడానికి వనరులను అందుబాటులో ఉంచే విధంగా ప్రస్తుత అభివృద్ధి విధానాలను తీర్చిదిద్దడం మొదలైన అంశాలు సుస్థిరాభివృద్ధిలో సమ్మిళితం చేస్తారు.
- సహజ వనరులను ప్రస్తుత అవసరాలకు ఏ స్థాయిలో వినియోగిస్తామో అదే స్థాయిలో వాటిని పునరుత్పత్తి చెందించడానికి చర్యలు చేపట్టాలి.
- అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని కలుగజేయని రీతిలో ఉండాలి. అంటే ఆర్థికాభివృద్ధి అనేది భావితరాల జీవన ప్రమాణాలను దెబ్బతీయకూడదు.
- సుస్థిరాభివృద్ధి కొనసాగింపునకు నిరంతర జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడాలి.
- కాలుష్యరహితమైన, పునరుత్పాదక, చౌకగా లభ్యమైన శక్తి వనరుల వినియోగాన్ని పెంపొందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
- గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో సుస్థిరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.
- సుస్థిరాభివృద్ధికి దోహదపడేలా సముద్ర ఉత్పత్తులు, సముద్ర వనరుల పరిక్షణ చేపట్టాలి.
- ఎడారీకరణ, అడవుల నిర్మూలన, భూసారం తగ్గుదలను అరికట్టాలి.
- సుస్థిరాభివృద్ధి దశలో ప్రపంచ భాగస్వాములను ప్రోత్సహించడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడం.
సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం
- 2002 సంవత్సరం జొహాన్నెస్‌బర్గ్ సదస్సులో యూఎన్వో 2005-15 దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్య’గా ప్రకటిస్తూ ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రాధాన్యతలను తెలిపింది.. అవి:
- పర్యావరణం పట్ల ప్రజల దృక్పథాల్లో మార్పులు తీసుకురావాలి. అంటే పర్యావరణాన్ని దుర్వినియోగపరచడానికి బదులు పరిరక్షణలో వారు భాగస్వాములు అయ్యే విధంగా, అత్యాశకు కాకుండా అవసరాలకు మాత్రమే వనరులను వినియోగించుకునేలా వారి ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.
- ఆర్థికాభివృద్ధికి పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతులను నవకల్పనలను ప్రోత్సహించాలి.
- పర్యావరణానికి గల శోషక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక కార్యకలాపాలకు పరిమితులు విధించాలి
- సుస్థిరాభివృద్ధి పరిపాలనాపరమైన ప్రభుత్వ పాత్రను విస్తరింపజేయాలి.
- వనరుల సంరక్షణను ప్రోత్సహించాలి.
- జీవవైవిధ్య పరిరక్షణ చేపట్టాలి
యూఎన్వో – సహస్రాభివృద్ధి లక్ష్యాలు
- 2000, సెప్టెంబర్ 6-8 తేదీల మధ్య న్యూయార్క్‌లో 189 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో 2015 సంవత్సరానికి సుస్థిరాభివృద్ధికి సంబంధించిన కింది లక్ష్యాలను సాధించాలని ‘సహస్రాభివృద్ధి లక్ష్యాలు’ అనే పేరుతో ముసాయిదాను విడుదల చేశారు. అవి..
- డాలర్ కంటే తక్కువ ఆదాయం గల పేదలను సగానికి తగ్గించాలి.
- 2015 నాటికి స్కూల్‌కు వెళ్లగలిగిన పిల్లలంతా ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి
- లింగ వ్యత్యాసాన్ని రూపుమాపాలి
- మహిళా సాధికారితను సాధించాలి
- శిశు మరణాల సంఖ్యను తగ్గించాలి
- గర్భిణులకు పోషకాహారాన్ని తగినంత అందుబాటులో ఉంచాలి
- హెచ్ఐవీ/ఎయిడ్స్, మలేరియా ఇతర వ్యాధుల వ్యాప్తిని నివారించాలి. వీటికి సంబంధించిన చికిత్సా సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి.
- ప్రతి దేశం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మిళితం చేసి పర్యావరణం వనరుల నష్టాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి.
- జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని తగ్గించాలి.
- తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు లేని జనాభాలో కనీసం సగం మందికి 2015 నాటికి ఆ సదుపాయాలు కల్పించాలి.
- 2020 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా మురికి వాడల్లో 100 మిలియన్ల జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి.
- యూఎన్వో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
- దీన్నే అజెండా 2030గా పిలుస్తారు. సెప్టెంబర్ 25, 2015 న్యూయార్క్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సహస్రాభివృద్ధి లక్ష్యాల స్థానంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టారు. 2016-30 మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సిన లక్ష్యాలను Transforming our World – The 2030 Agenda for Sustainable Development పేరుతో విడుదల చేశారు. అవి..
- పేదరికం ఏ రూపంలో ఉన్నప్పటికీ పూర్తిగా రూపుమాపడం
- ఆకలిని అంతం చేసి ఆహార భద్రత, పోషకత్వాన్ని మెరుగుపరచడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
- ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించడం
- చౌకగా ఉండే, విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులను అందించడం
- లింగ సమానత్వాన్ని సాధించి బాలికలు, మహిళలకు సాధికారతను కల్పించడం
- అందరికీ మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ స్థిరంగా లభ్యమయ్యేలా చూడటం
- సమ్మిళిత, సమానత్వ, నాణ్యతతో కూడుకున్న విద్యను అందించి అందరికీ జీవిత కాల అభ్యసన అవకాశాలు కల్పించడం
- దేశం లోపల, వెలుపల అంతరాలను తగ్గించడం
- మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత సుస్థిర పారిశ్రామికీకరణ నవకల్పనలను అందించడం
- నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా ఉండే విధంగా నగరాల అభివృద్ధి
- సుస్థిర సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం, ఉత్పాదకతతో కూడిన ఉపాధి, సంపూర్ణ ఉద్యోగిత కల్పించడం, అందరికీ యోగ్యమైన పనిని కల్పించడం
- సుస్థిరాభివృద్ధికి మహాసముద్ర, సముద్ర జల వనరులను సంరక్షించడం
- పర్యావరణ మార్పుల ప్రభావాలకనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలి
- సుస్థిరాభివృద్ధికి శాంతియుత సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించడం, అందరికీ న్యాయం అందేలా చూడటం, అన్ని స్థాయిల్లో జవాబుదారీతనం ఉండేలా వ్యవస్థలను ఏర్పాటు చేయడం
- భౌగోళిక జీవావరణాన్ని సంరక్షించడం, పరిరక్షించడం, మెరుగుపరచడం, అడవుల నిర్వహణ, ఎడారీకరణను నిరోధించడం, భూక్షీణతను నిలిపివేయడం, జీవ వైవిధ్య నష్టాన్ని తగ్గించడం
- సుస్థిరాభివృద్ధిలో భాగంగా సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి
సుస్థిరాభివృద్ధి -పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు
- కింద తెలిపిన వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చు. అవి..
- సేంద్రీయ వ్యవసాయం
- జీవ ఎరువులు
- జీవ క్రిమి సంహారకాలు
- వాటర్ షెడ్ నిర్వహణ
- పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం
- జీవ ఇంధనాల వాడకం
- హరిత నగరాలు
- సంప్రదాయేతర ఇంధన వనరులు
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా భారతదేశం అంతర్జాతీయ సమావేశాల్లో చురుకుగా పాల్గొంటున్నది.
- మన దేశంలో కూడా పర్యావరణ సమావేశాలను నిర్వహించడం ప్రజలను దానిలో భాగస్వాములను చేయడం జరుగుతుంది.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 సంవత్సరం నాటికి మొత్తం ఇంధనంలో 40 శాతం తరిగిపోని ఇంధన వనరులు ఉండాలని నిర్ణయించింది.
– జీబీకే పబ్లికేషన్స్,
హైదరాబాద్
Previous article
ప్రాక్టీస్ బిట్స్
Next article
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక మూలకం?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






