Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
1. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్‌కు ఏ దేశం బాధ్యతలు స్వీకరించనుంది? (4)
1) భారత్ 2) మారిషస్
3) బంగ్లాదేశ్ 4) శ్రీలంక
వివరణ: ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 23 దేశాల కలయికతో ఏర్పాటయ్యింది. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఓషియానియా దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారం, అభివృద్ధిని పెంపొందించడానికి దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్ష బాధ్యతలను తాజాగా శ్రీలంక స్వీకరించింది. రెండు సంవత్సరాల పాటు ఈ దేశం అధ్యక్ష స్థానంలో ఉంటుంది. 16 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొలంబోలో జరిగే సమావేశాలకు హాజరు కానున్నారు.
2. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరేందుకు అక్టోబర్ రెండో వారంలో నిర్ణయించుకున్న దేశం ఏది? (2)
1) శ్రీలంక 2) టాంజానియా
3) మాల్దీవులు 4) వియత్నాం
వివరణ: భారత్ చేపట్టిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరేందుకు టాంజానియా తన సమ్మతిని తెలిపింది. ఈ కూటమిని భారత్ ఈ సంవత్సరం ఏప్రిల్ 9న ప్రకటించింది. పులి, సింహం, చిరుతపులి, చిరుత, మంచు చిరుతపులి, జాగ్వార్, ప్యూమా వంటి ఏడు జంతువులను పరిరక్షించేందుకు భారత్ దీన్ని ప్రారంభించింది. ఈ జంతువులు సహజ ఆవాసం ఉండే 97 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. ఆయా దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు కూడా చేరేందుకు అనుమతి ఇస్తారు. వీటి పరిరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు, సాయం చేస్తుంది. దీని ఏర్పాటుకు భారత్ ప్రకటించిన సాయం 100 మిలియన్ డాలర్లు. ఈ వ్యవస్థలో ఒక సాధారణ సభ ఉంటుంది. ఇందులో ఏడుకు తక్కువ కాకుండా, 15కు మించకుండా సభ్యులను ఎన్నుకుంటారు. అయిదు సంవత్సరాల పాటు ఆ దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి.
3. చక్రవాత్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (3)
1) కొత్త పథకం
2) సిక్కిం తుఫానుకు పెట్టిన పేరు
3) సైనిక విన్యాసం
4) కొత్త కంప్యూటర్ సాఫ్ట్వేర్
వివరణ: చక్రవాత్ అనేది ఒక సైనిక విన్యాసం. ఈ ఏడాది భారత నావికా దళం నిర్వహిస్తుంది. ఒక్కో ఏడాది ఒక్కో సైనిక దళం దీన్ని జరుపుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 11 వరకు గోవాలో నిర్వహించారు. యాన్యువల్ జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్) ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఇందులో నావికా దళంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, జాతీయ విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు నిర్వహణ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన సిబ్బంది కూడా పాల్గొన్నారు.
4. అక్టోబర్ 9కి సంబంధించి కింది వాటిలో సరైనవి? (4)
ఎ. భారత విదేశాంగ సేవ దినోత్సవం
బి. భారత వాయుదళ దినోత్సవం
సి. ప్రపంచ పోస్టల్ దినోత్సవం
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) ఎ, సి
వివరణ: ఏటా అక్టోబర్ 9న భారత విదేశాంగ శాఖ సేవ దినోత్సవంగా నిర్వహిస్తారు. 1946లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అలాగే అక్టోబర్ 9న ప్రపంచ పోస్టల్ డే కూడా నిర్వహిస్తారు. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ను ఏర్పాటు చేశారు. ఇది స్విట్జర్లాండ్‌లోని బెర్న్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ల మంది పోస్టల్ సేవలను పొందుతున్నారు. అలాగే ఏటా అక్టోబర్ 8న భారత వాయుదళ దినోత్సవం నిర్వహిస్తారు.
5. ఏ రోజున ప్రపంచ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే నిర్వహిస్తారు? (1)
1) అక్టోబర్ 8 2) అక్టోబర్ 9
3) అక్టోబర్ 7 4) అక్టోబర్ 10
వివరణ: ప్రతి ఏడాది అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే నిర్వహిస్తారు. పర్యావరణ అనుకూల శక్తిగా హైడ్రోజన్ ఇంధనాన్ని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. దీనిలో సుస్థిరత సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇటీవల భారత్ హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా నిర్వచించింది. అలాగే హైడ్రోజన్ మిషన్‌ను కూడా ప్రారంభించింది. ఇందుకు రూ.400 కోట్లతో ఒక రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించింది.
6. డాకర్ ప్రకటన దేనికి సంబంధించింది? (3)
1) దౌత్య అంశాలు 2) క్రీడలు
3) పర్యావరణం 4) మానసిక వికాసం
వివరణ: పర్యావరణ మార్పునకు సంబంధించి అతి తక్కువగా అభివృద్ధి చెందిన 46 దేశాలు డాకర్ ప్రకటనను వెలువరించాయి. ఈ ఏడాది 28వ పర్యావరణ సమావేశం దుబాయిలో జరగనుంది. ఇది వరకే నిర్దేశించుకున్న లక్ష్యాలు అన్ని దేశాలు సాధించేలా చూడాలన్నది డాకర్ ప్రకటన ముఖ్య సారాంశం. డాకర్ అనేది సెనెగల్ అనే దేశంలోని నగరం. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు నగదు సాయాన్ని రెట్టింపు చేయాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. పర్యావరణ హితమైన చర్యలు తీసుకొనేందుకు వీలుగా ఈ నగదును పేద దేశాలకు వినియోగించడానికి కేటాయించాలని కూడా పేర్కొన్నాయి.
7. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది? (2)
1) బిహార్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) మహారాష్ట్ర
వివరణ: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని అటవీ శాఖలో ఇది వర్తించదు. ఇందుకు మధ్యప్రదేశ్ పౌర సేవల నిబంధనలు-1997లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది.
8. ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది? (3)
1) వేదాలకు పూజలు
2) హిందూ పాఠశాలలు
3) గిరిజనుల వేడుక
4) పైవేవీ కాదు
వివరణ: ఆది మహోత్సవ్ అనేది గిరిజనుల జాతీయ పండుగ. ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ పండుగ 16వ తేదీ వరకు కొనసాగింది. గిరిజనుల్లో వ్యవస్థాపన అవకాశాలు పెంచడంతో పాటు వారి సంస్కృతి, కళ ప్రదర్శనగా ఇది ఉంటుంది. దాదాపు 150 స్టాళ్ల ద్వారా గిరిజనులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. దీన్ని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో నిర్వహించారు. దాదాపు 336 మంది గిరిజన కళాకారులు వివిధ కళలను ప్రదర్శించారు. ఇందులో పీవీటీజీలు కూడా కొందరు ఉన్నారు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని అర్థం.
9. ఆసియా-పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్మెంట్కు భారత్ అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యింది. ఇలా ఎన్నిక కావడం ఎన్నోసారి? (2)
1) 2 2) 3 3) 4 4) 5
వివరణ: ప్రతిష్ఠాత్మక ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్మెంట్ జనరల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్ష స్థానానికి భారత్ మరో మూడు సంవత్సరాలకు ఎన్నికయ్యింది. ఈ వ్యవస్థకు భారత్ ఎన్నిక కావడం ఇది మూడోసారి. 2018-21 వరకు అలాగే 2021-23 వరకు రెండు సార్లు బాధ్యతలను నిర్వర్తించింది. యునెస్కో సహకారంతో ఈ సంస్థను 1977లో స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం మలేషియాలో ఉంది. ప్రస్తుతం ఇందులో 92 సభ్యదేశాలు ఉన్నాయి. 44 దేశాలకు చెందిన వ్యక్తులతో పాటు 26 మంది ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో ఉన్నారు.
10. దివ్యాంగులకు హైటెక్ క్రీడాడ శిక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (4)
1) అసోం 2) మణిపూర్
3) నాగాలాండ్ 4) మధ్యప్రదేశ్
వివరణ: దివ్యాంగులకు హైటెక్ క్రీడల శిక్షణ కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుతో ఇది అందుబాటులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇది ఉంది. దివ్యాంగుల క్రీడా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ తరహా శిక్షణ కేంద్రం భారత్‌లో మొదటిది.
11. ప్రస్తుతం రెపోరేట్ ఎంత? (3)
1) 6.25% 2) 6.75%
3) 6.50% 4) 3.35%
వివరణ: ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధానాన్ని అక్టోబర్ 6న ప్రకటించింది. విధాన రేట్లు అలాగే నిల్వ నిష్పత్తుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేట్ 6.50% ఉంది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6.25%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయి. రివర్స్ రెపోరేట్ 3.35% ఉండగా నగదు నిల్వల నిష్పత్తి 4.50%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి 18% ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకొని ద్రవ్య విధానాన్ని ప్రకటించింది.
12. తెలంగాణ ఆర్టీసీ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? (2)
1) చంద్రశేఖర్
2) ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
3) సత్యనారాయణ రెడ్డి
4) వెంకటరమణ
వివరణ: ఆర్టీసీ నూతన చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఎండీగా సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర పర్యావరణ శాఖలోని పర్యావరణ నిపుణుల సాధికార కమిటీలో సింగరేణి విశ్రాంత డైరెక్టర్ చంద్రశేఖర్ సభ్యుడిగా నియమితులయ్యారు. అలాగే జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటరమణ ఎంపికయ్యారు.
13. రాష్ట్రంలో తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌ను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? (1)
1) సంగారెడ్డి 2) మెదక్
3) సిద్దిపేట 4) జగిత్యాల
వివరణ: బాల నేరస్థుల కోసం రాష్ట్రంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నారు. నేరారోపణ ఎదుర్కొంటున్న పిల్లలను ప్రశాంత వాతావరణంలో విచారిస్తారు. త్వరలో అన్ని జిల్లాలకు, తర్వాత అన్ని రాష్ర్టాలకు ఈ తరహా వ్యవస్థలను విస్తరించనున్నారు.
14. యశస్విని అనే పదం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (3)
1) మహిళల కోసం దేశంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం
2) కొత్త బెటాలియన్ పేరు
3) మహిళల ద్విచక్ర వాహన ర్యాలీ
4) ఏదీకాదు
వివరణ: ద్విచక్ర వాహనంపై సీఆర్పీఎఫ్కు చెందిన మహిళలు చేపట్టిన ర్యాలీకి ఉన్న పేరే యశస్విని. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌బైక్‌లపై 150 మంది మహిళలు జమ్మూకశ్మీర్‌లో బయలు దేరారు. 10,000 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్ను చేరుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మహిళా సాధికారత తెలియజేసేందుకు దీన్ని చేపట్టారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?