Telangana Current Affairs April 05 | తెలంగాణలో ఆయుష్ వెల్నెస్ సెంటర్లు గల జిల్లాలు?
మార్చి 22వ తేదీ తరువాయి..
81. 2021లో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ, దాని పరిధిలోని ప్రాంతాల్లో నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించండి.
ఎ. గచ్చిబౌలి బి. సనత్‌నగర్
సి. అల్వాల్ డి. దిల్సుఖ్నగర్
ఇ. ఈసీఐఎల్
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) ఎ, బి, సి, ఇ
82. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. నీతి ఆయోగ్ వార్షిక ఆరోగ్య సూచిక 2019-20 ప్రకారం దేశంలోని 19 పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది
బి. మలేరియా నివారణలో తెలంగాణ రాష్ట్రం 2015లో కేటగిరీ-2 నుంచి 2021 వరకు కేటగిరీ-1కు పురోగమించింది
సి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రంలో 636 రూరల్ పీహెచ్‌సీలు, 232 అర్బన్ పీహెచ్‌సీలు, 342 బస్తీ దవఖానలు ఉన్నాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
83. తెలంగాణ రాష్ట్రంలోని రోగులకు ఉచితంగా సమగ్రమైన క్యాన్సర్ చికిత్సను అందజేస్తున్న సంస్థను గుర్తించండి?
1) నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
2) మెహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
3) బహదూర్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
4) సాలార్జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
84. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 104 వాహన రవాణా సేవలు గర్భిణులకు ఏఎన్సీ చెకప్ సమయంలో ఉచిత రవాణా సదుపాయాలకు సంబంధించింది
బి. 102 వాహన రవాణా సేవలు నెలకు ఒకసారి నిర్ణయించిన నిర్ణీత రోజున పీహెచ్సీ లేదా సీహెచ్‌సీల నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న గ్రామీణ నివాసాల్లో గర్భధారణ పర్యవేక్షణ సేవలు, శిశువులు, పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య సేవలు అందిస్తుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
85. తెలంగాణ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి 9 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల స్థాపనకు ఆమోదం తెలిపింది. కింది వాటిలో కాలేజీ స్థాపన లేని జిల్లాలను గుర్తించండి?
ఎ. కరీంనగర్ బి. జనగామ
సి. సిద్దిపేట డి. ములుగు
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, డి
86. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు, సర్జికల్ వస్తువులు, దుస్తులు, వైద్యపరికరాలు మొదలైన వాటిని సరఫరా చేసేది?
1) టీఐఎంఎస్ (టిమ్స్)
2) టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్)
3) టీఎస్ఎంఎస్ఐడీసీ 4) ఏదీకాదు
87. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ‘తెలంగాణ డయాగ్నస్టిక్ స్కీమ్’ను ప్రారంభించింది
బి. తెలంగాణ సామాజిక-ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం 20 జిల్లా స్థాయి డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి
సి. ఈ రోగ నిర్ధారణ కేంద్రాల్లో దాదాపు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
88. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. హరే రామ హరే కృష్ణ మిషన్‌తో కలిసి రోగుల అటెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 భోజన కార్యక్రమాన్ని అందిస్తుంది
బి. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆస్పత్రుల్లో రూ.5 ఒక పూట మధ్యాహ్న భోజన సదుపాయం అందిస్తుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
89. రాష్ట్రంలో ఆయుష్ వెల్నెస్ సెంటర్లు గల జిల్లాలను గుర్తించండి?
ఎ. హైదరాబాద్ బి. వరంగల్
సి. కరీంనగర్ డి. రంగారెడ్డి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
90. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. మొత్తం 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 55 శాతం స్త్రీలు, 45 శాతం పురుషులు ఉన్నారు
బి. వీరిలో 16.6 శాతం మంది ఎస్సీలు, 11.02 శాతం ఎస్టీలు
సి. 25 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందించగా, 20 లక్షల మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
91. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
ఎ. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో మాతృ మరణాల రేటు 61 శాతం తగ్గింది
బి. 2010-12లో ఎంఎంఆర్ 110 ఉండగా 2018-20 నాటికి 43కి తగ్గింది
సి. దేశంలోని 18 నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ర్టాల్లో తెలంగాణ మూడో అత్యల్ప ఎంఎంఆర్ కలిగి ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
92. కింది వాక్యాల్లో సరైన గుర్తించండి?
ఎ. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించడానికి అధిక రక్తహీనత ప్రబలంగా ఉన్న జిల్లాల్లో 2022, డిసెంబర్ 21న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ అనే పథకాన్ని ప్రారంభించారు
బి. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు, సంస్థాగత ప్రసవాలు పెరగడానికి రాష్ట్రంలో మాతా శిశు మరణాల నిష్పత్తిని తగ్గించడానికి దోహదపడ్డాయి.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
93. నీతి ఆయోగ్ ప్రచురించిన ‘హెల్తీ స్టేట్స్- ప్రోగ్రెసివ్ ఇండియా-హెల్త్ ఇండెక్స్-2019-20’ ప్రకారం మొత్తం పనితీరు, పనితీరు మెరుగుదల రెండింటిలోనూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) మొదటి స్థానం 2) రెండో స్థానం
3) మూడో స్థానం 4) నాలుగో స్థానం
94. తెలంగాణ రాష్ట్ర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ఎన్నో లక్ష్యాన్ని మాతృ మరణాల రేటు 43కి తగ్గించడం ద్వారా సాధించింది?
1) లక్ష్యం-1 2) లక్ష్యం-2
3) లక్ష్యం-3 4) లక్ష్యం-4
95. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద అన్ని జిల్లాల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా కింది ఏ వర్గాల వారికి సేవలు అందుతున్నాయి?
ఎ. పుట్టిన నాటి నుంచి 6 సంవత్సరాల వయస్సు పిల్లలు
బి. కౌమార దశలో ఉన్న బాలికలు
సి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు
డి. అనాథ పిల్లలు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
96. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి కార్యక్రమాల వల్ల సంస్థాగత ప్రసవాలు 2015-16 నుంచి 2022కు దాదాపు ఎంత శాతం పెరిగాయి?
1) 50 శాతం 2) 100 శాతం
3) 75 శాతం 4) 60 శాతం
97. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. అమ్మ ఒడి పథకాన్ని 2018లో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, ప్రసవానంతరం సేవల కోసం ప్రారంభించారు
బి. సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడానికి, మాతాశిశు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్‌ను ప్రారంభించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
98. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. ఈ కార్యక్రమాన్ని 2022, డిసెంబర్ 21న 9 జిల్లాల్లో ప్రారంభించారు
బి. దీని ద్వారా గర్భిణులకు రెండుసార్లు పోషకాహార కిట్లు అందిస్తారు
సి. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ స్థాయి పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
99. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. ఈ కార్యక్రమం గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ స్పాట్ ఫీడింగ్ మొదలైన సర్వీసులు అందించడానికి ఉద్దేశించింది
బి. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నిష్పత్తి 60:40
సి. ఈ కార్యక్రమం కింద ప్రతి నెలలో 25 రోజులు పప్పు, ఆకుకూరలు, 200 మి.లీ. పాలు, 30 రోజులు రోజుకు ఒక గుడ్డు అందిస్తారు
డి. గర్భధారణ సమయంలో 100 రోజులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందిస్తారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
100. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. అంగన్వాడీల ద్వారా సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ను అందించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్ తన నివేదిక ‘టేక్ హోం రేషన్: గుడ్ ప్రాక్టీస్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూటీస్-2022’లో ప్రశంసించింది
బి. నీతి ఆయోగ్ తన నివేదికలో ఆరోగ్యలక్ష్మి పథకం న్యూట్రిషనల్ ఎన్రిచ్మెంట్ మొదలైన వాటిని ఉత్తమ పద్ధతులుగా ప్రశంసించింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
101. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం తెలంగాణలో శిశు మరణాల రేటు 2020 నాటికి 21కి తగ్గింది (2014లో 35 కలదు)
బి. నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్) 2015-16లో 20 కాగా 2019-20 నాటికి 16.8కి తగ్గింది
సి. చిన్న పిల్లల మరణాల రేటు/యూ5 ఎంఆర్ (సీఎంఆర్/యూ5 ఎంఆర్) 2015-16లో 31.7 కాగా 2019-20 నాటికి 29.4కి తగ్గింది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
102. సీఈఎంఓఎన్సీ యూనిట్స్ దేనికి సంబంధించింది?
1) గర్భిణుల ఆరోగ్యానికి సంబంధించినవి
2) నవజాత శిశువుల రక్షణకు
సంబంధించినవి
3) క్యాన్సర్ కేర్ యూనిట్స్
4) పోషకాహార సదుపాయాన్ని
గర్భిణులకు అందించేవి
103. పోషకాహార పునరావాస కేంద్రాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ. ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపంతో జరిగే మరణాల నివారణకు ఏర్పాటు చేశారు
బి. వీటిని జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు
సి. రాష్ట్రంలో ప్రస్తుతం 12 ఎన్ఆర్సీలు
పని చేస్తున్నాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
104. రాష్ట్రంలో ప్రస్తుతం 22 కంగారు మదర్ కేర్ సెంటర్లు ఉన్నాయి. కాగా ఇవి ఎవరికి ఆరోగ్యపరమైన సేవలు అందిస్తాయి?
1) తల్లులు
2) అప్పడే పుట్టిన శిశువుకు
3) 1, 2 4) ఏదీకాదు
105. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ‘బాలామృతం’ పథకం కింది ఏ వయస్సు గల పిల్లలకు వర్తిస్తుంది?
1) 0-7 సంవత్సరాలు
2) 3 నెలల వయస్సు నుంచి 7 ఏండ్ల వరకు
3) 7 నెలల కంటే ఎక్కువ వయస్సు నుంచి 3 ఏండ్ల వరకు
4) 6 నెలల వయస్సు నుంచి 3 ఏండ్ల వరకు
106. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింది ఏ వయస్సు గల పిల్లలకు వర్తిస్తుంది?
1) 0-6 సంవత్సరాలు
2) 3-6 సంవత్సరాలు
3) 0-7 సంవత్సరాలు
4) 4-7 సంవత్సరాలు
107. తెలంగాణ ప్రభుత్వం పిల్లల్లో పోషకాహార సమస్యను అధిగమించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమాలను గుర్తించండి?
ఎ. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్
బి. బాలామృతం సి. బాలామృతం ప్లస్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
108. సూపర్వైజ్డ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్‌ను మొదట 2020లో రెండు జిల్లాల్లో ఏ సంస్థల సహకారంతో ప్రారంభించారు?
ఎ. ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
బి. యునిసెఫ్ సి. వరల్డ్ బ్యాంక్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
109. తల్లిపాల వారోత్సవాలు, పోషణ్ పఖ్వాడా, పోషణ్ మహా అనే కార్యక్రమాలను ఏ పథకంలో భాగంగా అమలయ్యాయి?
1) సూపర్వైజ్డ్ సప్లమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం
2) పోషణ్ అభియాన్ 3) గిరిపోషణ
4) పైవేవీ కావు
110. గిరిపోషణ కార్యక్రమం ఏ వర్గాల వారికి ప్రవేశపెట్టిన కార్యక్రమం?
ఎ. పిల్లలు బి. యుక్తవయస్సు బాలికలు
సి. గర్భిణులు డి. పాలిచ్చే తల్లులు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
111. గిరిపోషణ కార్యక్రమానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి?
ఎ. ఈ కార్యక్రమం గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమాల ద్వారా అమలవుతుంది
బి. ఈ కార్యక్రమానికి సాంకేతిక, శాస్త్రీయ సహకారాన్ని ఇక్రిశాట్ అందిస్తుంది
సి. దీని ద్వారా లక్షిత లబ్ధిదారులకు 3 రకాలు రెడీ టు కుక్ ఆహార పదార్థాలు, 3 రకాల రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు అందిస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
112. రాష్ట్ర ప్రభుత్వం యుక్త వయస్సులో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సుకు, వారికి ఆరోగ్యం గురించి, ముందస్తు వివాహం, యుక్త వయస్సులో గర్భం దాల్చకుండా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను ఏ సంస్థలతో కలిసి అందిస్తుంది?
ఎ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
బి. యునిసెఫ్ సి. వరల్డ్ బ్యాంక్
డి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, డి 4) బి, డి
సమాధానాలు
81-1, 82-4, 83-2, 84-4, 85-3, 86-3, 87-4, 88-1, 89-1, 90-4, 91-4, 92-3, 93-3, 94-3, 95-1, 96-2, 97-3, 98-4, 99-4, 100-3, 101-1, 102-2, 103-3, 104-3, 105-3, 106-2, 107-4, 108-1, 109-2, 110-4, 111-4, 112-4.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?