General Science | శరీరమంతటా ఉష్ణాన్ని సమాన స్థాయిలో ఉంచే అవయవం?
1. ఒక వ్యక్తి కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం?
1) ఆ వ్యక్తి కళ్లు మూసుకోలేడు
2) కంటిలో నొప్పి వస్తుంది
3) దృష్టి జ్ఞానం ఉండదు
4) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు
2. జతపరచండి.
1. కూటకం ఎ. త్రినాళ నిర్మాణం
2. కర్ణావర్తనం బి. పట్టెడ ఎముక
3. దాగిలి సి. అంక వన్నె
4. కర్ణాంతరాస్థి డి. సుత్తి ఎముక
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-బి, 4-ఎ, 4-సి
3. కింది అంశాలను అధ్యయనం చేయండి.
ఎ. లోపలి చెవి దేహాన్ని సమతాస్థితిలో ఉంచుతుంది
బి. స్వేదగ్రంథులు దేహ ఉష్ణోగ్రతా నియంత్రణలో తోడ్పడతాయి
సి. నాలుకపై రుచి గుళికలు ఉంటాయి
డి. చర్మస్రావ గ్రంథులు విసర్జనలో తోడ్పడతాయి
పైవాటిలో సరైన అంశాలను గుర్తించండి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, డి
4. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన విటమిన్?
1) ఎ 2) బి 3) సి 4) డి
5. కోర్టి అంగం అంటే?
1) కర్ణావర్తనం ఉపకళ రెసినార్ త్వచంపై ఏర్పరిచే జ్ఞానగట్టు
2) కర్ణాంతరాస్థి ఉపకళ బేసిల్లార్ త్వచంపై ఏర్పరిచే జ్ఞానగట్టు
3) కర్ణాంతరాస్థి ఉపకళ రెసినార్ త్వచంపై ఏర్పరిచే జ్ఞానగట్టు
4) కర్ణావర్తనం ఉపకళ బేసిల్లార్ త్వచంపై ఏర్పరిచే జ్ఞానగట్టు
6. చెవిలో శబ్ద తరంగాలు ప్రయాణించే మార్గాన్ని లోపలి నుంచి వెలుపలికి అమర్చండి.
1) బాహ్య శ్రవణ కుహరం- కర్ణభేరి- కూటకం- దాగిలి- కర్ణాంతరాస్థి- కర్ణావర్తనం- కోర్టి అవయవం-
శ్రవణనాడి- మెదడు
2) మెదడు-శ్రవణనాడి- కోర్టి అవయవం- కర్ణాంతరాస్థి- కర్ణావర్తనం- దాగిలి- కూటకం- కర్ణభేరి- బాహ్య శ్రవణ కుహరం
3) మెదడు-శ్రవణనాడి- కోర్టి అవయవం- కర్ణావర్తనం- కర్ణాంతరాస్థి- దాగిలి- కూటకం- కర్ణభేరి- బాహ్య శ్రవణ కుహరం
4) మెదడు- శ్రవణనాడి- కర్ణావర్తనం- కర్ణాంతరాస్థి- కర్ణావర్తనం- కర్ణాంతరాస్థి- కోర్టి అవయవం- దాగిలి- కూటకం- కర్ణభేరి- బాహ్య శ్రవణ కుహరం
7. శరీరమంతటా ఉష్ణాన్ని సమాన స్థాయిలో ఉంచే అవయవం?
1) మూత్రపిండాలు
2) హైపోథలామస్
3) చర్మం
4) పారాథైరాయిడ్ గ్రంథి
8. తక్కువ కాంతిలో చూడటానికి తోడ్పడేది?
1) రెటినా 2) కోరాయిడ్
3) శంకువులు 4) దండాలు
9. వర్ణ దృశ్యాలను చూడటానికి తోడ్పడేవి?
1) దండాలు 2) రెటినా
3) శంకువులు 4) కంటిపాప
10. జతపరచండి.
1. డెర్మటైటిస్ ఎ. కండరాలు
2. టెటానస్ బి. కన్ను
3. పమోరియా సి. దంతాలు
4. గ్లకోమా డి. చెవి
ఈ. చర్మం
1) 1-ఈ, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఈ, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-బి
11. మధ్య చెవిలోని ఎముకలు?
1) మాలస్ 2) ఇంకస్
3) స్టేపిస్ 4) పై మూడూ
12. జతపరచండి.
ఎ. నాసికా గ్రసని 1. చర్మస్రావ గ్రంథులు ఉండి దుమ్ము ధూళి రాకుండా నిరోధించడం
బి. అలిందం 2. ఘ్రాణ ఉపకళతో ఉండి, వాసన జ్ఞానాన్ని కల్పించడం
సి. శ్వాసభాగం 3. లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించడం
డి. ఘ్రాణ భాగం 4. పీల్చిన గాలిని శుభ్రపరచడం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
13. దేహాన్ని సమతాస్థితిలో ఉంచేది?
1) కన్ను 2) చెవి
3) ముక్కు 4) నాలుక
14. మానవుడి చెమటలో ఉండేది?
1) సిట్రిక్ ఆమ్లం
2) ఆస్కార్బిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం 4) పైరువిక్ ఆమ్లం
15. రాజు అనే వ్యక్తి చీకటిలో మిగతా వారికన్నా బాగా చూడగలుగుతున్నాడా? అయితే అతడి కంటిలో అధిక క్రియావంతమైనవి?
1) కోన్లు 2) యూవియా
3) అంధచుక్క 4) దండాలు
16. చెవి గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) చెవి వినడానికే కాకుండా శరీర సమతాస్థితిని కాపాడే అంగం
2) కర్ణభేరి త్వచం బాహ్యశ్రవణ కుహరాన్ని, మధ్య చెవిని వేరుచేసే పలుచని అర్ధ పారదర్శక విభాజకం
3) వినికిడి ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది యూస్టాచియన్ నాళం
4) చెవిలో మూడు అస్థి ఖండాలు ఉంటాయి
17. వెలుపలి చెవి శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్యం?
1) అనేక రకాల శబ్దాలను వినగలదు
2) శబ్ద పుట్టుకను, తేడాని తెలుసుకోలేదు
3) ఏమి వినలేరు
4) బాగా వినగలదు
18. మానవ శరీరంలో అతిపెద్ద అంగం?
1) మెదడు 2) గుండె
3) చర్మం 4) వెన్నెముక కండరాలు
19. మెదడులోని ఏ భాగం ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
1) ఘ్రాణ లశునం 2) పూర్వ మెదడు
3) 1, 2 4) హైపోథలామస్
20. రాణి అనే విద్యార్థిని ఎక్కువగా ఉప్పుగా ఉన్న పదార్థాలను రుచి చూసింది. అయితే అమె?
1) ఉప్పు పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంది
2) అంతకంటే తక్కువ ఉప్పుదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేదు
3) ఉప్పు పదార్థాలను తినడానికి ఇష్టపడదు
4) 1, 3
21. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది?
1) గుండె
2) చర్మస్రావ గ్రంథులు
3) హర్డీనియన్ గ్రంథులు
4) స్వేద గ్రంథులు
22. రుచి సమాచారం వరుస క్రమంను గుర్తించండి.
1) నాలుక- గ్రాహకం- రుచి రంధ్రం- నాడీ తంతువు- నాడీ- మెదడు
2) నాలుక- గ్రాహకం- రుచి రంధ్రం- నాడీ- నాడీ తంతువు- మెదడు
3) నాలుక- గ్రాహకం- నాడీ తంతువు- రుచి రంధ్రం- నాడీ- మెదడు
4) నాలుక- పాపిల్లే- రుచి రంధ్రం- గ్రాహకాలు-నాడీ తంతువు- నాడీ -మెదడు
23. ఆహారం రుచికి సంబంధించిన సరైన ఐచ్ఛికాన్ని గుర్తించండి.
ఎ) ప్రతిపాదన: జ్వరంతో బాధపడుతున్నప్పుడు నోటికి ఆహారం రుచిగా ఉండదు
బి) వివరణ: రుచి కణికల్లో ఉండే ఎంజైమ్ 77…0F నుంచి 98.6…0F వరకు మాత్రమే పనిచేస్తాయి
1) ఎ, బి సరైనవి ఎ కి బి సరైన వివరణ కాదు
2) ఎ సరైనది బి సరికాదు
3) ఎ, బి, సరైనవి బి కి ఎ సరైన వివరణ కాదు
4) ఎ, బి, సరైనవి ఎ కి బి సరైన వివరణ
24. కర్ణభేరి త్వచానికి ఇరువైపులా వాయు పీడనాన్ని సమాన స్థాయిలో ఉంచడానికి తోడ్పడేది?
1) పేటికా కుల్య 2) కర్ణాంతరాస్థి
3) యూస్టాచియన్ నాళం
4) అస్థిగహనం
25. పేటికా నాడి, కర్ణావర్తన నాడీ కలిసి ఏర్పడేది?
1) జిహ్వ నాడి 2) దృక్ నాడి
3) యూస్టాచియన్ నాడి
4) శ్రవణ నాడి
26. చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
1) 2 2) 1 3) 4 4) 3
27. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) స్కాలా వెస్టిబ్యులా, స్కాలా మీడియా, స్కాలాటింపాని కర్ణావర్తనంలోని భాగాలు
2) స్కాలా వెస్టిబ్యులా, స్కాలా మీడియాను రెసినర్స్ త్వచం స్కాలాటింపాని, స్కాలా మీడియాను బేసిల్లార్ త్వచం వేరు చేస్తాయి
3) స్కాలా వెస్టిబ్యులా, స్కాలాటింపాని పరలసిక ద్రవం స్కాలా మీడియా అంతర లసిక ద్రవంతో నిండి ఉంటుంది
4) స్కాలా వెస్టిబ్యులా గుండ్రటి సుషిరంతో స్కాలా టింపాని అండాకార సుషిరం వద్ద అంతమవుతాయి
28. మయోపిక్ వ్యక్తి చూడలేనివి?
1) దూరపు వస్తువులు
2) సమీప వస్తువులు
3) రంగులు
4) ప్రకాశవంతమైన కాంతి
29. జతపరచండి.
1. సర్కం వెల్లేట్ ఎ. ఉప్పు
2. పోలియేట్ బి. రుచి ఉండదు
3. ఫంగిఫామ్ సి. చేదు
4. ఫిలిఫామ్ డి. తీపి
5. ఫోలియేట్, ఇ. పులుపు ఫంగిఫామ్
1) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ
2) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఇ, 5-డి
30. అయోడాప్సిన్ ఏ నిర్మాణంలో ఉంటుంది?
1) దండాలు 2) శంకువులు
3) స్లీరా 4) కంటి కటకం
31. మానవుడి కంటిలోని కటకం?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) ద్విపుటాకార కటకం
4) బల్లపరుపు కటకం
32. శుక్లం వచ్చినప్పుడు కంటిలో దెబ్బతినేది?
1) కటకం 2) తారక
3) రెటీనా 4) ఐరిస్
33. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ. రుచి ఒక రసాయనిక జ్ఞానం
బి. పులుపు రుచిని గ్రహించే గ్రాహకాలు నాలుక అంచుల్లో ఉంటాయి
సి. చేదు రుచిని గ్రహించే గ్రాహకాలు నాలుక వెనుక భాగం మీద ఉంటాయి
డి. నాలుక మధ్య భాగంలో ఉప్పు రుచిని గ్రహించేది. నాలుక ముందు భాగంలో తీపిని గ్రహించే గ్రాహకాలు ఉంటాయి
1) ఎ, బి, సి, డి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి
34. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. కలశికలోని క్రిస్టా ఆంపుల్లారిస్ తల భ్రమణ దిశను గుర్తిస్తుంది
బి. పేటిక, గోణికల్లోని మాక్యులా అనే గట్టులో దేహ గది వలె నాభిని గుర్తించే గ్రాహకాలు ఉంటాయి
సి. గోణిక, పేటిక రేఖీయ త్వరణానికి సంబంధించి జ్ఞానాన్ని గుర్తిస్తాయి
డి. గోణిక దేహ నిల్వ కదలికలను, పేటిక అడ్డు కదలికలను గుర్తిస్తాయి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) డి
35. జీవశాస్త్రం పరంగా వాసన అనేది?
1) భౌతిక సంఘటన
2) ఉష్ణగ్రాహక చర్య
3) రసాయనాల సంఘటన
4) 2, 3
36. ఆధార్ గుర్తింపునకు ఇచ్చేటప్పుడు ఫొటో తీసే భాగం?
1) కంటి కటకం 2) కంటిపాప
3) తారక 4) కార్నియా
37. జతపరచండి.
1. ఫోవియా ఎ. చర్మం
2. శ్రవణ కుల్య బి. ముక్కు
3. ఘ్రాణ గ్రాహకాలు సి. పసుపు చుక్క
4. స్పర్శ గ్రాహకాలు డి. అంధ చుక్క
ఇ. అడిటరీ మీటస్
1) 1-సి, 2-ఇ, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఇ, 4-ఎ
3) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ
4) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ
38. ప్రాచీన కాలం నుంచి ఉన్నతమైన జ్ఞానంగా గుర్తించింది?
1) దృష్టి జ్ఞానం 2) జిహ్వ జ్ఞానం
3) ఘ్రాణ జ్ఞానం 4) స్పర్శా జ్ఞానం
39. మయోపియాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) దగ్గరి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి
2) ప్రతిబింబం రెటీనాకు ముందు ఏర్పడుతుంది
3) కుంభాకార కటకం వాడి దీన్ని నివారించవచ్చు
4) పుటాకార కటకం వాడి దీన్ని నివారించవచ్చు
40. కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి.
1) దీర్ఘ దృష్టిని నివారించడానికి కుంభాకార కటకాన్ని వాడతారు
2) ప్రెస్ మయోపియా ద్వినాభీ కటకాలతో ఈ లోపాన్ని సరిచేయవచ్చు
3) ఆస్టిగ్మాటిజం స్థూపాకార కటకాలతో ఈ లోపాన్ని సరిచేయవచ్చు
4) స్ట్రాబిస్ మాస్ పుటాకార కటకంతో ఈ లోపాన్ని సరిచేయవచ్చు
41. రవి గోళ్లను కత్తిరించుకుంటున్నాడు. అయితే అతడి గోళ్లలో ఉండే ప్రొటీన్ ఏది?
1) కెరోటిన్ 2) కెరోటిన్-ఎ
3) కెరాటిన్ 4) ల్యూసిన్
సమాధానాలు
1. 4 2.2 3.1 4.1
5.4 6.3 7.3 8.4
9.3 10.4 11.4 12.2
13.2 14.3 15.3 16.3
17.3 18.3 19.4 20.2
21.4 22.4 23.4 24.3
25.4 26.4 27.4 28.1
29.2 30.2 31.2 32.1
33.1 34.3 35.3 36.3
37.1 38.4 39.3 40.4
41.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు