Current Affairs MAY 03 | తెలంగాణ
తెలంగాణ
గజ్వేల్ దవాఖాన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం.. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించడం, ముర్రుపాల ఉపయోగాలు, ఫీడింగ్ విధానాలు మెచ్చి ఈ గుర్తింపు ఇచ్చారు. గజ్వేల్ దవాఖానకు గ్రేడ్-1 అక్రెడిటేషన్ అందిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఏప్రిల్ 25న వెల్లడించారు. ఈ గుర్తింపు 2026 వరకు కొనసాగుతుంది.
జలవనరులు
రాష్ట్రంలో కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు కలిపి మొత్తం జలవనరులు 63,063 ఉన్నాయని కేంద్ర జల్‌శక్తి శాఖ ఏప్రిల్ 25న వెల్లడించింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ జలవనరులు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి? ఎన్ని మరమ్మతులకు గురయ్యాయి? వాటి సామర్థ్యం ఎంత? ఏయే అవసరాలకు వాడుతున్నారు? తదితర అన్ని రకాల వివరాలను సమగ్రంగా సేకరించి నివేదికను రూపొందించింది. రాష్ట్రంలో 26,581 కుంటలు, 19,153 చెక్‌డ్యామ్‌లు, 15,850 చెరువులు, 264 సరస్సులు, 108 రిజర్వాయర్లు, ఇతర జలవనరులు 1107 ఉన్నాయి. దేశంలో అత్యధిక చెక్‌డ్యామ్‌లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఏపీ, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?