May 03 Current Affairs | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
శంకరన్
జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు, భారత సర్కస్ దిగ్గజం జెమినీ శంకరన్ ఏప్రిల్ 24న మరణించారు. 1924లో జన్మించిన ఆయన ప్రఖ్యాత సర్కస్ కళాకారుడు కీలెరి కున్హికన్నన్ వద్ద మూడేండ్లు శిక్షణ పొందారు. తర్వాత అప్పటి సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రిటైర్ అయ్యారు. 1951లో విజయా సర్కస్‌ను కొనుగోలు చేసి, దాని పేరును జెమినీగా మార్చారు. ఆయనకు కేంద్రం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందజేసింది.
శ్రీకాంత్
శ్రీకాంత్ ఎం భండీవాడ్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ (కేవీజీబీ) చైర్మన్‌గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో పీ గోపీకృష్ణ ఉన్నారు. శ్రీకాంత్ ఇదివరకు కెనరా బ్యాంక్ పట్నా సర్కిల్ అధిపతిగా పనిచేశారు. కెనరా బ్యాంక్‌లో 29 ఏండ్ల అనుభవం ఉంది.
షహబుద్దిన్
బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దిన్ చుప్పు ఏప్రిల్ 25న ప్రమాణం చేశారు. ఆయనను అధికార అవామీ లీగ్ ఈ పదవికి నామినేట్ చేసింది. ఈ పదవికి మరే ఇతర పార్టీ లేదా వ్యక్తి నామినేషన్ దాఖలు చేయలేదు. ఈయన కంటే ముందు ఈ పదవిలో మహమ్మద్ అబ్దుల్ హమీద్ ఉన్నారు. హమీద్ వరుసగా రెండు సార్లు అధ్యక్షుడిగా కొనసాగారు.
హరిహర మిశ్రా
అసోసియేషన్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ (ఏఆర్సీఎస్) కొత్త సీఈవోగా హరిహర మిశ్రా ఏప్రిల్ 25న నియమితులయ్యారు. ఇది దేశంలోని అన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల తరఫున బాధ్యత వహిస్తుంది. ఆయన 1982లో ఎస్బీఐలో కెరీర్ ప్రారంభించి, 2004 వరకు పనిచేశారు. అప్పటి నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ సెక్టార్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
ప్రకాశ్ సింగ్ బాదల్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఏప్రిల్ 25న మరణించారు. 1927, డిసెంబర్ 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానాలో జన్మించారు. 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 5 సార్లు సీఎంగా పనిచేశారు. 1970లో సీఎంగా ఎన్నికైనప్పుడు అప్పట్లో పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. 2012లో సీఎం పదవి చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగానూ(84) ఆయన రికార్డు సృష్టించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?